Just In
Don't Miss!
- Finance
కేంద్ర బడ్జెట్ యాప్, ఆ తర్వాతే అందుబాటులో డాక్యుమెంట్స్
- News
SP Balu "భారత రత్నం" కాడా..? పద్మవిభూషణ్‌తో సరిపెట్టిన కేంద్రం
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నెరవేరిన రాహుల్ కల: ఓ ఇంటి వాడు కాబోతున్న బిగ్ బాస్ విన్నర్.. క్లారిటీ ఇచ్చేశాడు.!
రాహుల్ సిప్లీగంజ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ యంగ్‌స్టర్.. చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అలాగే, తనలోని స్పెషల్ టాలెంట్‌తో యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ వదిలి కుర్రకారుకు దగ్గరయ్యాడు. ఇక, ఈ మధ్య వచ్చిన బిగ్ బాస్ సీజన్ -3 విన్నర్ అయ్యాక అతడి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ షో తర్వాత రాహుల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయాడు. తాజాగా అతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

వాళ్లే రాహుల్‌ను గెలిపించారు
రాహుల్ సిప్లీగంజ్ యూత్‌లో మాంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. యూత్‌ను ఆకర్షించే విధంగా రూపొందించిన పాటల వల్లే ఇది సాధ్యం అయింది. ఈ క్రేజ్ బిగ్ బాస్ విన్నర్‌గా నిలవడానికి కూడా బాగా సాయపడింది. రాహుల్‌కు పడిన ఓట్లలో చాలా వరకు కుర్రాళ్ల నుంచి వచ్చినవే ఎక్కువ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పునర్నవితో రాహుల్ ప్రేమాయణం
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు రాహుల్ తరచూ వార్తల్లో నిలిచేవాడు. దీనికి కారణం అతడు మరో కంటెస్టెంట్ పునర్నవితో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం మొదలైంది. ఇక, హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్లిద్దరూ పలుమార్లు కలిశారు. దీంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది.

సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ విన్నర్
రాహుల్ సిప్లీగంజ్ బిగ్ బాస్ విజేతగా నిలవడంతో పాటు ఇటీవల పలు ఆఫర్లను దక్కించుకుంటున్నాడు. దీంతో అతడి మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ ఇటీవల ఓ బెంజ్ కారును కొనుగోలు చేశాడు. దీని ఖరీదు దాదాపు రూ. 50 లక్షలు ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

రాహుల్‌పై మొదలైన విమర్శలు
కారును కొనుగోలు చేసిన రాహుల్‌పై నెటిజన్లు ఘోరంగా ఫైర్ అవుతున్నారు. దీనికి కారణం.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో తనకు డబ్బులు వస్తే.. తల్లిదండ్రులకు గిఫ్ట్‌గా ఓ ఫ్లాట్ కొనిస్తానని చెప్పడమే. అది జరగకుండానే.. కారు కొనుగోలు చేశాడంటూ అతడిపై వాళ్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో రాహుల్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయాడు.
ఓ ఇంటి వాడు కాబోతున్నాడు
తనను విమర్శిస్తున్న వారందరికీ రాహుల్ ఒకే ఒక్క పోస్టుతో రిప్లై ఇచ్చాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో కూల్ డ్రింక్ తాగుతున్న ఫోటోను షేర్ చేస్తూ ‘‘ఫ్లాట్ కొనేశ్నా.. రెడీ కానీకి ఏడు నెలలు పడతది. ఫ్లాట్ కొన్న తర్వాత కారుకు గాలం వేశ్నా. టెన్షన్ పడకండి' అని రాసుకొచ్చాడు. అంటే రాహుల్ తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాడన్న మాట.

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రాహుల్
రాహుల్.. బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఎన్నో అవకాశాలను అందుకుంటున్నాడు. అందులో పాటలు పాడడంతో పాటు సినిమాల్లో యాక్టింగ్ చేసే ఛాన్స్ కూడా పట్టేశాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ' అనే సినిమా ద్వారా అతడు యాక్టింగ్ కెరీర్ ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు రాహుల్.