»   » నాగ్ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో రామ్ చరణ్ (ఫొటోలు)

నాగ్ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో రామ్ చరణ్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ వచ్చి టీవీ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది..టీఆర్పీలు ఏ రేంజిలో ఉంటాయి...ఆ విషయం తెలిసిన నాగార్జున తన సూపర్ హిట్ షోలో రామ్ చరణ్ ని గెస్ట్ గా తీసుకువస్తున్నారు. చిన్న తెరపై సంచలనాలు సృష్టిస్తూ.. వీక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న కార్యక్రమం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'కి రామ్ చరణ్ గెస్ట్ గా వస్తున్నారు. ఇక్కడ ఆ ఫొటోలు చూడవచ్చు.

మొదటి సీజన్ అందించిన ఉత్సాహంతో కనాగార్జున రెండవ సీజన్ మొదలుపెట్టారు. ఈ సారి కూడా గతంలో లాగానే స్టార్ ఇమేజ్ కు పెద్ద పీట వేసారు. ఇప్పటికే అనుష్క, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, వరుణ్ తేజ్, పూజా హెడ్గే తదితరులు పాల్గొన్నారు. ఇక, రామ్ చరణ్ వంతు వచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటివలే ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించినట్టు తన అఫీషియల్ పేస్ బుక్ లో రామ్ చరణ్ తెలియచేసారు.

Ram Charan as a special guest in Nag’s MEK

ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే...

రామ్ చరణ్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్లు కాకుండా...తమిళ కుర్రోడు, కొలవెరి సాంగ్ ఫేం అనిరుద్ రవిచందర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన వై దిస్ కొలవెరి సాంగ్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. మరి రామ్ చరణ్ సినిమాకు అనిరుద్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ ఖరారు చేసారు. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉందని, త్వరలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Ram Charan as a special guest in Nag’s MEK

దూకుడు సినిమా తర్వాత విడిపోయి శ్రీను వైట్ల-కోన వెంకట్-గోపీ మోహన్... రామ్ చరణ్ సినిమా కోసం మళ్లీ కలిసి పని చేస్తుండటం గమనార్హం. ఈ విషయమై గోపీ మోహన్ మాట్లాడుతూ...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శ్రీనువైట్ల డైరెక్షన్లో దానయ్య గారి బ్యానర్ లో త్వరలో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ కి కూడా మేము కధని అందిస్తున్నాం. పదేళ్ళు కలిసి పనిచేసిన మేము(వైట్ల గారు,కోన గారు,నేను), కొన్ని అనివార్య కారణాల వల్ల గత సంవత్సరం కలిసి పనిచెయ్యలేకపోయాం. దానికి కారణాలు అనేకం.

జరిగిన దానికి ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకునే సంస్కృతి నుండి బయటపడి, అందరి హీరోలతో జనరంజకమైన సినిమాలకి పనిచెయ్యాలని ఆశిస్తున్నాము. హీరో రామ్ చరణ్ ఉన్నత మనసుతో కోన గారిని, వైట్ల గారిని కలిపిన విధానం అభినందించదగినది. మా కలయికలో రాబోయే రామ్ చరణ్, సమంతల నూతన చిత్రం చాలా మంచి కధతో, శ్రీను వైట్ల గారి సినిమాలకి భిన్నమైన కొత్త కధనంతో రూపకల్పన జరుగుతోంది.

మా మార్కు మంచి హాస్యము ఉంటుంది. శ్రీను వైట్ల గారు, మా కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం గారి పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఇదివరకు సినిమాల ఛాయలు ఎక్కడా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

English summary
Nag had invited Ram Charan to be a part of his happening game show Meelo Evaru Koteeswarudu. Reports reveal that Charan has already shot for this show.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu