రాహుల్ బర్త్ డే.. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ హంగామా.. ఆమె మాత్రం కనిపించలేదు!!
బిగ్‌బాస్ మూడో సీజన్ ఎన్నో రకాల మలుపులు తిరిగింది. మొదట్లో గ్రూపులు కట్టిన వారంతా మధ్య మధ్యలో మారిపోయారు. దాదాపు మూడు నాలుగు గ్రూపులు వెలువడ్డాయి. శ్రీముఖి గ్యాంగ్, వరుణ్ సందేశ్ గ్యాంగ్, అలీ రెజా గ్యాంగ్ అంటూ ఇలా మొదట్లో ఎవరికి వారుగా ఉండేవారు. రాను రాను ఈ గ్రూపుల్లో మార్పులు వచ్చాయి. కానీ వరుణ్ సందేశ్ వితికా రాహుల్ పునర్నవి ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. మధ్యలో వీరు కూడా కాస్త సైడ్ అయినట్టు కనిపించినా.. చివరకు మాత్రం మళ్లీ ఒక్కటే అయ్యారు.

చివర్లో వారితో..
రాహుల్ సిప్లింగ్ చివర్లో అలీ రెజా, శివ జ్యోతిలతో బాగా క్లోజ్ అయ్యాడు. వీరితోనే ఎక్కువగా గడిపేవాడు. అయితే వరుణ్ సందేశ్ వితికాలతోనూ బాగానే ఉండేవాడు. ఇక టాప్ 5లోకి వచ్చిన తరువాత అలీ రెజా, రాహుల్, వరుణ్ సందేశ్ బాగా క్లోజ్ అయ్యారు. బయటకు వచ్చాక అలీ రెజా ఫ్యామిలీ, వరుణ్ సందేశ్ ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతున్నాడు రాహుల్.

సపరేట్ గ్యాంగ్..
ఇక రాహుల్ వరుణ్ వితికాలు చాలా సందర్భాల్లో కలిసి పార్టీలు చేసుకున్నారు. కానీ వీటికి పునర్నవి మాత్రం దూరంగానే ఉంటూ వచ్చింది. ఇక శివ జ్యోతి గృహ ప్రవేశం రోజున కూడా పునర్నవి దూరంగానే ఉంది. ఆ సమయంలో రవి, అలీ, హిమజ, అషూ, రాహుల్, వరుణ్, వితికా, రోహిణి అందరూ వచ్చి సందడి చేశారు. ఇక ఎప్పుడు పార్టీ జరిగినా దాదాపు వీరే ఉంటున్నారు. మహేష్ విట్టా, శ్రీముఖి వంటి వారైతే ఎప్పుడూ కనిపించలేదు.

రాహుల్ బర్త్ డే..
నేడు (ఆగస్ట్ 22) రాహుల్ బర్త్ డే. ఈ సందర్భంగా నిన్న రాత్రి అందరికీ పార్టీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ వేడుకల్లో రవి, అలీ, హిమజ, అషూ, శివజ్యోతి, రోహిణి, మహేష్ విట్టా,పునర్నవి సందడి చేశారు. కానీ శ్రీముఖి మాత్రం కనిపించలేదు. ఈటీవీ షోలో మాత్రం వీరు బాగానే సందడి చేశారు.
Recommended Video

జంటలతో ఎంజాయ్..
రాహుల్ బర్త్ డేకు అలీ రెజా తన భార్య మసూమతో, శివజ్యోతి తన భర్త గంగూలీతో వచ్చి సందడి చేశారు. వీరు జంటగా ఎంజాయ్ చేస్తే.. రవి, హిమజ, అషూ సింగిల్‌గా దుమ్ములేపారు. ఈ ఈవెంట్‌లో రాహుల్ పాట పాడి అందర్నీ ఎంటర్టైన్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే పునర్నవి మాత్రం రాహుల్‌కు స్పెషల్ విషెస్ చెప్పింది. మేమంతా నిన్ను లవ్ చేస్తున్నాం చిచ్చా అంటూ బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక ఏది ఏమైనా శ్రీముఖి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











