»   » బోయపాటి నేను ఇంట్లో లేని సమయంలో వచ్చి అలా మాట్లాడాడు :పోసాని ఆగ్రహం

బోయపాటి నేను ఇంట్లో లేని సమయంలో వచ్చి అలా మాట్లాడాడు :పోసాని ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా జనతాగ్యారేజ్ విజయం అనంతరం ..దర్శకుడు కొరటాల శివ ...ఇచ్చిన ఇంటర్వూలలో బోయపాటి పేరు ఎత్తకండానే తన అసంతృప్తివి వెల్లగక్కారు. బోయపాటితో తన గత అనుభవాలు, తను బాధపడిన సందర్బాలు గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు కొరటాల శివ గురువు పోసాని వంతు వచ్చింది.

పోసాని కృష్ణ మరళి ..బోయపాటిని టీవి షో లైవ్ లోనే బూతులుతో తిట్టిపోసారు. సినీ రచయితగా రెస్ట్ తీసుకుని, ఇప్పుడు నటుడుగా విజృంభిస్తున్న పోసాని నిజ జీవితంలో ముక్కు సూటి మనిషి. ఈ విషయం తెలుసుకునే అనుకుంటా..టీవి ఛానెల్స్ వారు ఆయన్ను పిలిచి ఏదో ఒక కాంట్రావర్శి చేసి తమ టీఆర్పీలు పెంచుకునే కార్యక్రమాలు పెట్టుకున్నారు.

'లం...కొడుకా..ఒరేయ్ నీ యమ్మ' అంటూ టీవి లైవ్ లో కోపంతో పోసాని, పెద్ద గొడవ

రీసెంట్ గా ఓ టీవి ఛానెల్ లో లైవ్ లో పాల్గొని కాంగ్రేస్ నాయకుడు విహెచ్ హనుమంతరావు పై ఓ రేంజిలో ఎటాక్ ఇచ్చిన పోసాని, ఆ సంఘటన మరిచిపోకుండానే మరో టీవి ఛానెల్ లో ప్రముఖ దర్శకుడు, ఆయన శిష్యుడు, బంధువు అయిన బోయపాటిపై విరుచుకు పడ్డారు.

ఓ చానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ బోయపాటి శ్రీను గురించి ప్రస్తవన తేవడం తో పోసాని ఆవేశం తో ఊగిపోయాడు..
బోయపాటి పై ఆగ్రహం ఎందుకంటే తన జిల్లా వాడు , తన కులం వాడు అని దగ్గరకు తీసుకొస్తే , నన్ను మోసం చేసాడని ఆగ్రహం వ్యక్తం చేసాడు పోసాని. ఆయనేం మాట్లాడారో చూద్దాం.

కోపంగా వాడే బోయపాటి

కోపంగా వాడే బోయపాటి

నా దగ్గర 30 మంది దాకా పనిచేసారు. అందరూ నాతో గౌరవంగా ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ గౌరవంగానే ఉన్నారు. ఒక్కడు తప్ప. నేను ఎవరినయితే ఇండస్ట్రీకి తీసుకువచ్చానో , ఎవరైతే ఇక్కడ పరిచయం చేసానో , ఎవరైడైతే పేదోడని చెప్పానో వాడు బోయపాటి శ్రీను.

వాళ్లనాన్న వాచ్ మెన్ గా చేస్తూ...

వాళ్లనాన్న వాచ్ మెన్ గా చేస్తూ...

బోయపాటి శ్రీను అనే వాడు చాలా చాలా చాలా పేదవాడు. ఒక చిన్న పూరీల్లు మాత్రమే ఉండేది. వాళ్ళ నాన్న ఒక ముస్లిం దర్గా దగ్గర వాచ్ మెన్ గా పని చేస్తూ 250 రూపాయలు వచ్చేది, దాని మీద బ్రతకాలి వీళ్ళంతా.

బోయపాటి అన్న రికమండేషన్ తో

బోయపాటి అన్న రికమండేషన్ తో

వాళ్ళన్నయ్యకు ‘బోయపాటి బ్రహ్మయ్య' అనే చిన్న ఫోటో స్టూడియో ఉండేది, తినడానికి సరిపోయే డబ్బులు మాత్రమే వస్తాయి. అతను నా దగ్గరకు వచ్చి... ‘అన్నా... తినటానికి కూడా జరగట్లేదు... కాస్త మా తమ్ముడు పైకొస్తే హెల్ప్ గా ఉంటుంది' అనే చెప్తే... వెంటనే పిలిపించమని చెప్తే అక్కడకు వచ్చిన బోయపాటి శ్రీను తనతో ఎలా ఉండేవాడో తన హావభావాలతో చేసి చూపించారు పోసాని.

నాకు తమ్ముడు అవుతాడని చెప్పా

నాకు తమ్ముడు అవుతాడని చెప్పా

బోయపాటి తన వద్ద రెండు చేతులు గట్టిగా ముడుచుకుని తల దగ్గరకు పెట్టి... అన్నాయ్ అని ఉండేవాడని... బోయపాటిను తీసుకువెళ్ళి ముత్యాల సుబ్బయ్య దగ్గరకు తీసుకువెళ్లి... నాకు తమ్ముడు అవుతాడు... అసిస్టెంట్ గా పెట్టుకోమంటే... అప్పటికే నా దగ్గర రెండు గ్రూప్ లు ఉన్నాయి... ఖాళీలు లేవు అన్నారని చెప్పారు

ఓకే పిలిపించు అన్నారు బోయపాటిని

ఓకే పిలిపించు అన్నారు బోయపాటిని

ముత్యాల సుబ్బయ్య గారు ఖాళీ లేదు అంటే, నేను మీకు 7 సినిమాలు చేశాను, 6 వంద రోజులు ఆడాయి, నా ముఖం చూసి పెట్టండి అంటే... ఏమయ్యా నువ్వు ఇట్లాంటివి భలే చెప్తావ్ అని ముత్యాల సుబ్బయ్య ఓకే అని పిలిపించమంటే.... అప్పటికీ కూడా మరో విజ్ఞప్తి చేసానని చెప్పుకొచ్చారు పోసాని.

నా రిక్వెస్ట్ పై పదేళ్లపాటు

నా రిక్వెస్ట్ పై పదేళ్లపాటు

ఒక సినిమా అయిపోగానే వదిలిపెట్టవద్దు... పదేళ్ళ పాటు బోయపాటిని మీ దగ్గర ఉంచుకోండి, వాడు డైరెక్టర్ అయ్యే దాకా చూడండి అని దండం పెట్టి నా వ్యక్తిగత విజ్ఞప్తిగా చెప్తే... ముత్యాల సుబ్బయ్య పదేళ్ళ పాటు పోషించారని చెప్పారు పోసాని.

నా రిక్వెస్ట్ పై పదేళ్లపాటు

నా రిక్వెస్ట్ పై పదేళ్లపాటు

ఒక సినిమా అయిపోగానే వదిలిపెట్టవద్దు... పదేళ్ళ పాటు బోయపాటిని మీ దగ్గర ఉంచుకోండి, వాడు డైరెక్టర్ అయ్యే దాకా చూడండి అని దండం పెట్టి నా వ్యక్తిగత విజ్ఞప్తిగా చెప్తే... ముత్యాల సుబ్బయ్య పదేళ్ళ పాటు పోషించారని చెప్పారు పోసాని.

బోయపాటి అంత దారుణంగా మాట్లాడాడు

బోయపాటి అంత దారుణంగా మాట్లాడాడు

నేను డైరెక్టర్ గా మారి ‘శ్రావణమాసం' అనే సినిమా తీస్తే అది దారుణ పరాజయం అయ్యింది. అప్పుడు వాడు నేను ఇంట్లో లేని సమయంలో వచ్చి... ‘వదినా... నేనంటే సినిమా డైరక్షన్ డిపార్టుమెంటులో ఉన్నాం, అన్నయ్య లేడు కదా అందుకే సినిమా పోయింది... అయ్యో రేపట్నుంచి ఇన్సురన్సు కట్టాలన్నా, డ్రైవర్ జీతాలు ఇవ్వాలన్నా, ఎలా కట్టగలుగుతారు' అన్నాడండి బోయపాటి శ్రీను.

బాధపడ్డాం బోయపాటి మాటలకు

బాధపడ్డాం బోయపాటి మాటలకు

అయితే నా భార్య మంచి చదువుకున్నది కాబట్టి బాధపడలేదు, కన్నీళ్లు పెట్టుకోలేదు, ఇంట్లోనే ఇబ్బంది పడింది. సాయంత్రం ఇంటికి వచ్చి ‘ఏంటి ఇలా ఉన్నావు?' అంటే ‘ఇలా జరిగింది' అని మొత్తం చెప్పిందని... మనం చాలా సహాయం చేసాము కదా... అతను ఎందుకు అంటాడు ఆ మాట అని బాధపడ్డామని చెప్పారు పోసాని.

మా ఇంటికొచ్చి బోయపాటి ఏడిస్తే..

మా ఇంటికొచ్చి బోయపాటి ఏడిస్తే..

బోయపాటి అలాగే ఏడుస్తున్నాడు... దైవసాక్షిగా చెప్తున్నా... నేనొచ్చి ఏంటిరా అంటే... అన్నయ్య హాస్పిటల్ కు వెళ్ళాలి డబ్బులు లేవు అంటే... నువ్వు ఏడవకురా... నీకు ఎంత కావాలో వదినను అడిగి తీసుకువెళ్ళు, హాస్పిటల్ బిల్లు మొత్తం మేమే ఇస్తాం... నేనున్నాను కదరా... ఎందుకు బాధపడతావు అని ధైర్యం చెప్పానని తెలిపారు.

బిల్లు మొత్తం మా ఆవిడే కట్టింది

బిల్లు మొత్తం మా ఆవిడే కట్టింది

మీ ఆవిడకు బిపి ఉంది కదా, స్కూటర్, ఆటో వద్దు...అని బోయపాటికి చెప్పానని, అప్పుడే కొత్తగా కారు కొన్నానని, ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉంది, ఆ తర్వాతే నేనే కొన్నాను, ఆ కారు ఇచ్చి పంపించాను, ఆ తర్వాత హాస్పిటల్ బిల్లు మొత్తం నా భార్యే కట్టింది...

ఏరిగెన్స్

ఏరిగెన్స్

అలాంటి బోయపాటి శ్రీను నా భార్య వద్దకు వచ్చి అలా బిహేవ్ చేయవచ్చా...? అసలు వాడికి నాకు పోటీ ఏంటి? వాడిది సానుభూతి కాదుగా, చీప్ బిహేవియర్, ఆరోగేన్స్, ఏదైతే నేను హెల్ప్ చేసానో అదే నా బాధ అన్నారు పోసాని.

త్రివిక్రమ్ , సంపత్ నంది చేయలేదే

త్రివిక్రమ్ , సంపత్ నంది చేయలేదే

ఏ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రవర్తించలేదే, కొరటాల శివ, సంపత్ నంది ప్రవర్తించలేదే... ఇండస్ట్రీలో ఎవరూ అంతలా నా మీద మాట్లాడలేదే... ఆ బాధ తప్ప వాడి మీద నాకు ఎందుకు ఉంటుంది బాధ అంటూ... సవివరంగా చెప్పారు పోసాని

కొరటాల అలా బోయపాటిపై

కొరటాల అలా బోయపాటిపై

గతంలో నందమూరి నటసింహం బాలకృష్ణతో బోయపాటి శ్రీను తీసిన "సింహా" సినిమా సందర్భంలో జరిగిన తెరవెనుక వాస్తవాలు కూడా ఇటీవల కొరటాల శివ ద్వారా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

సింహా విషయంలోనూ..

సింహా విషయంలోనూ..

‘సింహా' సినిమాకు కధ, మాటలు అందించిన కొరటాల పేరు టైటిల్ కార్డ్స్ లో వేయకుండా, తానే అందించినట్లుగా మొత్తం బోయపాటి పేరు వేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

English summary
Posani said that it is only Boyapati who is like this without any gratitude to whatever he had done. Other directors aren’t like him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu