‘బాహుబలి’ , ‘భజరంగి భాయీజాన్’ రికార్డ్ లు బ్రద్దలు

By Srikanya

ముంబై : ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో పూర్తిగా సౌత్ గాలి వీస్తోంది. అక్కడ సౌత్ నుంచి వచ్చిన ‘బాహుబలి' డబ్బింగ్ అయి టీవిలో రికార్డ్ లు బ్రద్దలు కొడితే...సౌత్ కథతో వచ్చిన ‘భజరంగి భాయీజాన్' కూడా కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ లు బ్రద్దలు అయ్యే సమయం వచ్చేసింది.

రీసెంట్ గా స్టార్ గోల్డ్ ఛానెల్ లో ఫిబ్రవరి 14న సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ప్రేమ రతన్ ధన్ పాయోని ప్రసారం చేసారు. ఈ చిత్రం టీఆర్పీల్లో ఎవరూ ఊహించని కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది. అందుతున్న సమచారం ప్రకారం..ప్రేమ్ రతన్ ధన్ పాయో.. 25119 స్కోర్ చేస్తే... భజరంగీ 23745. బాహుబలి... 20777 స్కోర్ చేసింది.

 PRDP Broke TRP Records of ‘Bajrangi Bhaijaan’ & ‘Baahubali’

టీఆర్పీ భాషలో చెప్పాలంటే... ప్రేమ్ రతన్ థన్ పాయో చిత్రం 16.4 టీఆర్పీ వచ్చింది. భజరంగీ భాయాజాన్ కు 15.5 టీఆర్పీ వచ్చింది. ఈ రెండింటికన్నా బాహుబలి తక్కువ టీఆర్పీ వచ్చింది.

సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు నటించిన ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రాజశ్రీ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూ.80 కోట్లబడ్జెట్‌తో నిర్మించింది. సూరజ్‌ భరజాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

 PRDP Broke TRP Records of ‘Bajrangi Bhaijaan’ & ‘Baahubali’

సూరజ్‌ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తొలిరోజే బాక్సాఫీసు వద్ద ఈ హిందీ చిత్రం దాదాపు రూ.40 కోట్ల కలెక్షన్లు సాధించింది.

ఇక సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా రూపొందిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' ప్రపంచ వ్యాప్తంగా 5,300 థియేటర్లలో గురువారం విడుదలైంది. భారత్‌లోనే 4,500పైగా థియేటర్లలో, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 800 థియేటర్లలో చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలీల' పేరుతో విడుదల చేశారు. తెలుగులో సల్మాన్‌ఖాన్‌కు రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ విశేషం.

ఈ చిత్రం పాకిస్థాన్‌లోనూ విడుదలైంది. తెలుగులో 'ప్రేమలీల', తమిళంలో 'మెయ్‌ మరన్‌దాయో అన్బే' పేరిట తీసుకొచ్చారు. అమెరికన్‌ రచయిత మార్క్‌ ట్వెయిన్‌ రాసిన 'ది ప్రిన్స్‌ అండ్‌ ది పాపర్‌' కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X