రామ్ చరణ్ కూడా ఇండియన్‌ ఐడల్‌ కి ...

By Srikanya

Ram Charan to Attend 'Indian Idol' Grand Finale
ముంబై : ఇండియన్‌ ఐడల్‌ జూనియర్‌ మొదటి ఎడిషన్‌ సింగింగ్‌ రియాల్టీ షో విజేతను బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ ఆదివారం ప్రకటించనున్నారు. అంతేగాకుండా విజేతకు బిగ్‌బీ ట్రోఫీని కూడా అందజేస్తారు. తుది పోటీ సెప్టెంబరు 1న జరగనుంది. 'జంజీర్‌' చిత్ర నటులు ప్రియాంకా చోప్రా, రాంచరణ్‌ తేజ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

'ఫటా పోస్టర్‌ నిక్లా హీరో' సినిమా ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమంలో షాహిద్‌ కపూర్‌ తన ఆట పాటలతో అలరించనున్నారు. ఆయనతో పాటు టాప్‌ ఫైనలిస్టులు నిర్వేష్‌ దావే, దేబానాజానా కర్మార్కర్‌, అనుమోల్‌ జైస్మాల్‌, అంజనా పద్మనాభన్‌ తదితరులు నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఇండియన్‌ ఐడల్‌ జూనియర్‌ జూన్‌ 1న ప్రారంభమైంది.

రామ్ చరణ్ బాలీవుడ్ లో తన మొదటి సినిమా విడుదలకు సిద్ధమవుతున్నాడు. గత వారం రోజుల నుండి ఈ 'జంజీర్' సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు హిందీ టెలివిజన్ షోస్ లకి హాజరవుతున్నాడు. ఇందులో భాగంగా 'ఇండియన్ ఐడల్ జూనియర్' ఫైనల్స్ కు అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాలతో కలిసి హాజరుకానున్నాడు. అపూర్వ లఖియ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6 న మన ముందుకు రానుంది.

రామ్ చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్నారు. ముంబైలోని సెన్సార్ బోర్డు ఈచిత్రానికి సెన్సార్ రిపోర్టు జారీ చేసింది. 2 చోట్ల సినిమాకు మైనర్ కటింగ్స్ పడ్డాయని, మొత్తం 137 నిమిషాల పాటు రన్ టైం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్‌తో జతకడుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X