For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రకుల్‌ ప్రీత్‌ ని ఇలా చూస్తే స్టన్ అవుతారు(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: తెలుగులో టాప్ హీరోయిన్ కి దూసుకుపోతున్నది ఎవరూ అంటే రకుల్ ప్రీతి సింగ్ అని కళ్లు మూసుకుని చెప్తారు. లౌక్యం, కరెంట్ తీగ చిత్రాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఆమె ఇప్పుడు మరింత బిజి అయ్యిపోయింది. అందరూ హీరోలూ ఆమెతో చేయాలనే ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి తోడు ఆమె చేసిన సినిమాలు హిట్ అవుతూండటంతో లక్కీ హీరోయిన్ ముద్ర సైతం పడింది. దర్శక,నిర్మాతలే కాకుండా హీరోలు సైతం ఆమెనే కోరుకుంటూ ఆమెను బిజీ చేస్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  మన దేశంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తిలాని కాస్ట్యూమ్స్ తో , జయపూర్ అమ్రపాలి జ్యూయెల్స్ తో, టీవి టాక్ షో లో ఆమె ఈ క్రింద విధంగా దర్శనమివ్వబోతోంది. కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను అనే ఈ పోగ్రామ్ లో ఆమె ఈ డ్రస్ లో కనపడి అందరినీ అలరించనుంది. ఈ లోగా ఈ డ్రస్ లలో ఉన్న ఆమెపై ఓ లుక్కేయండి.

  కెరీర్ విషయానికి వస్తే..

  'టెంపర్‌' విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు ఎన్టీఆర్‌. ఈలోగా సుకుమార్‌ కూడా ఎన్టీఆర్‌ కోసం ఓ కథ సిద్ధం చేశారు. బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. మార్చి నెలాఖరున చిత్రీకరణ మొదలెడతారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ఎంచుకొన్నారు. ఈమధ్య రకుల్‌ రేంజ్‌ పెరిగింది. వరుసగా స్టార్ హీరోలందరితో జోడీ కడుతోంది.

  ఈమధ్యే రామ్‌చరణ్‌ సినిమా కోసం సంతకం చేసింది. 'కిక్‌ 2'లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా ఓకే చేసింది. ''అన్ని కమర్షియల్‌ హంగులూ ఉన్న చిత్రమిది. ఎన్టీఆర్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటుంది. మార్చి చివరి వారంలో సెట్స్‌పైకి తీసుకెళ్తాం. ఈలోగా మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేస్తామ''ని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

  ఇక ఆ ఫొటోలు చూడండి...

  వరసపెట్టింది

  వరసపెట్టింది

  వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఇప్పుడు రామ్ సరసన పండుగ చేస్కో, రవితేజ సరసన కిక్ 2 చిత్రాలు చేస్తోంది. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావటం విశేషం.

  ముంబై టు హైదరాబాద్

  ముంబై టు హైదరాబాద్

  ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హైదరాబాద్‌ టు ముంబై, ముంబై టు సిమ్లా, సిమ్లా టు హైదరాబాద్‌ ఇలా బిజీగా తిరుగుతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఇచ్చిన కిక్‌తో ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అరడజను సినిమాలతో తిరిక లేకుండా గడుపుతోంది.

  సిమ్లా ఎందుకు

  సిమ్లా ఎందుకు

  మరోవైపు హిందీ సినిమా హడావుడిలో ఉంది. అందుకోసం హైదరాబాద్‌ నుంచి ముంబై, ముంబై నుంచి హైదరాబాద్‌ పదే పదే తిరిగాల్సి వస్తోంది. మధ్యలో సిమ్లాలో హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది. దీంతో రకుల్‌ ఇప్పుడు యమ బిజీ బ్యూటీ అయిపోయింది.

  సంతృప్తిగా..

  సంతృప్తిగా..

  ''రోజూ చిత్రీకరణ ముగిసి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు నేనే ఓ ప్రశ్న వేసుకొంటున్నా. ''ఈ రోజు ఇక్కడ నేనేం నేర్చుకొన్నా..' అని. ప్రతిసారి సంతృప్తికరమైన సమాధానం దొరుకుతోంది. అందుకే మరుసటి రోజు మరింత ఉత్సాహంగా సెట్‌లోకి అడుగుపెడుతున్నా..'' అంటోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

  సెట్స్ కు..

  సెట్స్ కు..

  ''స్కూల్‌కి ఎంత హుషారుగా వెళ్లేదాన్నో... సెట్స్‌కీ అలానే వెళ్తున్నా. చుట్టూ నా మనుషులే ఉన్నట్లుంది. రోజూ చిత్రీకరణ ఉంటే బాగుంటుందనిపిస్తోంది.

  ఆ దశలో ఉన్నా

  ఆ దశలో ఉన్నా

  నేను సినిమాలకు కొత్త. అందుకే ప్రతిదీ నాకు వింతగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎంత త్వరగా నేర్చుకుంటానా అనే ఆత్రుత ఉంది. ప్రస్తుతానికి నేర్చుకొనే దశలో ఉన్నాను.

  తప్పులు చేసినా

  తప్పులు చేసినా

  ఒకట్రెండు తప్పులు చేసినా సెట్లో దర్శకులు పెద్ద మనసుతో క్షమించేస్తున్నారు'' అని చెబుతోంది రకుల్‌.

  సక్సెస్ సూత్రం

  సక్సెస్ సూత్రం

  ముందు కెరీర్ లో పూర్తి స్దాయిలో సెటిల్ అయితే డబ్బు దానంతట అదే వచ్చిపడుతుందనే సిద్దాంతాన్ని నమ్మి...రెమ్యునేషన్ ని మాత్రం పెంచకుండా అలాగే ఉంచేసిందంటన్నారు. అందుకే ఆమె వరస ఆఫర్స్ తో బిజీగా ఉంటోందని చెప్తున్నారు.

  ఎంత తీసుకుంటోందో

  ఎంత తీసుకుంటోందో

  ఆమె లౌక్యం హిట్ అయ్యిన తర్వాత తన రెమ్యునేషన్ ని అమాంతం పెంచేస్తుందని భావించారు. అయితే చాలా మినిమం అంటే 30 లక్షలు మాత్రమే సినిమాకు తీసుకుని పనిచేస్తోంది. అంతేకాకుండా బల్క్ డేట్స్ ఇవ్వటానికి,నిరంతంరం అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తోందని చెప్పుకుంటున్నారు.

  మహేష్ బాబుతోనూ

  మహేష్ బాబుతోనూ

  ప్రస్తుతం రకుల్ అటు రామ్ చరణ్ సినిమాలోనూ బుక్కైంది. అలాగే మహేష్ కొత్త చిత్రంలోనూ ఆమెనే తీసుకునే అవకాసం ఉందని చెప్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు అయ్యేసరికి ఆమె తెలుగులో పెద్ద స్టార్ హీరోయిన్ గ తేలుతుందంటున్నారు.

  English summary
  Rakul is shooting for the exclusive interview show being hosted in the name of “Konchem Touch Lo Vuntey Cheptanu”.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X