twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు టీవీ ఛానెళ్ళు ముందు నటుల నిరసన

    By Srikanya
    |

    Protest against dubbed serials gain steam
    హైదరాబాద్ : డబ్బింగ్ సీరియల్స్ ని వెంటనే ఆపాలని తెలుగు టెలివిజన్‌ పరిశ్రమ పరిరక్షణ సమితి ఐకాస ప్రతినిధులు, సభ్యులు, జూనియర్‌ ఆర్టిస్టులు, టీవీ నటీనటులు, సాంకేతిక నిపుణులు పంజాగుట్ట డివిజన్‌లోని జీ తెలుగు, ఆర్‌.వి.ఎస్‌. ఛానెల్‌తో పాటు పలు టెలివిజన్‌ కార్యాలయాల ముందు నిరసన తెలిపారు.

    ఈ కార్యక్రమంలో కన్వీనర్‌, ప్రొడ్యూసర్‌ నాగబాల సురేష్‌కుమార్‌, బెంగుళూరు పద్మ, గుత్తికొండ భార్గవ్‌, విజయ్‌యాదవ్‌ తదితరులు మాట్లాడుతూ అనువాద ధారావాహికలను నిలిపివేయాలని పలు టెలివిజన్‌ సంస్థలను కోరామని, తమ వినతిని పరిశీలించిన ఈటీవి లాంటి సంస్థలు ముందుకు వచ్చి ఆపుతామని హామీ ఇచ్చారని, కానీ ఇంకా కొన్ని టీవి ఛానెళ్ళనుంచి ఎలాంటి సమాధానం అందలేదని దీంతో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.

    మార్చి 30వ తేదీ వరకు ఇది కొనసాగుతుందన్నారు. 31వ తేదీన తెలుగు టెలివిజన్‌ షూటింగులు ఉండవన్నారు. ఇందుకోసం బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. ఏప్రిల్‌ 1వ తేదీనుంచి ధర్నాచౌక్‌లో ఉగాదివరకు నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, ఇతర పరిశ్రమల వర్గాలు తప్పనిసరిగా పాల్గొనాలని ఐకాస విజ్ఞప్తి చేస్తోందన్నారు. ఏప్రిల్‌ 12వ తేదీన నటుడు విజయ్‌యాదవ్‌ ధర్నాచౌక్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నట్లు తెలిపారు.

    అనువాద కళాకారులు, యూనియన్ల వారు కూడా ధారావాహికలకు అనువాదం చెప్పడం ఆపి ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. పరిశ్రమకు చెందిన ప్రతి వ్యక్తి ఈ కార్యాచరణను అమలు చేయాలని వారు కోరారు. అనంతరం జీటీవీ బిజినెస్‌ విభాగాధిపతి అనురాధకు వినతి పత్రాన్ని అందజేయగా మూడు నాలుగు రోజుల్లో తమ కార్యాలయ అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయానికి వస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

    English summary
    
 While ETV and Gemini have agreed to stop airing dubbed serials by Ugadi, Maa and Zee are yet to follow suit. Artistes and technicians of the Telugu television industry have decided to intensify their agitation against dubbed serials from Monday. The course of agitation includes a fast-unto-death by TV actor Vijay Yadav from April 12.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X