»   » మెగా హీరో కోసం...సుమ పాడుతోంది, అనసూయ డాన్స్

మెగా హీరో కోసం...సుమ పాడుతోంది, అనసూయ డాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇది కాస్త ఆశ్చర్య పరిచే వార్తే. ప్రముఖ టీవి యాంకర్ సుమ ..సింగర్ గా మారుతున్నారు. అలాగే ఆమె పాట పాడేది ఓ ఐటం నెంబర్ అని తెలుస్తోంది. అంతేకాదు ఆ సాంగ్ లో డాన్స్ చేసేది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..ఇంకెవరు మరో టీవి యాంకర్ అనసూయ. ఇంతకీ ఏ చిత్రం కోసం ఈ పాట రికార్డింగ్ జరుగుతోందో తెలుసా... సాయి ధరమ్ తేజ తాజా చిత్రం విన్నర్ కోసం.

సంగీత దర్శకుడు తమన్ ...పలు సినీ పంక్షన్స్ లో సుమ గొంతు విని..ఆమెను పాట పాడటానికి ఒప్పించారు. మళయాళంలో పుట్టినా, తెలుగు టీవి ప్రపంచంలో సుమ నెంబర్ వన్. తెలుగుని తెలుగులో చాలా మంది కన్నా స్పష్టంగా పలకుతూ మాట్లాడటం ఆమె స్పెషాలిటి. అలాంటి ఆమె ఏకంగా తెలుగులో పాట పాడి సంచలనం సృష్టించబోతోంది. అదీ అనసూయ కాంబినేషన్ లో అంటే దుమ్మురేపటం ఖాయం కదా.

 Suma

ఇక విన్నర్ విషయానికి వస్తే... మినిమం గ్యారెంటీ దర్శకుడు గోపి చంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ చేస్తున్న చిత్రం విన్నర్..నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని అందుకే ఈ చిత్రానికి గతంలో అయిన విన్నర్ అనే టైటిల్ పెట్టినట్లు తెలిసింది.

'నీలాంటి వాళ్లు అడుగడుగునా ఉంటారు. నాలాంటోడు అరుదుగా ఉంటారు. అదే డేట్‌, అదే ప్లేస్‌, అదే టైమ్‌, అదే ట్రాక్‌, అదే రేంజ్‌, నేను రెడీ' అంటూ సాయిధరమ్‌ ఎనర్జిటిక్‌ ఫెర‍్మామ్మెన్స్‌తో వచ్చి న ట్రైలర్ సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు పోరాటం చేస్తాడు. అందులో గెలిచి విన్న‌ర్‌గా ఎలా నిలిచాడనేది ఈ చిత్ర కథ

దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన 'విన్నర్‌'. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), టాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసు కోగా తమన్ బాణీలు అందిస్తున్నాడు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాశ్, దర్శకత్వం: గోపిచంద్ మలినేని.

English summary
Suma has turned singer. She crooned a song for the first time in an upcoming movie titled 'Winner'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu