For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దూరంగా ఉంటోన్న శ్రీముఖి.. ఫోన్ చేసినా మాట్లాడలేదు.. రాహుల్ కామెంట్స్

  |

  బిగ్‌బాస్ హౌస్‌లో ఎన్ని జరిగినా బయటకు వచ్చాక వాటిని ఎక్కువగా గుర్తు పెట్టుకోరు. అయితే కొంత మంది కంటెస్టెంట్లు మాత్రం అక్కడ జరిగిన గొడవలు, పెరిగిన దూరాన్నే తలుచుకుంటూ ఉంటారు. లోపల బంధాలను ఏర్పరుచుకుని ఒక్కటిగా కలిసిపోయిన వారు బయటకు వచ్చాక అవే రిలేషన్‌షిప్స్‌ను కొనసాగిస్తారు. ఈ మూడో సీజన్ గడిచాక కొంత మంది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. మరొకొంత మంది ఏమీ పట్టనట్టు వారి పనుల్లో బిజీ అయిపోయారు.

  సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న గ్యాంగ్స్..

  సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న గ్యాంగ్స్..

  శివజ్యోతి, హిమజ, అషూ, రోహిణి కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోండగా.. వరుణ్, వితికా, పునర్నవి, రాహుల్ హల్ చల్ చేస్తోన్నారు. వీరితో కలిసి అలీ రెజా, రవికృష్ణ కూడా దుమ్ములేపుతున్నారు. అయితే మిగతా వారు మాత్రం ఎక్కువగా కనబడటం లేదు. మిగతా కంటెస్టెంట్లతోనూ కలిసి ఎంజాయ్ చేసినట్టు ఎక్కడా కనిపించడంలో లేదు.

  మాల్దీవులకు చెక్కేసిన శ్రీముఖి..

  మాల్దీవులకు చెక్కేసిన శ్రీముఖి..

  బిగ్‌బాస్ మూడో సీజన్‌కు విన్నర్‌కు ఒక్క అడుగు దూరంలో.. రన్నరప్‌గా మిగిలింది శ్రీముఖి. హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే.. మాల్దీవులకు చెక్కేసింది. అన్ని రోజుల ఫ్రస్ట్రేషన్‌ను అక్కడ ఎంజాయ్ చేసి తీర్చేసుకుంది. తన తమ్ముడు, స్నేహితులతో వారం రోజుల పాటు అక్కడే గడిపి ఫుల్ ఫన్‌ను క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.

  దూరంగానే ఉంటోన్న రన్నర్..

  దూరంగానే ఉంటోన్న రన్నర్..

  అక్కడి నుంచి తిరిగి వచ్చాక కూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో అంతగా కలవడం లేదు. అందరికీ దూరంగానే ఉండాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తోంది. తన డైలీ రొటీన్ వర్క్‌తో పాటు.. కొత్త ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన షూటింగ్లతో బిజీగా ఉంటోంది. హౌస్‌లో ఉన్నంతసేపు కూడా శ్రీముఖి ఎవ్వరితోనూ అంతగా రిలేషన్ మెయింటెన్ చేయలేదు.. తాను కేవలం గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చానని, సంబంధాలు పెట్టుకోవడానికి కాదని ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే బయటకు వచ్చిన శ్రీముఖి.. తన పనేదో తాను చేసుకుపోతోందని తెలుస్తోంది.

  ఫోన్ చేసినా మాట్లాడలేదు..

  ఫోన్ చేసినా మాట్లాడలేదు..

  విన్నర్‌గా నిలిచిన రాహుల్.. తనకు ఓట్లేసి గెలిపించిన చిచ్చాలకు అంకితమిచ్చేందుకు ఓ లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహించబోతోన్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి ఓ ప్రెస్ మీట్‌ను పెట్టి అనేక విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో తాను శ్రీముఖికి ఫోన్ చేశానని, వేరే ఎవరో లిఫ్ట్ చేశారని, షూటింగ్‌లో ఉందని చెప్పారని తెలిపాడు. మళ్లీ తిరిగి కాల్ చేయలేదు.. తానే మళ్లీ శ్రీముఖికి కాల్ చేస్తానని, ఆ కాన్సర్ట్‌కు పిలుస్తానని చెప్పుకొచ్చాడు.

  #CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update
  ముఖ్య అతిథులుగా..

  ముఖ్య అతిథులుగా..

  నవంబర్ 29న హైద్రాబాద్‌లో జరగనున్న లైవ్ కాన్సర్ట్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తరుణ్ భాస్కర్, విశ్వక్సేన్ లాంటి వారంతా హాజరువుతారని, ఇంకా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నానని, తన గ్యాంగ్ అయిన వరుణ్, వితికా, పునర్నవి అయితే కచ్చితంగా వస్తారని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి తన చిచ్చాలందరూ రావాలని కోరాడు. తెలుగు సింగర్స్ చరిత్రలో ఎన్నడూ నిర్వహించనంత ఘనంగా లైవ్ కాన్సర్ట్ చేయబోతున్నామని తెలిపాడు.

  English summary
  Bigg Boss 3 Telugu Rahul Sipligunj Live Concert On 29th November. Srimukhi Didn't Talk To Him While He Called. This Live Concert Event Is Graced By talasani Srinivas Yadav.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X