»   »  'బాహుబలి' గురించిన ఈ న్యూస్ ని అసలు ఊహించలేరు, మీరు షాక్ అవటం ఖాయం

'బాహుబలి' గురించిన ఈ న్యూస్ ని అసలు ఊహించలేరు, మీరు షాక్ అవటం ఖాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి' గురించి మీరు ఇప్పటికి ఎన్నో వార్తలు విని ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ చిత్రం రెండో పార్ట్ రిలీజ్ గురించి జనం ఎదురుచూస్తున్న ఈ సమయంలో మీరు ఆశ్చర్యపోయే న్యూస్ ని అందిస్తున్నాం. అది మరేదో కాదు ..బాహుబలి త్వరలో టీవి సీరియల్ గా రాబోతోంది.

అవును..మీరు చదవింది నిజమే..బాహుబలి చిత్రాన్ని..గేమ్ ఆఫ్ ధ్రోన్స్ తరహాలో టీవి సీరియల్ మార్చటానికి రంగం సిద్దమైంది. ఈ విషయాన్ని బాహుబలి రచయిత, రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ మీడియాకు తెలియచేసారు. సీజన్ వైజ్ ఈ టీవి సీరియల్ టెలీకాస్ట్ అవుతుందిట. ఈ సీరియల్ ని ఓ నేషనల్ ఛానెల్ కోసం అని తెలుస్తోంది. హిందీలో వచ్చే ఈ సీరియల్ ని తెలుగులోనూ డబ్ చేసి ఇక్కడ ప్రసారం చేస్తారట.


మరి ఈ సీరియల్ కోసం బాహుబలి కి రాసిన రచయితనే కాకుండా ఈ సినిమాకు వాడిన సెట్స్ ని కూడా వాడే అవకాసం ఉందని సమాచారం. ముఖ్యంగా మహిష్మతి సామ్రాజ్యం..అందులో జరిగే కుట్రలు, కుతంత్రాలు ఈ సీరియల్ లో ప్రధాన బాగంగా ఉంటాయిట. సినిమాకు వచ్చిన క్రేజ్ తో ఈ సీరియల్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ సీరియల్ స్క్రిప్టు పూర్తి చేస్తారట. అలాగే సీరియల్ లో పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ లు, దర్శకుడుని ఎంచుకుని ఈ సీరియల్ ప్లాన్ చేస్తారట. మంచి ఐడియా కదూ.


Rajamouli's Baahubali turning TV serial


దీనితో పాటు బాలీవుడ్ దర్శకుడు గోల్డెన్ భెల్ దర్శకత్వంలో తెరకెక్కే ఓ టీవి షో కు విజయేంద్రప్రసాద్ రచన చేస్తున్నారు . రజనీదుగ్గల్, రాధ కూతురు కార్తిక ఈ టీవి షోలో ప్రధానపాత్రలు పోషించనున్నట్లు సమాచారం.


ఒకవైపు బాహుబలి రెండవ పార్ట్ కథకు నగిషీలు చెక్కుతూ మిగతా సినిమా కథలు రాస్తూ, మరో ప్రక్క వల్లి అనే సినిమా దర్శకత్వంనే మరోవైపు బుల్లితెరపై కూడా తన స్టోరీ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే రెండు సినిమాలు స్క్రిప్టులు రాస్తున్న విజయేంద్ర ప్రసాద్.. ఈ హిందీ సీరియల్‌కు స్క్రిప్ట్ రాయటంతో బాలీవుడ్ లో స్టార్ రైటర్ గా మారుమ్రోగుతారని అంచనాలు వేస్తున్నారు.


ఇది ఇలా ఉంటే..ఒకే ఒక్కడు' హిందీ వెర్షన్ 'నాయక్'కు సీక్వెల్ రాబోతోందట. దానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి దీపక్ ముకుత్ అనే నిర్మాత 'నాయక్'కు సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

English summary
Vijayendra Prasad, Rajamouli‘s father who penned story for the Baahubali revealed that just like Game of Thrones, they are planning to come with Baahubali for TV in season wise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu