Bigg Boss Buzz: నన్ను అలా తొక్కేశారు.. అందుకే ఎలిమినేట్ అయ్యా.. ప్రియాశెట్టి

Priya Shetty Bigg Boss Buzzz Interview: బిగ్ బాస్ సీజన్ 9లో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్‌ పేరుపొందిన ప్రియశెట్టి ఎలిమినేట్ అయ్యింది. ఆమె గేమ్ నచ్చక ఆడియన్స్ ఓట్లు వేయడం మానేశారు. దీంతో మూడోవారం ప్రియశెట్టి ఎలిమినేట్ అయింది. అనంతరం బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి హాజరయ్యింది. ఈ షోను ప్రస్తుతం శివాజీ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు వారాలుగా శివాజీ ఇంటర్వ్యూలలో అంత బజ్ లేదని నెట్టింట్లో ట్రోల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ట్రోల్స్ కు చెక్ పెట్టేందుకు ప్రియశెట్టి ఎపిసోడ్‌లో మాత్రం శివాజీ గట్టిగానే ప్లాన్ చేశారు. తన పంచ్ డైలాగ్స్, పంచ్ లతో చుక్కలు చూపించారు. నెత్తికెక్కిన తల పొగరును ఒక్కసారిగా దించేశారు.

ప్రియశెట్టి బిగ్ బాస్ బజ్ షోకు రాగానే గట్టిగా అరుసుకున్నారు. సోఫాలో సాగిలాపడి కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు. పైగా ఇలా కూర్చోవడం బాగాలేదుగా అని ప్రియను అడిగాడు. దీంతో ఆమె షాక్ అయ్యింది. తరువాత షోకు సంబంధించిన ఒక ఫొటోను చూపించారు. అందులో ఆమె నాగార్జున ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం హైలైట్ చేశారు. ఈ విషయంపై శివాజీ ఓ రేంజ్లో సీరియస్ అయ్యారు. "అక్కడ హోస్ట్ నాగార్జున ఉన్నాడు. ఎవరైనా సరే.. హోస్ట్ ముందు ఇలా కూర్చోవడం సరైనది కాదు. ఇది మర్యాద కాదమ్మా" అంటూ క్లాస్ పీకారు. దీనిపై ప్రియశెట్టి సైలెంట్ అయిపోయింది. "మేం అంతగా ఆలోచించలేదు" అంటూ తన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.

Priya Shetty Bigg Boss Buzzz Interview Sivaji Hard Hitting Punches Go Viral

ఆ తరువాత శివాజీ అసలు గేమ్ స్టార్ చేశారు. 'మీరు మాట్లాడితే కామనర్స్, సెలబ్రిటీలు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అగ్ని పరీక్షలో ఎన్ని రోజులు ఉన్నారు? బిగ్ బాస్ షోలో ఎన్ని రోజులు ఉన్నారు? 'అని ప్రశ్నించారు. దాదాపు రెండు నెలలు ఉన్నామంటూ సైలెంట్ గా సమాధానం వచ్చింది ప్రియ. 'ఇప్పుడు మీరు సెలబ్రిటీలు కాదా? కాలేదని మీరు అనుకోని ఇలా బిహేవ్ చేస్తే.. కొంపదీసి మీరు పెద్ద సెలబ్రిటీలు అయితే.. అప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు ?' అంటూ నిలదీశాడు.

ఆ షాక్ నుంచి ప్రియా బయటకు రాకముందుగే.. 'అసలు మీరు బిగ్ బాస్ లోకి ఎందుకు వచ్చారు? ఇంతకీ బిగ్బాస్ లో విన్ కావడానికి ఏం చేశారు? అని ప్రశ్నించగా. టైటిల్ కొట్టడానికి బిగ్ బాస్ లో అడుగు పెట్టాను. కానీ వాళ్ల వల్ల నాకు అవకాశం రాలేదు. అంటూ బదిలిచ్చింది. వెంటనే శివాజీ రియాక్ట్ అయి... ప్రియకు కంప్లైంట్ చేయడమే తప్ప.. ఆటలు ఆడడం రాదని జనాలలో మీపై ఓ గట్టి నమ్మకం ఏర్పడింది'అని శివాజీ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. 'ఇక్కడ బాగానే ఉంటున్నారు. అక్కడ అలా ఎందుకు బిహేవ్ చేశారు? అని ప్రశ్నించగా.. 'మీలాగా ఎవరు అక్కడ చెప్పలేదు? 'అని అమాయకంగా సమాధానం చెప్పింది. దీంతో రియాక్ట్ అయిన శివాజీ 'మీరు ఎవరిని మాట్లాడిన ఇచ్చారు చెప్పండి' అని ప్రశ్నించారు. దీంతో ప్రియా నేనా అంటూ సైలెంట్ అయిపోయింది.

'అగ్ని పరీక్షలో ఉన్న కాన్ఫిడెన్స్ .. బిగ్ బాస్ లోకి వచ్చాక ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారింది కదా' అని శివాజీ ప్రశ్నించగా.. 'హౌస్ లో కొందరూ తొక్కేస్తున్నారు సార్' అని బదులిచ్చింది. 'నీ వాయిస్ తో ఇతరులను తొక్కేసావు'అంటూ ఫైర్ అయ్యారు. ఇలా ఘాటు ప్రశ్నలు దీటైన సమాధానాలతో బిగ్ బాస్ బజ్.. ఉత్కంఠ గా సాగింది.

హౌస్‌లోకి అగ్నిపరీక్ష ద్వారా పాజిటివ్ వైబ్‌తో వెళ్లిన ప్రియశెట్టి.. బయటికి వచ్చేసరికి పూర్తిగా నెగిటివిటీతో ముగిసిందని శివాజీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆమె దమ్ము శ్రీజాతో క్లోజ్ బాండ్ ఈ ఎలిమినేషన్‌కు కారణమైందని చెప్పారు. ఇక ఆమె వాయిస్ కారణంగా మొదట ఆకర్షణగా ఉన్నా.. చివరికి అదే వాయిస్ ఇరిటేట్ చేసి, ఓటింగ్‌లో వెనకబడేలా చేసిందని విశ్లేషించారు. అయితే ఒక విషయంలో మాత్రం ప్రియశెట్టిని ప్రశంసించాల్సిందే. హౌస్‌లో ఉన్న కాట్రాజ్ లకు దూరంగా ఉండి.. తన క్యారెక్టర్‌ను నిరూపించుకుంది. ఎవరితో ఎలా ఉండాలో.. అలా వ్యవహరించింది. లిమిట్స్ క్రాస్ చేయకుండా, మర్యాదగా ప్రవర్తించింది. ఇక శివాజీ బిగ్ బాస్ బజ్‌లో వేసిన క్లాస్, ఇచ్చిన పంచ్‌లు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

More from Filmibeat

Read more about: bigg boss buzz shivaji priya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X