Don't Miss!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
నన్ను కంట్రోల్ చేస్తుంటాడు.. అనిల్ రావిపూడిపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్
ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాల జాతర నడుస్తోంది. ప్రతీ వారం కనీసం నాలుగైదు పెద్ద మీడియం రేంజ్ సినిమాలు వస్తున్నాయి. అయితే ప్రతీ సినిమా యూనిట్ వాళ్లకు తోచినట్టుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే అందరూ కూడా బుల్లితెరపై మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు బుల్లితెర హవా పెరగడంతో అందరూ తలా ఒక షోలో పార్టిసిపేట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా గాలి సంపత్ యూనిట్ కామెడీ స్టార్స్ షోలో సందడి చేసింది.

బుల్లితెరపై అలా..
ఈ మధ్య సినిమా యూనిట్ తమ ప్రమోషన్స్‌లో భాగంగా జబర్దస్త్, క్యాష్, బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ వంటి షోల్లోనే కనిపిస్తున్నారు. కామెడీ స్టార్స్, స్టార్ట్ మ్యూజిక్ వంటి షోలోనూ సందడి చేస్తున్నారు. హీరో హీరోయిన్లు, దర్శకుడు ఇలా అందరూ వచ్చి కాసేపు అందరినీ ఎంటర్టైన్ చేసి తమ సినిమా గురించి నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతోన్నారు.

గాలి సంపత్ యూనిట్..
అలా తాజాగా గాలి సంపత్ యూనిట్ ఈ ఆదివారం బుల్లితెరపై రచ్చ చేయబోతోన్నారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, అనిల్ రావిపూడి వంటి వారంతా కూడా కామెడీ స్టార్స్ షోలో సందడి చేసేందుకు వచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమోను విడుదల చేశారు.

రాజేంద్ర ప్రసాద్ రచ్చ..
ప్రస్తుతం గాలి సంపత్ హవా ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా క్లిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఫీ ఫీ ఫీ అంటూ వదిలిన పాట అందులో రాజేంద్ర ప్రసాద్ వేసిన ఐకానిక్ స్టెప్పులు బాగానే క్లిక్ అయ్యాయి. అవే స్టెప్పులు వేసుకుంటూ కామెడీ స్టార్స్‌లో ఎంట్రీ ఇచ్చారు.

అలా కామెంట్లు..
నవ్వించడంలో ఎంతో మంది గొప్పవాళ్లు ఉన్నారు.. అందులో నేను కూడా ఉన్నానని అనుకుంటున్నాను అంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అందరి కంటే ఎక్కువగా నేనే అల్లరి చేస్తాను కానీ అనిల్ రావిపూడి కంట్రోల్ చేస్తాడని తమ మధ్యఉన్న బంధం గురించి రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

కాంబోలో సినిమాలు..
అనిల్ రావిపూడి సినిమాలు అంటే కచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ ఉండి తీరాల్సిందే. మొదటి చిత్రం పటాస్ తప్పా అనిల్ తీసిన ప్రతీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ముఖ్య మైన పాత్రలను పోషించాడు. అలా ఈ ఇద్దరి కాంబోకు సపరేట్ ఆడియెన్స్ ఉన్నారు.