»   » ఎన్టీఆర్ ‘బిగ్ బాస్‌’ షోకి గట్టి పోటీ ఇస్తోంది ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ ‘బిగ్ బాస్‌’ షోకి గట్టి పోటీ ఇస్తోంది ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ హాండ్సమ్ హంక్ రానా 'నెం.1 యారి విత్ రానా' పేరుతో బుల్లితెరపై ఒక టాక్‌షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి ముందస్తు ప్రచారం, హైప్ లేకుండా ప్రారంభమైన ఈ షో విజయవంతంగా దూసుకెలుతోంది.

ఎలాంటి కాంట్రవర్సీలు, ప్రోమోల హడావుడి లేకుండానే కేవలం కంటెంటు, కాన్సెప్టును నమ్ముకుని ఈ షో రన్ అవుతోంది. ఈ షో కోసం సెలబ్రిటీలను ఎంపిక చేస్తున్న తీరు.... వారి నుండి రానా రాబడుతున్న ఆసక్తికర విషయాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

గ్రేట్ సక్సెస్

గ్రేట్ సక్సెస్

ఈ షోకు వస్తున్న స్పందన, రెస్పాన్స్, టీఆర్పీ రేటింగులను బేరీజు వేసిన విశ్లేషకులు ‘నెం.1 యారి విత్ రానా' కార్యక్రమాన్ని గ్రేట్ సక్సెస్ గా పేర్కొంటున్నారు. ఈ మధ్య కాలంతో ఇంత సక్సెస్ ఫుల్ టాక్ షో రాలేదనే చర్చ సాగుతోంది.

ఇంత రేటింగ్ ఊహించలేదు

ఇంత రేటింగ్ ఊహించలేదు

రానా నిర్వహిస్తున్న ‘నెం.1 యారి విత్ రానా' కార్యక్రమం అత్యధికంగా 9.1 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఇంత రేటు వస్తుందని ఊహించలేదని, ఈ షో గ్రేట్ సక్సెస్ అనడానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి అవసరం లేదని అంటున్నారు.

రానా ప్లానింగ్ అదుర్స్

రానా ప్లానింగ్ అదుర్స్

ఈ షో కోసం ప్రతి వారం రానా ఇద్దరు సెలబ్రిటీలను ఎంపిక చేస్తున్నారు. ఆ కాంబినేషన్ ఎంపిక, వారికి ఎలాంటి ప్రశ్నలు సంధించాలి, ఎలాంటి సమాధానాలు రాబట్టాలి అనే విషయంలో రానా ప్లానింగ్ సూపర్ గా ఉంది.

టీవీలకు అతుక్కుపోయేలా

టీవీలకు అతుక్కుపోయేలా

ఈ షో చూడటం మొదలు పెడితే... చివరి వరకు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేలా కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తికరంగా రన్ చేస్తున్నారు. ఎక్కడా చిన్న బోర్ ఫీలింగ్ రాకుండా పక్కాగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.

బిగ్ బాస్‌కే దమ్‌కీ ఇచ్చే స్థాయిలో...

బిగ్ బాస్‌కే దమ్‌కీ ఇచ్చే స్థాయిలో...

మాటీవీలో ‘బిగ్ బాస్' ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభం కావడం, దీనంత పెద్ద రియాల్టీ షో తెలుగులో లేదనే భారీ ప్రచారం జరిగింది. అయితే అలాంటి పెద్ద షోకు దమ్ కీ ఇచ్చే స్థాయిలో ఏదైనా షో ఉంది అంటే అది కేవలం రానా నిర్వహిస్తున్న ‘నెం.1 యారి' మాత్రమే అనే టాక్ వినిపిస్తోంది.

English summary
Rana's 'No.1 Yaari with Rana' TV show was started in Gemini TV recently without much hype and hoopla.The show generated the highest TVR of 9.1 and stood as a humongous hit on small screen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu