Don't Miss!
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- News
లోకేష్ నుంచి చంద్రబాబు కోరుకుంటుంది ఇదే
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఓ వైపు తండ్రి.. మరో వైపు ఎన్టీఆర్.. రాజీవ్ కనకాల కంటతడి
రాజీవ్ కనకాలకు ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో అభిమానులకు కూడా తెలుసు. కెరీర్ స్టార్టింగ్‌ను ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ వస్తున్నారు. ఎన్టీఆర్ నటించే దాదాపు అన్ని సినిమాల్లో రాజీవ్ కనకాల ఉంటాడు. అలాంటి రాజీవ్ తాజాగా ఎమోషనల్ అయ్యాడు. సుమ నిర్వహిస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో రాజీవ్ కనకాల పార్టిసిపేట్ చేశాడు.

సుమపై పంచ్‌లు..
సుమకు ఏమీ రావంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. సుమ చేసే మిరపకాయ పచ్చడి చాలా ఇష్టమని.. మిరపకాయలను దంచి నోట్లో పెడుతుందంటూ అసలు విషయం చెప్పాడు. కేరళలో పచ్చళ్లు ఉండవని సుమ తప్పించుకుంటుంటే.. ఉంటాయని కానీ సుమకు రావని రాజీవ్ చెప్పుకొచ్చాడు.

అలా సెటైర్..
రాజీవ్ కనకాల ఇక ఆ షోలో ఓ ప్రయోగం చేసేందుకు రెడీ అయ్యాడు. వంట చేస్తానని చెప్పిన రాజీవ్ కనకాల ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. మా ఆయన అది ల్యాప్ ట్యాప్ అనుకుని నొక్కుతున్నాడు.. ఇండక్షన్ స్టవ్ అని చెప్పండి అంటూ సుమ కౌంటర్ వేసింది.

ఇక అలా...
బిగ్ బాస్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో ప్రతీ వారం కొన్ని మ్యాజిక్, విన్యాసాలు, అద్భుతాలు చేసే వారిని తీసుకొస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వారం ఓ పెయింటర్‌ను తీసుకొచ్చింది.ఆ ఆర్టిస్ట్ ఏకకాలంలో ముగ్గురు చిత్రాలను గీశాడు. నందమూరి తారకరామారావు, బాలయ్య, ఎన్టీఆర్ బొమ్మలను ఒకే సారి గీశాడు.

రాజీవ్ కనకాలతో..
అతను గీయడమే కాకుండా రాజీవ్ కనకాల కళ్లకు గంతలు కట్టి అతని చేతే ఓ బొమ్మను గీయించాడు. చివరకు అది రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాలది. ఆ చిత్రాన్ని చూసి రాజీవ్ కనకాల ఎమోషనల్ అయ్యాడు. తండ్రి ఉన్న జ్ఞాపకాలను పంచుకునే ప్రయత్నం చేశాడు.

కంటతడి పెట్టేసుకున్నాడు..
తండ్రి గురించి చెబుదామని ఎంత ప్రయత్నం చేసినా రాజీవ్ నోటి వెంట మాట రాలేదు. అలా స్టేజ్ మీదే ఏడ్చేశాడు. ఓ వైపు రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల ఫోటో, మరో వైపు స్నేహితుడు ఎన్టీఆర్ ఫోటో ఉండటంతో.. ఓ వైపు తండ్రి, మరో వైపు నా ఫ్రెండ్ అంటూ రాజీవ్ కనకాల ఎమోషనల్ అయ్యాడు.