»   » ప్రియాంక చోప్రా చేసిన క్రైమ్ ఏంటి..ఆ సంకెళ్లు ఏంటి..?

ప్రియాంక చోప్రా చేసిన క్రైమ్ ఏంటి..ఆ సంకెళ్లు ఏంటి..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రియాంక చోప్రాకు సంకెళ్లు వేసిన ఈ క్రింద పోస్టర్ చూడండి. ఈ పోస్టర్ ఇప్పుడు బుల్లి తెర చూసేవారిలో మంచి ఆసక్తిని రేపుతోంది. మీ ఊహ కరెక్టే...ఆమె నటిస్తున్న హిందీ సీరియల్ గురించే ఈ వార్త. రీసెంట్ గా ఆ సీరియల్ నిర్మాతలు కొత్త పోస్టర్ విడుదల చేశారు. చేతికి సంకెళ్ళతో బందింపబడ్డ ప్రియాంక పోస్టర్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. అసలు ప్రియాంక చేసిన క్రైమ్ ఏంటో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ లను చూడక తప్పదు మరి.

సీరియల్ విషయాల్లోకి వెళితే..

ఏబీసీ తెరకెక్కిస్తున్న హాలీవుడ్‌ టీవీ షో 'క్వాంటికో'లో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ షోలో పోలీసు అధికారిగా ప్రియాంక అలెక్స్‌ పార్సి పాత్రలో కనిపించనుంది. ఈ సీరియల్లో శృంగారాత్మక సన్నివేశాల్లోనూ ప్రియాంక నటించటం సంచలనం రేపింది. ఇప్పటివరకు ప్రసారమైన ఎపిసోడ్ లలో ప్రియాంక ట్రైనింగ్ తీసుకుంటున్న ఎఫ్.బి.ఐ. అధికారిగా నటించింది. అమెరికా ట్విన్ టవర్స్ కూలిన 9/11 ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈ సీరియల్ తెరకెక్కించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Priyanka Chopra Is Quite the Wanted Woman in ABC's Quantico Poster

ఎఫ్ బీ ఐ ట్రైనీగా సత్తా చాటుకోవాలని పరితపించే యువతిగా క్వాంటికో సీరీస్ లో ప్రియాంక కనిపిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో భారతీయ మూలాలు ఉన్న పిగ్గీచాప్స్ ఓ కేస్ లో ఇరుక్కుంటుంది... దాని నుంచి ఆమె ఎలా బయటపడింది? తన నిజాయితినీ ఎలా నిరూపించుకుంది అన్నదే ఈ సీరీస్ సారాంశం.

అంతే కాదు తాజాగా గంగాజల్-2లోనూ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనుంది ప్రియాంకా చోప్రా. యాంక చోప్రా ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం గంగాజల్‌-2 చిత్రీకరణ త్వరలో పూర్తికానుంది. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక పోలీసు అధికారిణిగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశలో ఉన్నట్లు ప్రియాంక ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

ప్రియాంక టీవీ షో పట్ల బాలీవుడ్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీరియల్‌లో డౌగ్రే స్కాట్ యాస్ లియామ్, మిరండా, యాస్మిన్ అల్ మస్రీ, జొహన్న బ్రాడీ, టేట్ ఎల్లింగ్‌టన్, సిమన్, గ్రాహమ్ రోజర్స్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

English summary
The official poster for ABC’s Quantico highlights star Priyanka Chopra (who revealed the art via Twitter), though under perhaps unexpected circumstances.
Please Wait while comments are loading...