»   » ఆ టీవీ చానళ్లపై వేటు సరైందే: ఆర్ నారాయణమూర్తి

ఆ టీవీ చానళ్లపై వేటు సరైందే: ఆర్ నారాయణమూర్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొత్తగా కొలువదీరిన తెలంగాణ శాసన సభా ప్రజాప్రతినిధు అగౌరవ పరిచే విధంగా టీవీ9 చానల్ ప్రసారాలు ఉండటంతో ఆ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పై కూడా కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. మరో వైపు హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ రెండు ఛానళ్ల ప్రసారాలను ఆపరేటర్స్ నిలిపి వేసారు.

దీనిపై దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని ఆర్.నారాయణమూర్తి అన్నారు. టీవీ9 ప్రసారాలను నిలుపుదల చేయడం సమంజసమేనని అభిప్రాయపడ్డారు. తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'రాజ్యాధికారం' చిత్రంపై మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు. మీడియాలో ప్రసారమయ్యే కార్యక్రమాలు చైతన్యవంతంగా, ఆలోచింపజేసేవిగా ఉండాలి కానీ సంస్కృతిని, సంప్రదాయాలను, యాస, భాషను కించపరిచేలా ఉండకూడదన్నారు.

R Narayana Murthy supports ban on TV9

రాజ్యాధికారం సినిమా వివరాల్లోకి వెళితే...
విప్లవ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాజ్యాధికారం'. ఆయన నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, ఎల్.బి.శ్రీధర్, తెలంగాణా శకుంతల కీలక పాత్రలు చేసారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Actor cum filmmaker R Narayana Murthy has supported the decision to ban news channels TV9 in Telangana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu