Just In
- 16 min ago
పవన్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్: ఆమె కారణంగానే ‘వకీల్ సాబ్’ హిట్.. మైనస్ అనుకున్నదే ప్లస్ అయింది
- 48 min ago
యాక్టర్ హేమ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ.. ఆ పార్టీలో చేరి జోరుగా ప్రచారం
- 52 min ago
పబ్లిక్‌లో పచ్చిగా ప్రవర్తించిన బిగ్ బాస్ భామ: అక్కడ ముద్దులు.. పాడు పనులు చేస్తూ అలా బుక్కైంది
- 1 hr ago
మలైకా అరోరా చేతికి నిశ్చితార్థం ఉంగరం.. పెళ్లికి ముందు అసలు గుట్టు అదే..
Don't Miss!
- Finance
ఎయిర్ ఇండియా సేల్.. ఫైనాన్షియల్ బిడ్స్ ఆహ్వానించిన కేంద్రం.. సెప్టెంబర్ నాటికి విక్రయించేలా...
- News
వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు హైదరాబాద్ పోలీసులు షాక్: కొన్ని గంటల ముందు..!
- Sports
IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్‌కు కరోనా!
- Automobiles
టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!
- Lifestyle
వేసవిలో పుచ్చకాయ రసం తాగితే శరీరానికి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హౌలేగాడు, గూట్లే అంటూ నానా మాటలు... సుధీర్ అంటే అంత చులకనా?.. రెచ్చిపోయిన రాహుల్!!
వినాయక చవితికి బుల్లితెరపై పెద్ద సందడి ఉండబోతోంది. ప్రజలంతా ఇంటి పట్టునే ఉండటం, అందరూ టీవీలకు అతుక్కుపోతూ ఉండటంతో ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుద్దామని బుల్లితెర అనుకుంటోంది. ఈ క్రమంలో వినాయక చవితిని అందరూ టార్గెట్ చేశారు. ఆ రోజు స్పెషల్ ఈవెంట్లతో భారీగా పోటీ పడుతున్నారు. ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు స్పెషల్ ప్రోగ్రామ్స్‌ను ప్రసారం చేయబోతోంది.

ప్రోమోలతో పోటీ..
అటు జబర్దస్త్ టీంతో ఈటీవీ వారు.. 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి ప్రోగ్రాం, ఇటు అదిరింది టీంతో జీ తెలుగు వారు బాపు బొమ్మకు పెళ్లంట అనే ఈవెంట్‌తో రెడీ అయ్యారు. ప్రోమోలతో హైప్ పెంచేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెండు ఈవెంట్లకు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి.

అక్కడ నిహారిక, ఇక్కడ బిగ్‌బాస్ బ్యూటీ..
మెగా ప్రిన్సెస్ నిహారికతో బాపు బొమ్మకు పెళ్లంట అంటూ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేయగా.. పునర్నవి, రాహుల్ లవ్ ట్రాక్ మీద 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఈవెంట్‌ను నడిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో పునర్నవిని లేపుకొచ్చానని రాహుల్ చెప్పడం, హైపర్ ఆది పెళ్లి చేస్తానని మాటివ్వడం తెలిసిందే.

తాజాగా రెండో ప్రోమో..
తాజాగా రెండో ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో పునర్నవి అన్నగా సుధీర్, అక్కగా శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా ముఖ్య అతిథిగా సునీల్ కూడా విచ్చేశాడు. ఇక ఎప్పటిలానే రోజా తనకు అలావాటైన పద్దతిలో ఎంట్రీ ఇచ్చిన సునీల్‌పై సెటైర్స్ వేసింది.

హౌలేగాడు, గూట్లే..
ఇక స్కిట్‌లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది. సుధీర్‌ను నానా మాటలు అనేశాడు. దీంతో సుధీర్ పరుపుపోయినట్టైంది. పునర్నవి అన్నగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ఓ అమ్మాయిని లేపుకురావడానికి సిగ్గులేదా. ఏం చేస్తుంటాడు అంటూ రాహుల్‌ను ప్రశ్నించగా.. మ్యూజిక్ అంటూ హైపర్ ఆది కౌంటర్ వేస్తాడు. ఇక వెంటనే రాహుల్ అందుకుని ఈ హౌలేగాడు ఏం చేస్తాడు అని సెటైర్ వేస్తాడు. దీంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వుతుంటారు. ఇక రాహుల్ ప్రశ్నకు హైపర్ ఆది సమాధానం చెబుతూ మ్యాజిక్ చేస్తాడని కౌంటర్ వేస్తాడు.

బిగ్ బాస్ హౌస్‌లా..
పునర్నవి-రాహల్ పెళ్లిలో భాగంగా అందరూ ఒకేచోట ఉంటారు. ఈ క్రమంలో అందరూ పడుకుని ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లాంటి స్కిట్ వేస్తారు. అందులో మరోసారి సుధీర్‌ను దారుణంగా కించపరిచినట్టు కౌంటర్ వేస్తాడు. నైస్ కండ్స్ ఎక్కడ చేయించావ్.. బ్రో.. అంటూ రాహుల్‌ను సుధీర్ అడగ్గా.. చేయిస్తే రావురా గూట్లే చేస్తే వస్తాయ్.. అంటూ సుధీర్‌ను ఆడుకున్నాడు. ఇలా మొత్తానికి సుధీర్‌ను కాస్త అవమానించినట్టు సెటైర్లు వేసినా.. ఫన్ మాత్రం క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.