అదరింది: నాగార్జున తో కమల్ హాసన్ ఇలా... (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : నాగార్జున సూపర్ హిట్ టీవి షో...‘మీలో ఎవరు కోటీశ్వరుడు' సెకండ్ సీజన్ చివరకు వచ్చేసింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ ఈ శుక్రవారం 9.30 కు ప్రసార్ కానుంది. ఫస్ట్ సీజన్ కు చిరంజీవి గారు ముగింపు పలికారు. ఇప్పుడు కమల్ హాసన్ ... హాట్ సీట్ లో కూర్చుని ముగింపు ఇస్తున్నారు. ఈ మేరకు స్పెషల్ సెలబ్రటీ ఎపిసోడ్ ప్రోమోను మాటీవి విడుదల చేసింది. మీరూ ఓ లుక్కేయండి ఆ ప్రోమోపై

అరవై సంవత్సరాల వయస్సులోనూ కమల్ హాసన్ చాలా ఫిట్ గా ఉండి..లోక నాయుకుడు అనిపించుకున్నారు. చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ కు విపరీతమైన రేటింగ్ వచ్చింది. అలాగే కమల్ పాల్గొంటున్న ఈ ఎపిసోడ్ సైతం చాలా బాగా పండుతుందని భావిస్తున్నారు. ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యిందని,తన మనస్సుకు బాగా నచ్చిన షో అని నాగార్జున అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ... ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా ఆడియన్స్ తో నేరుగా కలిసే అవకాశం లభించింది. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రతి క్షణం ఎంతగానో ఎంజాయ్ చేశాను. నా మనసుకు దగ్గరైన కార్యక్రమం ఇది అని అని చెప్పుకొచ్చారు. అలాగే....పోటీలలో పాల్గొన్న వారి హుందాతనం, అమాయకత్వం, అంకితభావం, వారి కుటుంబ నేపథ్యం తనను ఎంతో ఆకట్టుకున్నాయని నాగార్జున అన్నారు.

Promo: Kamal Haasan for MEK 2nd Season Final Episode!

అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ షో దిగ్విజయంగా సెకండ్ సీజన్ ని సైతం పూర్తి చేసుకోవటంతో మాటీవి యాజమాన్యం సైతం చాలా సంతోషంగా ఉంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో కోటి రూపాయల ప్రైజ్ మనీతో ఓ గేమ్ షో ప్రసారం కానుండటం ఇదే ప్రథమం.

ఇంతకాలం సినిమాల ద్వారా వినోదం పంచుతూ వచ్చిన తాను మొదటిసారి టెలివిజన్ తెరపైకి వచ్చానని నాగార్జున అన్నారు. ఒక సామాజిక బాధ్యతతో ఈ గేమ్ షోకు ప్రయోక్తగా వ్యవహరించాననీ, అమితాబ్ ముద్రను అందుకోవడం చాలా కష్టమని తెలుసనీ, తన శక్తివంచన లేకుండా బాగా చేయడానికి కృషి చేసాననీ చెప్పారు. చాలా మంది సామాన్య పౌరుల కలల్ని నిజం చేయడం ద్వారా వారి జీవితాల్ని ఈ షో మార్చుతోందని ఆయన అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X