»   » ఆమెని ఎప్పుడూ కలవలేదు కానీ.. రాధిక ఆత్మహత్యపై రష్మీ!

ఆమెని ఎప్పుడూ కలవలేదు కానీ.. రాధిక ఆత్మహత్యపై రష్మీ!

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ ఛానల్ యాంకర్ గా పనిచేస్తున్న రాధిక ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదంతస్థుల భవనం నుంచి దూకి రాధిక ఆత్మహత్య చేసుకుంది. మానసిక వేదన, కుటుంబ సమస్యలే ఆమె ఆత్మహత్యకు ఉసిగొలిపేలా చేశాయని సన్నిహితులు చెబుతున్నారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తడం, తన కుమారుడు పరిస్థితి సరిగా లేకపోవడంతో రాధిక కొంతకంగా మనసులో వేదన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాలే ఆమె ఆత్మహత్యకు దారితీసి ఉంటాయని అంటున్నారు.

రాధిక ఆత్మహత్య పట్ల ప్రముఖ యాంకర్, నటి రష్మి స్పందించింది. రాధికని తాను ఎప్పుడూ కలవలేదని.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు రష్మి తెలిపింది. సమస్యలని బాగు చేసుకుని అందమైన జీవితాన్ని పొందే అవకాశం ఆత్మహత్యల వలన దూరం అవుతుందని రష్మి హితవు పలికింది. శారీరక విశ్లేషణ కంటే మానసిక విశ్లేషణ ముఖ్యం అని రష్మి తెలిపింది.

Rashmi Gautam responds on anchor Radhika suicide

ప్రస్తుత రోజుల్లో మానసిక ఒత్తిడి వలనే ఆత్మహత్యలు జరుగుతున్న విషయాన్ని రష్మీ ప్రస్తావించింది. మానసిక వైద్యుడిని కలసినత మాత్రాన మనం పిచ్చివాళ్లమని అరహతం కాదు. ఆత్మహత్యలకు ఎవరూ పాల్పడవద్దని విన్నవించింది. నిద్ర లేవగానే ఇలాంటి వార్తలని వినడం నచ్చడం లేదని రష్మి తెలిపింది.

English summary
Rashmi Gautam responds on anchor Radhika suicide. Suicide is not a solution for problems says Rashmi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X