For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుల్లి తెరపై భీబత్సం :‘బాహుబలి’ టీఆర్పీ అంతా

  By Srikanya
  |

  హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వసూళ్లు సాధించింది.ఈ చిత్రం ఈ శనివారం మా టీవి లో ప్రీమియర్ షోగా వేసారు. ఆ మేరకు బాహుబలి టీమ్ సైతం తన ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టీఆర్పీలు అంతటా చర్చనీయాంశంగా మారాయి.

  అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం టీవీ మీడియాలోనూ అంతకు ముందు ఉన్న రికార్డులు అన్నీ బ్రద్దలు కొట్టింది. టీఆర్పీ రేటింగ్ 40 దాకా వెళ్లిందని చెప్తున్నారు. అఫీషియల్ సమాచారం అయితే లేదు కానీ అద్బుతమైన టీఆర్పీ రేటింగ్ వచ్చిందని ఛానెల్స్ వారు విజియోత్సహంతో ఉన్నారు. సెట్ మ్యాక్స్ లో శనివారం రాత్రి అంటే అక్టోబర్ 25న ఈ చిత్రం హిందీ వెర్షన్ ప్రసారమైంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  'బాహుబలి' విషయానికి వస్తే..

  Rajamouli's Baahubali breaks all TRP ratings

  భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.

  చిత్రం విడుదలై ఈ మధ్యనే 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చెన్నైలోని పలు సినిమా థియేటర్లలో ఆన్‌లైన్‌ బుకింగ్స్‌లో ఇప్పటికే హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

  Rajamouli's Baahubali breaks all TRP ratings

  బాహుబలి'ని అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే స్పెయిన్‌లో జరుగుతున్న సిట్‌గీస్‌ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా 'బాహుబలి ది బిగినింగ్‌' చిత్రాన్ని ప్రదర్శించారు.

  ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సుదీప్‌, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, అడివి శేష్‌, నాజర్‌, తనికెళ్ల భరణి, సుబ్బరాజు తదితరులు నటించారు. కథ: వి. విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, ఛాయాగ్రహణం: కె.కె. సెంథిల్‌కుమార్‌, సంభాషణలు: సిహెచ్‌. విజయ్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ జి., కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు. ఆర్ట్ డైరక్టర్: సాబుశిరిల్‌ కాస్ట్యూమ్స్‌ :రమా రాజమౌళి యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్స్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌: వి.శ్రీనివాస్ మోహన్ నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ సమర్పణ: కె. రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్ ఎస్ రాజమౌళి . విడుదలైన తేదీ: 10,జూలై 2015.

  English summary
  MAA TV which aired the Baahubali 's premier on the eve of Dasara witnessed breaking of all existing TRP records.Sources say it got around 40 TRP ratings which is way high than previous Telugu movies screening on small screens.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X