For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాహుల్ ఫాదర్‌కు హార్ట్ ఎటాక్.. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి.. నేనింకా చిన్నదాన్నే.. పునర్నవి కామెంట్స్

  |

  బిగ్‌బాస్ షోలో రాహుల్, పునర్నవి, వరుణ్, వితికా ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఈ గ్యాంగ్ చేసే అల్లరి, చిలిపి చేష్టలు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాహుల్, పునర్నవి మధ్య ఉన్న కెమెస్ట్రీకి ఎంతో మంది అభిమానులున్నారు. వీరిద్దరి రహస్య బంధంపై ఎన్నో రూమర్స్ వస్తుండగా.. తామిద్దరు మంచి స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. అయినా వారిద్దరి మధ్యఏదో ఉందన్న రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ఇద్దరు అనేక విషయాలను వెల్లడించారు.

  మూడో రోజే హార్ట్ ఎటాక్..

  మూడో రోజే హార్ట్ ఎటాక్..

  తాను 'బిగ్ బాస్' హౌస్ లోకి వెళ్లిన మూడో రోజున నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందట అని రాహుల్ చెప్పుకొచ్చాడు. దాంతో తన బంధువులు .. స్నేహితులు తనకు ఆ విషయాన్ని తెలియపరచాలని అనుకున్నారట. అయితే తన కుటుంబ సభ్యులు మాత్రం, తనకు ఆ విషయం తెలిస్తే తట్టుకోలేనని తెలియనివ్వలేదట.

  ఆటపై ప్రభావం..

  ఆటపై ప్రభావం..

  ఒక వేళ ఆ విషయం తెలిస్తే తాను ఆడే ఆటపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో తనకు చెప్పలేదట. బయటికి వచ్చిన తరువాతనే తనకూ తెలిసిందని పేర్కొన్నాడు. తన కోసం తల్లిదండ్రులు ఆ బాధను దిగమింగుకున్నారని, అలాంటి తల్లిదండ్రులకు కొడుకునైనందుకు సంతోషిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

  ఆ సమయంలో డిప్రెషన్‌లోకి..

  ఆ సమయంలో డిప్రెషన్‌లోకి..

  తనకు ఓ క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడని, అయితే తానెప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. చదువుకోవడానికి అమెరికా వెళ్లానని, కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని తెలిపింది. ఇక్కడికి తిరిగి వచ్చాక.. అతను చనిపోయాడు.. శ్రీలంక బాంబ్ బ్లాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయాడని ఎమోషనల్ అయింది. మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదని, ఆ సమయంలో కొన్ని రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి తన కథను చెప్పుకుని ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.

  సినిమాలంటే ఆసక్తి..

  సినిమాలంటే ఆసక్తి..

  పునర్నవి మాట్లాడుతూ.. మొదటి నుంచి కూడా తనకు నటనపట్ల ఆసక్తి ఎక్కువని, ఆ ఆసక్తి కారణంగానే తాను సినిమాల వైపు అడుగువేశానని తెలిపింది. 'ఉయ్యాలా జంపాలా' వంటి హిట్ మూవీ చేసిన తరువాత కూడా నా కెరియర్ స్పీడ్ అందుకోలేదనీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయానని అందరూ అంటున్నారు.

  #CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
  నేనింకా చిన్నదాన్నే..

  నేనింకా చిన్నదాన్నే..

  కానీ ఆ సినిమా చేసేటప్పటికి తన వయసు కేవలం 17 సంవత్సరాలేనని, అందువలన ఒక వైపున నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ, మరో వైపున చదువును కొనసాగిస్తూ ఉండటం వలన పూర్తి దృష్టి పెట్టలేకపోయానని తెలిపింది. ఇంకా తాను చిన్నదానినే కావడం వలన, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నానని పేర్కొంది. ఆశించినస్థాయిని అందుకుంటానని నమ్ముతున్నానని చెప్పుకొచ్చింది.

  English summary
  Rahul Sipligunj And punarnavi Reveals Facts In Alitho Saradaga Interview. Duo Praticipated In ALi Tho Saradaga Prograame. She Tells About Her Friend's Death In Bomb blast. Rahul Gets Emetional While He Knows His Father Got Haet Attack.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X