For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ ‘పైసా వసూల్’: శానిటరీ నాప్కిన్ల గొడవ, ఆమెకు ప్రిన్స్ ముద్దు!

  By Bojja Kumar
  |

  తెలుగు టెలివిజన్ రంగంలో సరికొత్తగా మొదలైన 'బిగ్ బాస్' రియాల్టీ షో ఎవరూ ఊహించని మలుపులు, టాస్క్‌లతో దూసుకెలుతోంది. భారీ ప్రేక్షకాదరణతో, హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తూ దూసుకెలుతున్న ఈ షోలో..... బిగ్ బాస్ టాస్క్‌లు చాలా వింతగా ఉంటున్నాయి.

  తాజాగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ 'పైసా వసూల్-లగ్జరీ బడ్జెట్' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండు గ్రూఫులుగా విడగొట్టారు. ఒక గ్రూఫును ఇంటి యజమానులుగా, ఒక గ్రూఫును వినియోగదారులుగా ఫిక్స్ చేశారు.

  పైసా వసూల్

  పైసా వసూల్

  ‘పైసా వసూల్-లగ్జరీ బడ్జెట్' టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు కొంత డబ్బు ఇచ్చిన బిగ్ బాస్ వింత గేమ్ ఆడించారు. ఇందులో భాగంగా వినియోగదారులు తినడానికి తిండి, పడుకోవడానికి బెడ్, తాగడానికి వాటర్, యూజ్ చేసుకోవడానికి టాయ్‌లెట్ తదితరాలు డబ్బులకు కొనుక్కోవాల్సి ఉంటుంది.

  Bigg Boss Telugu : 16th Day Episode Seen Like Midnight Masala
  విజేతలు

  విజేతలు

  ఇంటి యజమానులు ఎంత డబ్బు డిమాండ్ చేస్తే అంత ఇచ్చి తమ అవసరాలు తీర్చుకోవాలి. వారు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే అంతే. ఈ గేమ్‌లో చివరకు ఏ టీం దగ్గర ఎక్కువ డబ్బు మిగిలితే ఆ టీమ్ విన్నర్. ఈ టాస్క్‌లో వినియోగదారుల టీం విజయం సాధించింది.

  శానిటరీ నాప్కిన్ల గొడవ

  శానిటరీ నాప్కిన్ల గొడవ

  అయితే టాస్క్ జరిగే క్రమంలో శానిటరీ నాప్కిన్ల విషయంలో వినియోగదారుల టీం సభ్యురాలు అర్జన, ఇంటి యజమాని టీం సభ్యురాలు హరితేజ మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. టాయిలెట్ వెళ్లడానికి, శానిటరీ నాప్కిన్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటావా అంటూ.... అర్చన, ఆదర్శ్ హరితేజతో గొడవ పెట్టుకున్నారు.

  నేను అమ్మాయినే, అంత చీప్ మనిషిని కాదు..

  నేను అమ్మాయినే, అంత చీప్ మనిషిని కాదు..

  శానిటరీ నాప్కిన్ల గొడవపై హరితేజ ఫీలైంది. తనను వాళ్లు అమ్మాయిలా ట్రీట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నేను చెప్పిన దాన్ని వారు మిస్ అండర్‌స్టాండ్ చేసుకున్నారని.... శానిటరీ నాప్కిన్లకు తాను డబ్బులు అడగలేదని, నేను అంత చీప్ మనిషిని కాదని తెలిపింది. అయితే అర్చన కల్పించుకోవడంతో ఈ గొడవ సద్దుమనిగింది.

  తిండి లేక, నిద్ర లేక అవస్థలు

  తిండి లేక, నిద్ర లేక అవస్థలు

  అయితే ఇంటి జయమానుల టీం.... ఫుడ్, బెడ్ కోసం వేలల్లో రేట్లు ఫిక్స్ చేయడంతో వినియోగ దారుల టీం ఇబ్బందులు పడ్డారు. విజేతలు కావాలనే తపనలో తిండి, నిద్ర మానేసి అవస్థలుపడ్డారు. ప్రత్యర్థి టీం కంటే ఎక్కువ డబ్బు కూడబెట్టి విజేతలుగా నిలిచారు.

  చిన్న చిన్న గొడవలు

  చిన్న చిన్న గొడవలు

  ‘పైసా వసూల్-లగ్జరీ బడ్జెట్' టాస్క్ జరిగే క్రమంలో ఇంటి యజమానులు, వినియోగదారుల టీం మధ్య చిన్న గొడవలు చోటు చేసుకున్నాయి. ఓవరాల్‌గా ఈ టాస్క్ రసవత్తరంగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా జరిగిందనే చెప్పుకోవచ్చు.

  ఐపాడ్, టీవీ, వీడియో గేమ్ కోసం తహతహ

  ఐపాడ్, టీవీ, వీడియో గేమ్ కోసం తహతహ

  బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి ఇంటి సభ్యులు టీవీ, ఫోన్, మ్యూజిక్, వీడియో గేమ్ లాంటి ఎంటర్టెన్మెంట్స్ ఏమీ లేక అల్లాడి పోయారు. ‘పైసా వసూల్-లగ్జరీ బడ్జెట్' ద్వారా వచ్చిన డబ్బుతో టీవీ, ఫోన్, మ్యూజిక్ వినడానికి ఐపాడ్, ఎక్స్ బాక్స్ లాంటి వీడియో గేమ్స్ కొనుక్కోవాలని ప్లాన్ చేశారు కానీ.... బిగ్ బాస్ వాటికి భారీగా ధరలు పెంచేసి వాటిని ఇంటి సభ్యులకు దక్కనివ్వలేదు.

  దీక్షను ముద్దాడిన ప్రిన్స్

  దీక్షను ముద్దాడిన ప్రిన్స్

  పనులు సరిగా చేయడం లేదని ప్రిన్స్.... కొత్తగా ఇంట్లోకి ఎంటరైన దీక్షాపంత్‌తో చిన్నగా గొడవ పడ్డారు. గొడవ తర్వాత ఆమెకు సారీ చెప్పే క్రమంలో ఆమె బుగ్గపై ముద్దు పెట్టేశాడు. సారీ ఎలా చెప్పాలి అని మహేష్ కత్తిని సలహా అడగ్గా.... బుగ్గుమీద ముద్దు పెట్టి చెప్పేయ్ అని అతడు చెప్పడంతో ప్రిన్స్ ఈ పని చేశాడు. ఇలా సరదా సరదా సంఘటనలతో బిగ్ బాస్ రియాల్టీ షో బుధవారం ఆసక్తికరంగా సాగింది.

  English summary
  Bigg Boss Season 1, Episode 18 details. Prince Kisses Diksha. Hari Teja is low after a quarrel with her team mates. Prince and his team win the luxury budget task. Later, he surprises a shy Diksha Panth with a kiss.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X