Just In
- 58 min ago
క్రాక్ సినిమాకు రవితేజ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. కానీ ఇప్పుడు జేబుల్ ఫుల్.. అంతకుమించి!
- 1 hr ago
చివరి నిమిషంలో లెక్కలు మార్చిన వకీల్ సాబ్.. ఒక్కసారిగా పెరిగిన రేటు.. మంచి లాభమే!
- 2 hrs ago
బాక్సాఫీస్ ఫైట్: అల్లుడు అదుర్స్ vs రెడ్.. థియేటర్స్ కోసం గొడవలు.. చివరికి ఎంత రాబట్టారంటే?
- 2 hrs ago
RED Movie Day 1 Collections: రికార్డు స్థాయిలో వసూల్ చేసిన రామ్.. ఫస్ట్ డే ఎంత రాబట్టాడంటే!
Don't Miss!
- News
ఎలా ఓడిపోయాడో తెలియదంట ... పూర్తిగా మారిపోయానని కొత్త డ్రామాలు : చంద్రబాబుపై సాయి రెడ్డి వ్యంగ్యం
- Finance
ఫిబ్రవరి 1న 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
- Sports
ISL 2020-21: గోవా గోల్స్ మోత.. జంషెడ్పూర్ చిత్తు!
- Lifestyle
Army Day 2021 : ‘సరిలేరు మీకెవ్వరు’ ఇవి తెలిస్తే.. సైనికులకు సలాం కొట్టకుండా ఉండలేరు...!
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇక్కడ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. అక్కడ దుమ్ములేపుతూ కౌశల్, రాహుల్ ట్విస్ట్
ప్రస్తుతం ఎక్కడ చూసిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలె ఎపిసోడ్ రచ్చ కనిపిస్తోంది. సెప్టెంబర్ 6న మొదలైన షో విజయవంతంగా నడిచింది. మొత్తానికి నేటి ఈ నాల్గో సీజన్‌కు ఎండ్ కార్డ్ పడుతోంది. విన్నర్ ఎవర్నది అందరికీ ముందే తెలిసిపోయింది. ఇక రన్నర్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ గొడవ అంతా ఒకవైపు ఉంటే.. బిగ్ బాస్ సెకండ్, థర్డ్ సీజన్ల విజేతలైన కౌశల్, రాహుల్ మాత్రం వేరే చోట రచ్చ చేస్తున్నారు.

సుమ స్పెషల్ షో..
సుమ తాజాగా ఓ స్పెషల్ షోను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సుమ, యాంకర్ రవి కలిసి బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అనే ఓ కొత్త షోను హోస్ట్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు బాగా క్లిక్ అయ్యాయి. సుమ, రవి పంచ్‌లు, సెటైర్లు బాగానే వైరల్ అవ్వడంతో షో మీద హైప్ పెరిగింది.

కాన్సెప్ట్ అదే..
బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో సెలెబ్రిటీలు గెస్ట్‌లు వస్తుంటారు. మరో వైపు పార్టిసిపెంట్స్ కూడా ఉంటారు. సెలెబ్రిటీలు ఇచ్చే చాలెంజ్‌లను అవతల ఉన్న పార్టిసిపెంట్‌లు చేస్తుంటారు. అందులో సాహసం చేయర డింభకా కాన్సెప్ట్‌లు, డ్యాన్సులు ఇలా రకరకాల టాస్కులు ఉండబోతోన్నట్టు తెలుస్తున్నాయి. మొత్తానికి ఈ షో షూటింగ్ స్టార్ట్ అయింది.

మొదటి గెస్ట్‌లు..
అయితే ఈ షోకు సంబంధించి మొదటి గెస్ట్‌లు.. బిగ్ బాస్ విజేతలను తీసుకొచ్చినట్టున్నారు. కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ సెట్‌లో రచ్చ చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను కౌశల్ తాజాగా షేర్ చేశాడు. బిగ్ బాస్ ఫినాలె ఎపిసోడ్ రోజున.. బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ కోసం బీబీ2, బీబీ3 విన్నర్ కలిస్తే ఎలా ఉంటుంది అంటూ ఓ పోస్ట్ పెట్టాడు.

అందరూ షాక్..
అయితే కౌశల్ షేర్ చేసిన ఈ ఫోటోలు జీ తెలుగు అనే హ్యాష్ ట్యాగ్ పెట్టడం, మళ్లీ బిగ్ బాస్ తెలుగు అనే హ్యాష్ ట్యాగ్ పెట్టడంతో అందరూ తికమకపడ్డారు, మధ్యలో జీ తెలుగు ఎందుకు వచ్చిందంటూ ఆశ్చర్యపోయారు. అయితే అది సుమ నిర్వహించే బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ షో కోసం గెస్ట్‌లు వెళ్లారని తెలుసుకోవడంతో అందరూ నోరెళ్లబెట్టారు.