»   » సెక్స్ కోసం వేధించాడు: టీవీ నటుడుపై పోక్సో కేసు

సెక్స్ కోసం వేధించాడు: టీవీ నటుడుపై పోక్సో కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: టీవీ నటుడు పార్థ్ సంతాన్‌పై కేసు నమోదైంది. బంగూర్ నగర్‌లో నటుడు పార్థ్ సంతాన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మోడల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ముంబై పోలీసులు పార్థ్ సంతాన్‌పై పోస్కో చట్టంలోని 8,12 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పార్థ్ సంతాన్ మీద మార్చి నెలలో వేధింపుల కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 354 కింద పోలీసులు కేసు నమోదు చేసారు. తాజాగా అతడిపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ (pocso) కింద బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Parth Samthaan

20ఏళ్ల మోడల్ తన ఆదివారం సెకండ్ స్టేట్మెంట్ లో...... తన వయసు 16 ఉన్న సమయంలో, నాలుగు సంవత్సరాల క్రితం సంతాన్ తనను వేధింపులకు గురి చేసాడని పేర్కొనడంతో అతనిపై కఠినమైన పోస్కో సెక్షన్స్ యాడ్ చేసారు.

సంతాన్ తనను సెక్స్ కోసం డిమాండ్ చేసే వాడని, వేధింపులకు గురి చేసేవాడని ఆమె తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బాధితురాలికి నిందితుడితో పరిచయం ఉందని, ఎవర్ షైన్ నగర్, మలాద్(వెస్ట్)లో నివాసం ఉంటోందని తెలిపారు.

సంతాన్ హిందీ టెలివిజన్ షోలలో నటించాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి రిపోర్ట్స్ తయారు చేయలేదని తెలిపారు. సంతాన్ యాంటిసిపెటరీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

English summary
Television actor Parth Samthaan, who was booked for molestation under section 354 of the Indian Penal Code in March, has now been booked under the protection of children from sexual offences act (POCSO) by the Bangur Nagar police.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu