»   » సూపర్ హిట్ 'పెళ్లి చూపులు' టీవిలో ఈ రోజే

సూపర్ హిట్ 'పెళ్లి చూపులు' టీవిలో ఈ రోజే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూలై 19 న విడుదలైన పెళ్లి చూపులు చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. కోటి ముప్పై ఐదు లక్షల బడ్జెట్ లో తయారైన ఈ చిత్రం దాదాపు 40 కోట్లు వసూలు చేసింది. ఓవర్ సీస్ కలెక్షన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద హీరోలకు కూడా రాని క్రేజ్ ఈ చిత్రానికి వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడైపోయాయి. ఈ రోజు (పిభ్రవరి 10) ఈ చిత్రాన్ని జెమినీ టీవి ప్రసారం చేయనుంది. మంచి టీఆర్పీ లు వస్తాయని భావిస్తున్నారు.

అలాగే పెళ్లిచూపులు చిత్రం అలాగే కన్నడలోకి అమ్ముడుపోయిందని తెలుస్తోంది. త్వరలోనే కన్నడంలో రీమేక్ కానుంది. తెలుగులో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించగా కన్నడలో ఫస్ట్ ర్యాంక్ రాజులో హీరోగా నటించిన గురునందన్, యూటర్న్ చిత్రంలో తన నటనతో శాండల్‌ఉడ్‌ను తన వైపు తిప్పుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరో హీరోరుున్లు నటించనున్నారని సమాచారం. తెలుగులో తరుణ భాస్కర్ దాస్యమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడలో డ్యాన్‌‌స మాస్టర్, డెరైక్టర్ మురళి మాస్టర్ దర్శకత్వం వహించనున్నారని కన్నడ సినీ వర్గాల వినికిడి.విజయ్‌ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం ' పెళ్లి చూపులు'. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌బెన్‌ స్టూడియోస్‌, వినూతన గీతా పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. రాజ్‌ కందుకూరి, యస్‌. రాగినేని సంయుక్తంగా నిర్మించారు. యంగ్ హీరో నందు ఈ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో నాని ఫ్రెండ్‌గా నటించిన విజయ్‌కు ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టి , స్టార్ హీరోని చేసేసింది.

English summary
Low Budget film Pelli Choopulu film starring Vijay Devarakonda and Ritu Varma under the direction of Tarun Bhaskar will be screened on small screen on Feb 19 in Gemini TV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu