బిగ్ బాస్ లో షాకింగ్ ట్విస్ట్.. ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా సాగినా.. తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ లతో గేమ్ లో మసాలా డోసు పెంచారు. దీంతో ప్రతి ఎపిసోడ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రతీ వీక్‌ఎండ్‌లో ఏ విధమైన ట్విస్ట్‌లు ఎదుర్కోవాల్సి ఉంటాయని ప్రేక్షకులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు. ఇప్పుడు ఏడవ వారం ముగిశాక, ఎనిమిదవ వారంలోకి అడుగుపెట్టబోతుంది. వీక్‌ఎండ్ ఎలిమినేషన్ కామనే అయినా బిగ్ బాస్ టీం ఇచ్చే ట్విస్ట్‌లు కొత్త ఉత్కంఠను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సారి కూడా ఎవరూ ఊహించని విధంగా కంటెస్టెంట్‌ను హౌస్ నుండి బయటకు పంపిస్తూ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఈ వారం ఎలిమినేట్ కాబోతుందెవరంటే?
బిగ్ బాస్ లో నామినేషన్ల పర్వం గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. అలా ఏడో వారం నామినేషన్లు చాలా ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ వారంలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు ఇందులో రమ్య మోక్ష, రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, దివ్య నిఖిత, తనూజ, రాము రాథోడ్, సంజన గల్రానీ, పవన్ కళ్యాణ్ పడాల నామినేషన్స్ లో నిలిచారు. కెప్టెన్లుగా ఉన్న సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తాలు నామినేషన్ల నుండి మినహాయింపు పొందారు. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి బిగ్ బాస్ ఫ్యాన్స్ తెగ ఆరాటంగా ఓట్లు వేశారు.

ఇక సోషల్ మీడియా ఓటింగ్ ఫలితాలు ప్రకారం.. తనూజ 37.46 శాతం ఓటింగ్ లో టాప్ లో నిలువగా, పవన్ కళ్యాణ్ పడాల 20.42 శాతం ఓటింగ్ తో రెండో స్థానంలో నిలిచారు. ఇక దివ్య నిఖిత 9.81 శాతం, రీతూ చౌదరి 8.86 శాతం, సంజన గల్రానీ 8.81 శాతం ఓటింగ్ పొందారు. ఇలా దాదాపు సేప్ జోన్ లో నిలిచారు. ఇక రాము రాథోడ్ 6.49 శాతం, సాయి శ్రీనివాస్ 4.83 శాతం, రమ్య మోక్ష 3.31 శాతం ఓట్లు పొందినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరూ ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. ముఖ్యంగా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా రమ్య మోక్ష తక్కువ ఓట్లతో ఈ వారం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి వైల్ కార్డ్ కంటెస్టెంట్ అయేషా (Ayesha) ఇప్పటికే ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఈ వారం మరో ఎలిమినేషన్ ఉండదని అనుకున్నారు. కానీ రమ్య మోక్ష ఎలిమినేషన్ అయినట్టు తెలుస్తోంది. వైల్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన రమ్య మోక్ష (Ramya Moksha) మొదటి రోజు నుంచే చర్చనీయాంశం అయింది. ఆమె ఫిజికల్ టాస్కుల్లో తన మగవాళ్లతో సమానంగా ఆడగల సామర్ధ్యం చూపిస్తూ, హౌస్‌లో తన స్థాయిని నిలబెట్టుకుంది. కానీ, అదే సమయంలో ఆమె నోటి దూల, వ్యక్తిగత కామెంట్స్ వల్ల హౌస్‌లో, సోషల్ మీడియాలో ఎక్కువ నెగటివిటీ ఏర్పడింది. హౌస్‌లో అడుగుపెట్టిన మొదటి ఎపిసోడ్‌లో రమ్య మోక్ష పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Padala), తనూజ (Tanuja) మధ్య రిలేషన్‌పై చేసిన కామెంట్స్ పెద్ద డిబేట్‌కు కారణమయ్యాయి.
ఆ వారం రమ్య నామినేషన్స్‌లో లేని కారణంగా బయటకు వెళ్లడం తప్పించింది. ఇలా రమ్య మోక్ష కు హౌస్‌లో ఉండటం వల్ల ఆమెకు నెగటివ్ ఇమేజ్ ఏర్పడింది. ఆమె కామెంట్స్, ఇతర కంటెస్టెంట్స్ పై వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడం వల్ల ఆమె సోషల్ మీడియాలో కూడా విపరీత ట్రోల్‌లు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో కూడా మిక్స్డ్ రియాక్షన్ వస్తున్నాయి. కొందరు ఆమె ఎలిమినేషన్ సరైన నిర్ణయం అని చెబుతున్నారు, మరికొందరు "డ్రామా లేకుండా షో ఎలా నడుస్తుంది?" అంటూ చర్చ జరుగుతోంది. రమ్య ఎలిమినేషన్ పై అధికారిక ప్రకటన రాకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రమ్య మోక్ష ఎలిమినేషన్ సోషల్ మీడియాలో, ప్రేక్షకులలో పెద్ద చర్చకు దారితీసింది.


Click it and Unblock the Notifications











