స్కెచ్ మామూలుగా లేదుగా.... నాగబాబుకు పోటీగా రంగంలోకి పోసాని!
నాగబాబుకు గట్టి పోటీ ఇచ్చేందుకే మా టీవీ వారు పోసాని కృష్ణ మురళిని రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షో... ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ రేటింగుతో దూసుకెలుతున్న కామెడీ షో. ఈ షో వల్లే రేటింగ్స్ పరంగా ఈటీవీ గట్టి పోటీ ఇస్తోంది. ఇతర ఛానల్స్ ఈ షోను బీట్ చేసేందుకు ఎన్ని షోలు ప్లాన్ చేసినా 'జబర్దస్త్' షోకు సరైన పోటీ ఇవ్వలేక పోతున్నాయి, జబర్దస్త్ రేంజిలో రేటింగ్స్ రాబట్టలేక పోతున్నాయి.
మాటీవీ వారు 'జబర్దస్త్' షోకు గట్టి పోటీ ఇచ్చేందుకు పెద్దే స్కెచ్చే వేసినట్లు తెలుస్తోంది. గతంలో జబర్దస్త్ లో చేసిన ధనరాజ్, వేణుతో కలిసి 'దేశముదుర్లు' పేరుతో ఓ షో ప్లాన్ చేసారు. ఈ షోకు మరింత గ్లామర్ తెచ్చేందుకు ప్రముఖ నటుడు, కమెడియన్ పోసాని కృష్ణ మురళిని జడ్జిగా ఈ షోకు నియమించారు.

నాగబాబుకు పోటీగా పోసాని
జబర్దస్త్ షో ఇంత పాపులర్ కావడానికి స్కిట్లతో పాటు జడ్జిలుగా ఉన్న నాగబాబు, రోజాలు కూడా ఓ కారణం. నాగబాబుకు గట్టి పోటీ ఇచ్చేందుకే మా టీవీ వారు పోసాని కృష్ణ మురళిని రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

కొత్త కొత్త ప్లాన్స్
‘దేశముదుర్లు' షో బాగా పాపులర్ చేసేందుకు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. టాప్ రేటింగ్ సాధించడంలో భాగంగా పలు సంచలనాలు కూడా ఈ షోలో ఉండబోతున్నట్లు టాక్.

నా భార్యను చచ్చిపొమ్మన్నా: రామ్ చరణ్‌ను అవమానిస్తారా? .... పోసాని ఫైర్!

అతని కంటే పెద్ద తీవ్రవాది లేడు: స్టార్ హీరోపై పోసాని కామెంట్స్



Click it and Unblock the Notifications











