For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rakul Preet Singh తమ్ముడిని రాస్కెల్ అంటూ తిట్టిన మంచు లక్ష్మీ.. ఆహా భోజనంబు ఏమైందంటే!

  |

  మంచు నట వారసురాలు మంచు లక్ష్మీ పలు రకాలుగా ప్రతిభను చాటుకొంటూ వినోద రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే టెలివిజన్‌లో పలు రకాల షోలు, గేమ్ షోలు, రియాలిటీ షోలతో ఆకట్టుకొన్న టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం ఓటీటీలోకి అడుగుపెట్టారు. తాజాగా ఆహా యాప్‌లో వంటల కార్యక్రమాన్ని చేపట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రారంభించిన షోలో రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ ఎలాంటి హంగామా చేశారంటే..

  Tollywood Super Stars 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న టాలీవుడ్ టాప్ టీజర్స్

   రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ మధ్య

  రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ మధ్య

  మంచు లక్ష్మీతో రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మంచు లక్ష్మీ ఏదైనా చేస్తే తప్పకుండా రకుల్ కనిపిస్తుంది. అది పార్టీ కానీ, ఈవెంట్ గానీ, లేదా షో గానీ తనకు లక్కీగా రకుల్‌ను భావిస్తుంటుంది. అందుకే లక్ష్మీ ఏది తలపెట్టిన తన వంతు సహకారాన్ని రకుల్ ఇస్తుంది. తాజాగా ఆహాలో ప్రారంభించిన ఆహా భోజనంబు కార్యక్రమంలో కూడా ప్రత్యక్షమైంది.

  గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పిన మంచు లక్ష్మీ

  గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పిన మంచు లక్ష్మీ

  ఆహా భోజనంబు షోలోకి రకుల్‌ను.. మై ఫ్రెండ్, మై ఫిలాసఫర్.. మై గైడ్.. మై పార్ట్‌నర్ ఇన్ క్రైమ్ అంటూ ప్రశంసలతో స్వాగతించింది. ప్లీజ్ వెల్‌కమ్ క్యూటీ, బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అంటూ ప్రేమగా వంటగదిలోకి ఆహ్వానించింది. రకుల్ లేకపోతే నాకు ఆ గుడ్ ఛార్మ్ ఉండదనిపిస్తుంటుంది అని మంచు లక్ష్మీ పేర్కొన్నది. వంటల ప్రోగ్రాంకు పిలిచినందుకు తిట్టుకొని ఉంటావు కదా.. అంటే.. లేదు నాకు తినడం అంటే ఇష్టం అని రకుల్ చెప్పింది.

  మాది పంజాబీ ఫ్యామిలీ అయినా..

  మాది పంజాబీ ఫ్యామిలీ అయినా..


  ఆహా భోజనంబు షోలో మాట్లాడుతూ.. పంజాబీ ఫ్యామిలీ అయినప్పటికీ.. ఆలూ పరాటాలు తినడం అలవాటు లేదు. మా నాన్న ఆర్మీలో పనిచేయడం వల్ల నాకు అది అలవాటు కాలేదు. ఉదయం 6 గంటలకే స్కూల్ బస్ వచ్చేది. నా బ్రేక్ ఫాస్ట్ మెనూలో బాయిల్డ్ ఎగ్, కార్న్‌ఫ్లెక్స్, టోస్ట్ లాంటివి తిని స్కూల్‌కు వెళ్లేదానిని. ఆ అలవాటు నాకు నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. నేను ఎక్కువగా రైస్ తింటాను. మైదా పిండితో చేసే పదార్థాలను తినను అని అని రకుల్ ప్రీత్ చెప్పింది. అయితే లక్ష్మీతో నాకు ఫ్రూట్ కేక్ ఆర్డర్ చేసినప్పుడు మా మధ్య గొడవ వస్తుంది అని రకుల్ ప్రీత్ చెప్పింది.

  వెజిటేబుల్ కోకనట్ కర్రీ, కాలీ ఫ్లవర్ ఫ్రైడ్ రైస్

  వెజిటేబుల్ కోకనట్ కర్రీ, కాలీ ఫ్లవర్ ఫ్రైడ్ రైస్

  మంచు లక్ష్మీ షోలో రకుల్ ప్రీత్ సింగ్ వెజిటేబుల్ కోకనట్ కర్రీ, కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ వంటకాలను చేశారు. అందుకోసం పనీర్ తీసుకొన్నారు. ఇష్టమైన కూరగాయలను, పనీర్, కోకనట్, పప్పు కలిపి ఈ డిష్ చేశారు. ఆ తర్వాత కాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసి అప్పటికే వండిన రైస్‌తో ఫ్రై చేసి వంటకాలను సిద్ధం చేశారు. వంట చేస్తూ.. తాను పనీర్ మీద ఉప్పు, పెప్పర్ వేసి కాస్త నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది అని రకుల్ ప్రీత్ ఓ చిట్కా చెప్పింది.

  రకుల్ వంట చెత్తగా ఉంటుందని

  రకుల్ వంట చెత్తగా ఉంటుందని

  రకుల్ ప్రీత్ సింగ్ వంట చేసే సమయంలో ఆమె సోదరుడు అమర్ దీప్ సింగ్ లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా రకుల్ వంట ఎలా చేస్తుందని లక్ష్మీ అడిగితే.. చాలా చెత్తగా వంట చేస్తుందని అన్నారు. దాంతో నేను బాగా తింటాను. అమర్ బాగా వంట చేస్తాడు అని రకుల్ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చింది.

  నేను చెత్తగా వంట చేస్తానని చెప్పావుగా.. నేను పాస్తా చేసినప్పుడు తిన్నవుగా అని రకుల్ చిర్రుబుర్రులాండింది. నిన్ను రకుల్ బాగా ముద్దు చేస్తుంది కదా అని అమర్ దీప్‌ను అడిగితే.. అక్క కంటే మీరే నన్ను ఎక్కువగా ముద్దు చేస్తుంటారు అనగానే లక్ష్మీ, రకుల్ నవ్వుల్లో మునిగిపోయారు.

  రాస్కెల్ అంటూ మంచు లక్ష్మీ

  రాస్కెల్ అంటూ మంచు లక్ష్మీ

  రకుల్ ప్రీత్ సింగ్‌లో నీకు బాగా నచ్చేది ఏమిటని అని అమర్ దీప్ సింగ్‌ను అడిగితే.. ఆమెకు నాలాంటి బ్రదర్ లభించడం ఆమెకు గొప్ప అంటూ రకుల్‌పై చిన్న సెటైర్ వేశాడు. దాంతో రాస్కెల్ అంటూ మంచు లక్ష్మీ తిట్టింది. ఆ తర్వాత వంట పూర్తయిన తర్వాత అమర్ దీప్‌ను కిచెన్‌లోకి ఆహ్వానించారు. ముగ్గురు కలిసి రకుల్ చేసిన వంటను ఆరగించారు. అలా రకుల్ ప్రీత్ వంటకంతో అదరగొట్టింది.

  రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ కెరీర్ ఇలా..

  రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ కెరీర్ ఇలా..

  రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. 2021లో చెక్, సర్దార్ గ్రాండ్ సన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 31st లేడీస్ నైట్, ఆయలాన్, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నది. అలాగే 2022లో మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ, ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తున్నది. మంచు లక్ష్మీ 2021లో పిట్ట కథలు అనే వెబ్ సిరీస్‌లో నటించింది. మంచు లక్ష్మీ చేసిన షోల విషయానికి వస్తే.. లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మ, లక్కుంటే లక్ష్మీ, సూపర్ జోడి, దూసుకెళ్తా, మీ కోసం, మేము సైతం, మహారాణి షోలను చేశారు, ప్రస్తుతం ఆహా భోజనంబు షోను ప్రారంభించారు.

  English summary
  Actor, Producer, Television host Manchu Lakshmi's has started Aha Bhojanambu Show in AHA OTT Aap. Rakul Preet Singh is the geust for the show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X