twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమాజం క్రూరమైంది.. అద్దె కట్టకుంటే పడేశారు.. సుధీర్ జానీ దుష్మన్.. ఏడ్చేసిన రష్మీ

    యాంకర్‌గా, సినీ తారగా రష్మీ గౌతమ్ అందరికీ తెలుసు. జబర్దస్త్ టీవీ షోలో యాంకర్‌గా కంటే సుధీర్‌తో అఫైర్ అనే వార్తతోనే సోషల్ మీడియాలో ఫేమస్. ప్రస్తుతం టాప్ యాంకర్లలో రష్మీ ఒకరు.

    By Rajababu
    |

    Recommended Video

    Rashmi Gautam Emotional In A Television Talk Show కంటతడి పెట్టిన రష్మి

    యాంకర్‌గా, సినీ తారగా రష్మీ గౌతమ్ అందరికీ తెలుసు. జబర్దస్త్ టీవీ షోలో యాంకర్‌గా కంటే సుధీర్‌తో అఫైర్ అనే వార్తతోనే సోషల్ మీడియాలో ఫేమస్. ప్రస్తుతం టాప్ యాంకర్లలో రష్మీ ఒకరు. అలాంటి పేరు ఉన్న రష్మీ ఇటీవల ఆలీ నిర్వహించిన టాక్‌షోలో సందడి చేసింది. డబ్బులు బాగా ఇస్తానంటే చిన్న హీరోతోనైనా నటించడానికి సిద్ధమని ఆమె చెప్తూ డబ్బుకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించింది. డబ్బుల లేకుండా ఎన్ని కష్టాలు పడ్డానో అంటూ కంటతడి పెట్టింది. రష్మీ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

    నెక్ట్స్ నువ్వేతో కల నెరవేరింది

    నెక్ట్స్ నువ్వేతో కల నెరవేరింది

    యాక్టర్‌గా ఒక పెద్ద ప్రొడక్షన్‌లో పనిచేయాలనే కోరిక ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నాకు నెక్ట్స్ నువ్వే రూపంలో మంచి సినిమా వచ్చింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్, స్టూడియో గ్రీన్, వీ4 బ్యానర్లో రూపొందించిన సినిమాలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించింది.

     యాంకర్లలో ప్రదీప్.. రోజా టాప్

    యాంకర్లలో ప్రదీప్.. రోజా టాప్

    టెలివిజన్ యాంకర్లలో ప్రదీప్, రవి, చంటి, సుధీర్‌లకు 100కు ఎన్ని మార్కులు వేస్తావు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రదీప్‌కు వందకు 100, రవికి 100కు 50, చంటి నా ఫేవరేట్. ఆయనకు 60, సుధీర్‌కు 10 మార్కులు వేస్తాను. సుధీర్ నా జానీ దుష్మన్. ఈ మార్కులు ప్రేమతోనే ఇస్తున్నాను అని అన్నాడు.

     అనసూయ నాకు స్ఫూర్తి

    అనసూయ నాకు స్ఫూర్తి

    రోజకు 100కు 110 మార్కులు, అనసూయ 99 మార్కులు, శ్రీముఖికి 98, యాంకర్‌గా నాకు నేను 100 మార్కులు వేసుకొంటాను. అనసూయ నాకు చాలా ఇన్‌స్పిరేషన్. ప్రసవం తర్వాత పదిరోజుల్లోపే మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. ప్రొఫెషనంటే ఆమెకు చాలా గౌరవం.

    అందరూ వంట నేర్చుకోవాలి

    అందరూ వంట నేర్చుకోవాలి

    నాకు వంట చేయడం చాలా బాగా వచ్చు. కానీ టీ పెట్టడం రాదు. నేను అన్ని రకాల శాఖాహారం వంటలు చేస్తాను. మగవాళ్లైనా, ఆడవాళ్లైనా వంట నేర్చుకోవాల్సిందే.

     అమ్మాయిల బాధలు తెలుసు

    అమ్మాయిల బాధలు తెలుసు

    నేను అబ్బాయిగా పుట్టి ఉంటే నేను అమ్మాయిలకు మంచిగా గౌరవిస్తాను. అమ్మాయిల బాధలు ఏంటో నాకు తెలుసు. నా తల్లి, ఇతర పెద్దల విషయాలు నాకు తెలుసు. మహిళల శరీరంలో చెందే మార్పుల వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసు. వాటన్నింటిని నేను దాటుకుంటూ వచ్చాను. కాబట్టి నాకు మహిళలంటే చాలా గౌరవం.

    డబ్బు, రెమ్యునరేషన్‌కే ప్రాధాన్యం

    డబ్బు, రెమ్యునరేషన్‌కే ప్రాధాన్యం

    రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తే చిన్న హీరో పక్కన నటించడానికి సిద్ధం. క్రియేటివిటీ విషయంలోనన్నా.. లేదా బ్యాంక్ బ్యాలెన్స్‌ విషయంలోనైనా సంతృప్తి ఉండాలి. లేకపోతే పనిచేయడంలో అర్థం ఉండదు.

     ఒంటరిగా హైదరాబాద్‌కు

    ఒంటరిగా హైదరాబాద్‌కు

    జీవితంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యం గురించి అనుభవ పూర్వకంగా నేర్చుకొన్నాను. వైజాగ్ నుంచి ఒంటరిగా హైదరాబాద్ వచ్చాను. చాలా బాధలు పడ్డాను. నా ఫస్ట్ రెమ్యునరేషన్ అన్నపూర్ణ స్టూడియో వాళ్లు 25 వేలు ఇచ్చారు. అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ విత్ డ్రా చేశాను.

     మూడు నెలల అద్దె చెల్లించా

    మూడు నెలల అద్దె చెల్లించా

    నాకు వచ్చిన రెమ్యునరేషన్ నుంచి 7 వేలు పెట్టి ఇంటిని అద్దెకు తీసుకొన్నాను. అందులో నుంచి కొంత మొత్తం పెట్టి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొన్నాను. మూడు నెలలు అద్దె చెల్లించాను. ఎందుకంటే అద్దె కట్టకుంటే వస్తువులు బయటపడేస్తారు అని చెప్పుకొచ్చింది. ఓ దశలో రష్మీ కన్నీటి పర్యంతమయ్యారు.

     ఇండస్ట్రీ అన్నీ నేర్పిస్తుంది..

    ఇండస్ట్రీ అన్నీ నేర్పిస్తుంది..

    నాకు 50 వేలు కావాలని ఇంట్లో అడిగితే ఇచ్చేవారు. కానీ నా సెల్ఫ్ రెస్పక్ట్ ఎక్కువ. సినిమా ప్రొఫెషన్ చాలా నేర్పిస్తుంది. నేను కూడా చాలా నేర్చుకొన్నాను. సక్సెస్ అయితే ఇండస్ట్రీలో ఓకే. కష్టాల సమయంలో అందరూ ఉంటారు. కానీ ఎవరూ సహాయం చేయరు. అలాంటి కష్టాలు చూశాను కాబట్టే నేను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొంటాను. నాకు డబ్బు విలువ తెలుసు. ఆ సొమ్మును మరొకరికి హెల్ఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

     ఓ దశలో డబ్బులు కూడా లేవు

    ఓ దశలో డబ్బులు కూడా లేవు

    ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. బ్యాంక్ అకౌంట్ తెరువడానికి చాలా కష్టపడ్డాను. నా స్నేహితుడు 5,500 ఇస్తే బ్యాంక్ అకౌంట్ తెరిచాను. ఓ అమ్మాయి కష్టాల్లో ఉన్నదని ఈ సమాజంలో ఎవరూ ఆదుకోరు. ఈ ప్రపంచం చాలా క్రూరమైంది. కష్టాల్లో ఉన్నామని తెలిస్తే నీ గురించి పూర్తిగా ఆరా తీస్తారు. అందుకే డబ్బుకు నేను చాలా ప్రాధాన్యం ఇస్తాను అని రేష్మీ ఎమోషనల్ అయింది.

    English summary
    Actor, Anchor Rashmi Gautam emotional in a television talk show. She explained her problem during the initial days of the Industry. Rashmi remembered her diffuculties faced in careers early days. She emotionally burusted and her eye gets full of tears.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X