For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకులుండాలి…సల్మాన్ బ్రదర్స్ ను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ !

  |

  బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ఎల్లప్పుడూ వార్తల్లో ఉండడానికి ఇష్ట పడుతూ ఉంటారు. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఆమె తన అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ లను ఆకాశానికి ఎత్తేస్తూ వారిద్దరినీ మెచ్చుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో హిందీ బిగ్ బాస్ 14 సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన రాఖీ సావంత్ తన ఆటతీరుతో వరకు టాప్ 5 వరకూ వెళ్ళింది. కానీ అనూహ్యంగా 14 లక్షలు తీసుకుని హౌస్ నుంచి వాకౌట్ అయింది.

  రాఖీ సావంత్ కు అండగా సల్మాన్ బ్రదర్స్

  రాఖీ సావంత్ కు అండగా సల్మాన్ బ్రదర్స్

  అప్పుడే ఆమె తన తల్లి చికిత్స కోసం తన 14 లక్షలు తీసుకున్నాను అని వెల్లడించింది. రాఖీ తల్లి ప్రస్తుతం క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూ ఉండగా ఆమెకు చికిత్స చేయించేందుకు తన వద్ద సరిపడినంత డబ్బు లేదని రాఖీ సావంత్ బాధ పడుతున్న నేపథ్యంలో ఆప్పట్లో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ స్పందించారు.

  సోషల్ మీడియా వేదికగా ఏ అవసరం ఉన్న తనకు కాల్ చేయాలని రాఖీ సావంత్ కు ఆయన వీడియో మెసేజ్ పెట్టారు. అయితే సాధారణంగా సెలబ్రిటీలు ఇలా ప్రకటనలు ఇవ్వడం ఆ తర్వాత అవి కార్యరూపం దాల్చక పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కేసులో మాత్రం సల్మాన్ సోహైల్ ఇద్దరూ రాఖీ సావంత్ కు అండగా నిలబడ్డారు.

  అమ్మా నువ్వేమీ టెన్షన్ పెట్టుకోవద్దు

  అమ్మా నువ్వేమీ టెన్షన్ పెట్టుకోవద్దు

  తాజాగా తన తల్లి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలో రాఖీ సావంత్ అక్కడ వీడియోలు తీసి తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ రోజు తన తల్లికి క్యాన్సర్ ఆపరేషన్ చేస్తున్నారని ఈ విషయంలో తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. అలాగే పక్కన ఉన్న తల్లితో 'అమ్మా నువ్వేమీ టెన్షన్ పెట్టుకోవద్దు ఇక పూర్తిగా నీ శరీరం నుంచి క్యాన్సర్ బయటికి వెళ్లి పోతుంది' అని ధైర్యం చెప్పింది. ఇదే సమయంలో రాఖీ సావంత్ తల్లి జయకూడా సల్మాన్ సోహెల్ సోదరులకు తన ధన్యవాదాలు తెలిపారు. తాను సల్మాన్ ఖాన్ కు నమస్కారాలు చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు.

  సల్మాన్ రూపంలో ఒక దైవ దూత

  సల్మాన్ రూపంలో ఒక దైవ దూత

  తాను ప్రతి రోజూ తన ఏసుప్రభువుకు తన అనారోగ్యం గురించి ప్రార్థన చేసేదానిని అని, ఇలా చనిపోవలసిందేనా అని బాధ పడుతున్న తరుణంలో నా దేవుడు సల్మాన్ రూపంలో ఒక దైవ దూతను పంపాడు అని చెప్పుకొచ్చింది. ఆయన మాకు అండగా నిలబడి నా ఆపరేషన్ కోసం చాలా సహాయం చేశాడని ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం నా కోసం అండగా నిలబడింది అని జయ చెప్పుకొచ్చారు.

  నేను మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు తెలపాలని అనుకుంటున్నానని జయ సల్మాన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తాను నమ్మిన దేవుడిని ఒకటే కోరుకుంటున్నానని మీకు మీ కుటుంబానికి ఎప్పుడు ఎలాంటి కష్టం రాకూడదని ప్రార్ధిస్తున్నాను అని తెలిపారు.

  Prabhudeva Biography.. ఇన్స్పిరేషన్ మెగాస్టార్ !
  ప్రతి ఇంట్లో మీలాంటి కొడుకులు ఉండాలి

  ప్రతి ఇంట్లో మీలాంటి కొడుకులు ఉండాలి

  రాఖీ సావంత్ కూడా సల్మాన్ సహాయానికి ధన్యవాదాలు తెలిపింది. కేవలం భగవంతుడి వల్ల, మీ వల్ల ఈ ఆపరేషన్ జరుగుతుందని ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లు ఈ ఆపరేషన్ కోసం పని చేస్తున్నారు అంటే అది కేవలం మీ చలవే అని చెప్పుకొచ్చింది. భారతదేశంలో ప్రతి ఇంట్లో మీలాంటి కొడుకులు ఉండాలని సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్ ల గురించి ప్రస్తావించింది. ఇక అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ తన తల్లికి చేస్తున్న సహాయం గురించి ఎక్కడా ప్రస్తావించ వద్దని కోరారని ఆమె చెప్పుకొచ్చింది.

  సల్మాన్మ, సోహెల్ ఇద్దరు చాలా సహాయం చేశారని అలాగే తాము చేసిన పనుల గురించి బయటకు చెప్పొద్దని కోరారని ఆమె పేర్కొంది. అందుకే తాను ఎప్పుడూ ఈ విషయాలు ప్రస్తావించలేదని ఆమె సదరు ఇంటర్వ్యూలో తెలిపింది.

  English summary
  'Bigg Boss 14' contestant Rakhi Sawant has thanked Bollywood superstar Salman Khan and his brother, actor Sohail Khan, for the support regarding her mother Jaya's cancer treatment.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X