»   » వేధింపులే ప్రదీప్ ఆత్మహత్యకు కారణమా? భార్య స్నేహితుడు శ్రవణ్ పాత్రపై అనుమానం.. కీలక విషయాలు..

వేధింపులే ప్రదీప్ ఆత్మహత్యకు కారణమా? భార్య స్నేహితుడు శ్రవణ్ పాత్రపై అనుమానం.. కీలక విషయాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టెలివిజన్ నటుడు ప్రదీప్ ఆత్మహత్య పురోగతిని పోలీసులు సాధించినట్టు సమాచారం. ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జరిగిన పార్టీలో పాల్గొన్న వారికి పోలీసుల నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఈ కేసులో ప్రదీప్ మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టమ్ నివేదిక పోలీసులకు చేరింది. ఈ నివేదిక ఆధారంగా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని నార్సింగి పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం. ప్రదీప్ ఆత్మహత్యకు ముందు జరిగిన విందుకు హాజరైన వారిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపడుతామని పోలీసులు పేర్కొన్నారు.

గొడవ కారణంగానే..

గొడవ కారణంగానే..

సప్తమాత్రిక సీరియల్‌లో హీరోగా నటించిన ప్రదీప్ పుప్పాలగూడ అల్కాపురి కాలనీ గ్రీన్‌ ఇకానియా అపార్ట్‌మెంట్‌లో బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన భార్య పావని స్నేహితుడు శ్రావణ్ బర్త్‌డే వేడుకల్లో జరిగిన చిన్న గొడవ కారణంగా ప్రదీప్ ఉరేసుకున్నాడు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందనే విషయం తేలాల్సి ఉంది.

విభేదాలే కారణామా?

విభేదాలే కారణామా?

ప్రదీప్, ఆయన భార్య పావని మధ్య నెలకొన్న విభేదాలే ఆత్మహత్యకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడానికి భార్య పావని వేధింపులే కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగనుంది. ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రదీప్‌ది ఆత్మహత్యే అని తేలినప్పటికీ అతను ఆత్మహత్యకు పాల్పడటానికి గల ప్రధాన కారణాలేమిటనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.

భార్య, కుటుంబ సభ్యుల ఒత్తిడి..

భార్య, కుటుంబ సభ్యుల ఒత్తిడి..

నటుడు ప్రదీప్ భార్య పావని, ఆమె కుటుంబసభ్యుల ఒత్తిడి కారణంగానే ప్రదీప్ గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు, స్థానికులు ఇప్పటికే పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని అతని స్నేహితులు తెలిపారు. ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించేందుకు ప్రదీప్ ఆత్మహత్యకు ముందు రాత్రి ఇంట్లో ఉ న్న వారందరినీ విచారించాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.

లోతుగా దర్యాప్తు...

లోతుగా దర్యాప్తు...

టీవీ నటుడు ప్రదీప్‌కుమార్‌ ఆత్మహత్య కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంచందర్‌రావు వెల్లడించారు. ప్రదీప్‌ భార్య పావని, కుటుంబ స్నేహితుడు శ్రవణ్‌తో పాటు, బంధువులు, చుట్టుపక్కల వారిని, సహ నటీనటులనూ ప్రశ్నిస్తామని ఆయన తెలిపారు. వీరు కాక కేసుతో ఇంకెవరికైనా సంబంధం ఉందని తెలిస్తే వారిని కూడా విచారిస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు.

కాల్‌డేటా పరిశీలన..

కాల్‌డేటా పరిశీలన..

ప్రదీప్ మరణానికి సంబంధించి అనేక అనుమానాలు రేకెత్తుతున్నందన కేసు విచారణను వేగవంతం చేశాం. దర్యాప్తులో భాగంగా అందరి సెల్‌ఫోన్లు సీజ్‌చేసి కాల్‌ డాటా పరిశీలిస్తున్నాం. ప్రదీప్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలిస్తే, ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు ఎమైనా ఉంటే కేసులో చేరుస్తాం. గల్ఫ్‌లో పని చేసిన శ్రవణ్‌ నాలుగు నెలలుగా వారింట్లో ఉంటూ డైట్‌ కన్సల్టెంట్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ప్రదీప్ ఉదంతంలో అతడి పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా పావనిని ఇంకా విచారించలేదు అని రాంచందర్‌రావు తెలిపారు.

పోలీసుల చేతికి ఫోరెన్సిక్ నివేదిక

పోలీసుల చేతికి ఫోరెన్సిక్ నివేదిక

బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫోరెన్సిక్ నివేదికలో కీలక విషయాలు వెల్లడైనట్టు సమాచారం. తలకు, చేతికి గాయలయ్యి రక్తస్రావం జరిగిందని వచ్చిన వార్తలను ఫోరెన్సిక్ నివేదిక కొట్టిపారేసింది. ప్రదీప్ శరీరంపై అసలు ఎలాంటి గాయాలు లేవని ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణుడు తకీయుద్దీన్ వెల్లడించారు. అయితే ఆత్మహత్యకు ముందు ప్రదీప్ మద్యం సేవించి ఉన్న మాట వాస్తవమేనని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని ఆయన చెప్పారు. కానీ ఆ టైమ్‌లో అతడు ఎలాంటి ఆహారం తిన్నాడన్న దానిపై క్లారిటీ రాలేదని, అందుకోసం విస్రా రిపోర్టును పరిశీలనకు పంపామని ఫోరెన్సిక్ నిపుణుడు పేర్కొన్నారు.

English summary
Police starts indept investigation in Television Actor Pradeep suicide. Narsingi of Hyderabad polices sends notices to Pradeep, her wife pavani friends. Police are investigating Call data of Mobile who attended the party before Pradeep suicide incident.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu