Bigg Boss Telugu 5 అన్నయ్య అని పిలువాలని.. పింకితో మానస్.. బట్టలిప్పి నిలుచుకొంటా.. యాంకర్ రవి
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 5లో తొమ్మిదో వారానికి కెప్టెన్ కోసం టాస్క్ మొదలైంది. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో ఇంటి సభ్యులు పోటాపోటిగా తలపడ్డారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులను రెండు జట్లుగా విభజించారు. ఒక్కో జట్టుకు సంబంధించిన టాస్క్‌ను ఇచ్చారు. అయితే తాజా ప్రోమో ప్రకారం.. ఇంటి సభ్యుల మధ్య వ్యూహాలు ఎలా ఉన్నాయంటే..
Photo Courtesy: Star మా and Disney+Hotstar

సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్
సూపర్ విలన్ గ్రూప్‌కు నలుపు డ్రస్సులు, సూపర్ హీరో డ్రస్సులకు రెడ్ డ్రస్సు ఇచ్చారు. అయితే విలన్ గ్రూప్‌లో యాంకర్ రవి తన టీమ్ సభ్యులతో కలిసి వ్యూహాలకు పదునుపెట్టారు. విలన్ అంటే కచ్చితంగా విలన్‌లానే వ్యవహరించాలి. కావాలంటే నేను సీజనంతా బట్టలిప్పి నిలుచోమంటే నిలుచుంటాను అంటూ రవి తనదైన శైలిలో ఇంటి సభ్యులకు సలహాలు ఇస్తూ కనిపించారు.

యాంకర్ రవికి కష్టమైన టాస్క్
యాంకర్ రవిని పడగొడితే.. ఆ టీమ్ అంతా సెట్ అవుతుంది అని కాజల్‌కు సూపర్ హీరోస్ టీమ్ సభ్యుడు షణ్ముఖ్ చెబుతూ కనిపించారు. అయితే వారి టీమ్‌లో క్రూయల్‌గా కనిపించేది కాజల్ మాత్రమే. వారికి అంత ఆలోచన లేదు అని చెప్పారు. ఊహించినట్టుగానే యాంకర్ రవికి కష్టమైన పనులను అప్పగించారు. ఒకే గుటకలో గ్లాస్ కషాయం, ఇతర డ్రింక్స్ తాగమని చెప్పారు. అలాగే పేడ నీళ్లు తలపై పోసుకోవాలని సూచించారు. అంతేకాకుండా డంబెల్స్ భుజాల మీద పెట్టుకొని బస్కీలు తీయాలని సూచించారు. అయితే రవికి వెన్నుముక నొప్పి ఉంది.. జాగ్రత్త అంటూ అనీ మాస్టర్ చెప్పడం కనిపించింది.

సీజన్ మొత్తానికి అన్నయ్యగా అంటే
ఇక ఇంటిలో మానస్, ప్రియాంక సింగ్ మధ్య ఓ లవ్ ట్రాక్ నడుస్తున్నది. అయితే వారిద్దరూ ఒకరిపై ఒకరు ఇష్టం ఉన్నా బయటకు చెప్పుకొనే పరిస్థితి కనిపించలేదు. అయితే టాస్క్‌లో భాగంగా ఇద్దరు వేర్వేరు టీమ్‌లో ఉన్నారు. ఈ సందర్బంగా పింకితో మాట్లాడుతూ.. ఈ సీజనంత నిన్ను అన్నయ్య అని పిలువమని అంటారేమో అని మానస్ అన్నారు. అలాగైతే మరీ దారుణం అంటూ ప్రియాంక కళ్లు మూసుకొన్నది.

ఎమోషనల్ టాస్కులు ఇవ్వాలంటూ షన్ను
ఇక సూపర్ విలన్స్‌కు ఫిజికల్ టాస్కులు ఇస్తే ఈజీగా చేసేస్తారు. వాళ్లకు ఎమోషనల్ టాస్కులు ఇవ్వాలి అంటూ షణ్ముఖ్ జస్వంత్ చెబుతూ కనిపించారు. అయితే అనీ మాస్టర్‌తో రవి మాట్లాడుతూ.. సూపర్ హీరోలకు ఫస్ట్ టార్గెట్ నువ్వే. కాబట్టి టాస్కుల్లో ఆడని బయటకు రావొద్దు. క్విట్ కావొద్దు అని రవి సూచించారు.

సిరి, విశ్వకు మధ్య వాగ్వాదం
కెప్టెన్సీ పోటీదారులు టాస్క్ గందరగోళంగా సాగింది. గేమ్ సందర్భంగా షణ్ముఖ్‌కు సిరికి, అలాగే విశ్వకు ప్రియాంకు మధ్య వాగ్వాదం జరిగినట్టు కనిపించింది. ఓ దశలో సిరి హన్మంతుపై గట్టిగా షన్ను అరిచాడు. అలాగే సింగర్ శ్రీరామచంద్ర తలకు షేవర్ పెట్టడంతో లెటర్ ఇచ్చినా కూడా ఇలా చేస్తావా జెస్సీ అంటూ ఆయన అనడం కనిపించింది.

9వ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయింది వీరే
ఇక నవంబర్ 2వ తేదీ ఎపిసోడ్‌లో ట్విస్ట్ తర్వాత తొమ్మిదో వారం ఎలిమినేషన్స్‌కు సంబంధించిన నామినేషన్స్‌పై స్పష్టత వచ్చింది. శ్రీరామచంద్ర, వీజే సన్నీ, కాజల్, ప్రియాంక, సిరి, జస్వంత్, విశ్వ, యాంకర్ రవి నామినేట్ అయ్యారు. అయితే టాప్ కంటెస్టెంట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











