Priya Shetty Remuneration: బిగ్‌బాస్ నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్.. మూడు వారాలకు డాక్టరమ్మ ఫీజు ఎంతంటే?
ఆదివారం వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ లవర్స్ టీవీలకు అతుక్కుపోతారు. వారంలో ఏ రోజు మిస్ అయినా సరే సండే మాత్రం ఖచ్చితంగా ఎపిసోడ్ చూడాల్సిందే. కింగ్ నాగార్జున ఎంట్రీతో పాటు ఎలిమినేషన్ ఉండటంతో ఆ రోజు షో ఉత్కంఠగా సాగుతోంది. బిగ్‌బాస్ తెలుగు 9 ఈ ఆదివారంతో మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టనుంది. అయితే బిగ్‌బాస్ తెలుగు నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
నామినేషన్స్‌లో ఆరుగురు
బిగ్‌బాస్ తెలుగు 9లో తొలివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, రెండో వారంలో మర్యాద మనీశ్ ఇంటి ముఖం పట్టారు. దీంతో ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో సోమవారం జరిగిన నామినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారు పవన్ కళ్యాణ్, ప్రియ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

షాకిచ్చిన బిగ్‌బాస్
అయితే బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని పుకార్లు వినిపించాయి. దీనిని నిజం చేస్తూ టాప్ కంటెస్టెంట్ సంజన గల్రానీని ఇంటి నుంచి బయటికి పంపించాడు. ఆమె ఇంటిలోనే సీక్రెట్ రూమ్‌లో ఉందని కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్న వేళ.. ఆమెను సడెన్‌గా వేదిక మీదకు పిలిచాడు నాగార్జున. దీంతో సంజన ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయినట్లేనని అందరూ భావించారు. అయితే ఇక్కడే నాగ్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. సంజనను పిలిచినట్లే పిలిచి, ఆమెను కంటెస్టెంట్స్ కోరిక మేరకు హౌస్‌లోకి పంపిస్తానని కానీ ఇందుకోసం కొన్ని త్యాగాలు చేయాలని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు రీతూ చౌదరి హెయిర్ కట్ చేయించుకోగా.. తనూజ కాఫీ తాగడం మానేస్తానని చెప్పింది. ఇక్కడితో సంజన ఎలిమినేషన్ లేదని క్లారిటీ వచ్చేయగా.. మరి ఆదివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా? అని ఉత్కంఠ నెలకొంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని బట్టి బిగ్‌బాస్ తెలుగు 9లో మూడో వారంలో రాము రాథోడ్ దాదాపు 27.11 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉండగా.. ఫ్లోరా షైనీ 22.19 శాతం ఓటింగ్‌తో తర్వాతి స్థానంలో నిలిచారు. అనంతరం రీతూ చౌదరి 13.99 శాతం, హరిత హరీశ్ 12.95 శాతం, పవన్ కళ్యాణ్ 12 శాతం, ప్రియా శెట్టి 11.05 శాతం ఓటింగ్‌తో నిలిచారు. వీరిలో పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టిలు డేంజర్ జోన్‌లో నిలవగా ఇద్దరిలో అతి తక్కువ ఓటింగ్‌తో ప్రియాశెట్టి ఈ వారం ఎలిమినేట్ అవుతారని ఖాయంగా వినిపిస్తోంది.
మరోసారి కామనర్ ఔట్
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రియా శెట్టి.. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం నిరాశ పరిచింది. శ్రీజతో కలిసి నోరు వేసుకుని అరవడం తప్పించి ఈమె పెద్దగా ప్రభావం చూపించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రకరకాల కారణాలతో ఈసారి నామినేషన్స్‌లో పెద్దగా ఓట్లు పొందలేకపోయింది ప్రియ. దాంతో ఎన్నో ఆశలతో హౌస్‌లో అడుగుపెట్టి.. మూడో వారానికే దుకాణం సర్దేసే పరిస్ధితి తెచ్చుకుంది ప్రియ.
ప్రియా శెట్టి రెమ్యునరేషన్ ఎంత?
కామనర్స్ కోటాలో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియకు రోజుకు 10 వేల రూపాయల చొప్పున మూడు వారాలకు గాను రూ.2,10,000లను పారితోషికంగా చెల్లించినట్లుగా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











