twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్స్‌ఫోజింగ్ లొల్లి: నాగబాబు కామెంట్లపై యాంకర్ రష్మి, అనసూయ రియాక్షన్!

    |

    దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు కారణం వారు తమ శరీర భాగాలను ఎక్స్ ఫోజింగ్ చేస్తూ.. క్లీవేజ్, తొడలు, బొడ్డు కనిపించేలా పొట్టి దుస్తులు ధరించడమే అనే వాదనలు తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొందరు ప్రముఖులు నుంచి సైతం ఇలాంటి మాట రావడం మీడియాలో హాట్ టాపిక్ అయింది.

    ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు వారు అలా ఆలోచించడాన్ని తప్పుబడుతూ ఓ వీడియో విడుదల చేశారు. మహిళల వస్త్రధారణ గురించి అలాంటి కామెంట్స్ చేయడం సరికాదు, వారికి నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉంది... వారేమీ చట్టాలను అధిగమించి నగ్నంగా తిరగడం లేదు కదా అంటూ ఆయన తనదైన వాదన వినిపించారు. నాగబాబు వ్యాఖ్యలపై యాంకర్ రష్మి గౌతమ్, అనసూయ స్పందించారు.

    రష్మి ఏమన్నారంటే...

    ఆడవారైనా, మగవారైనా.... కేవలం వారు వేసుకునే దుస్తులను బట్టి జడ్జ్ చేయడం సరికాదు. ఒక పుస్తకం కవర్ పేజీ చూసి దాని అంచనా వేయడం ఎంత తప్పో... వ్యక్తుల వస్త్రధారణ బట్టి వారిని జడ్జ్ చేయడం అంతే తప్పు అని రష్మి తెలిపారు. తమ లాంటి వారికి మద్దతుగా నిలిచిన నాగబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

    రష్మికి ఎన్నో చేదు అనుభవాలు

    డ్రెస్సింగ్ విషయంలో రష్మికి గతంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురైన సంగతి తెలిసిందే. డ్రెస్సింగ్ చాలా ఓవర్‌గా ఉందని, ఇంత ఎక్స్ ఫోజింగ్ చేయడం అవసరమా? అంటూ ఆమెను వేధించిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో నాగబాబు లాంటి వారు సపోర్టుగా నిలవడం రష్మికి ఊరటనిచ్చింది.

    అనసూయ కూడా...

    నాగబాబు వ్యాఖ్యలపై యాంకర్, నటి అనసూయ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయనపై గౌరవం మరింత పెరిగిందని తెలిపారు. అనసూయ కూడా డ్రెస్సింగ్ విషయంలో తరచూ విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

    ముందు మీ వక్రబుద్ది మార్చుకోండి

    ముందు మీ వక్రబుద్ది మార్చుకోండి

    కొందరు ఇంకా పాత బూజుపట్టిపోయిన సాంప్రదాయాలను పట్టుకుని గబ్బిలాల్లా వేలాడుతున్నారు. ఒక ఆడపిల్ల లేదా సినిమా నటి పొట్టి డ్రెస్ వేసుకుంది అని మాట్లాడుతున్నారే.... మీ దృష్టి వారి డ్రెస్సు మీదకు ఎందుకు వెళుతుంది? అమ్మాయి క్లీవేజ్ కనబడుతుంది, అమ్మాయి తొడలు కనబడుతున్నాయి, అమ్మాయి బొడ్డు కనబడుతుంది ఈ దృష్టి మీకు ఎందుకు వచ్చింది? ముందు మీ వక్రబుద్రి మానుకోండి. మీ నీచమైన బుద్ది నుంచి బయట పడండి. మీరు కావాల్సింది చూసేసి నాలుకలు చప్పరించేసి... స్టేజీమీదకు వచ్చి అది తప్పు అంటూ కబుర్లు చెప్పడం ఇప్పటికైనా మానండి. డ్రెస్సింగ్ అనేది ఆడవారి ఇష్టం. వారు నగ్నంగా రోడ్ల మీద తిరిగితే చూసుకోవడానికి చట్టాలున్నాయని నాగబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

    English summary
    "A humanbeing be male or female is beyond superficial sheet of clothing pls tap into the persons potential leaving aside what they choose to cover it up with “Don’t judge a book by its cover”. Thankyou Nagababu garu for standing up for us." Rashmi Gautam tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X