»   » టీఆర్పీ ల గొడవలేనా?? టీవీ షో లో కొట్టుకునే దాకా వెళ్ళిన యాంకర్ రవి-ప్రభాకర్

టీఆర్పీ ల గొడవలేనా?? టీవీ షో లో కొట్టుకునే దాకా వెళ్ళిన యాంకర్ రవి-ప్రభాకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్నాళ్ళ క్రితం వరకూ జీ టీవీలో ఒక డాన్స్ కాంపిటీషన్ జరిగేది. ఈ షో పార్టిసిపేంట్ ల పెర్ఫర్మెన్స్ ని బట్టి కాకుండా వాళ్ళ మధ్యలో వచ్చే గొడవల వల్లే ఎక్కువ పాపులర్ అయ్యింది. కొన్నాళ్ళకి ప్రతీ రియాలిటీ షో లోనూ ఇలా గొడవలు సర్వ సాధారణం అయ్యాయి. పోనూ పోనూ అసలు గొడవ లేని ఏపిసోడ్ ఉండేది కాదు కొన్ని సార్లైతే కావాలనే షో హోస్ట్ లే టీఆర్పీలకోసం ఇలా గొడవలు పెట్టి మరీ ఆ షో ని హైలెట్ చేస్తున్నారు అనే టాక్ మొదలయ్యింది.

అసలు ఈ గొడవలన్నీ నిజమా.., కాదా ఇలా గొడవల వల్ల టీఆర్పీ ని ఎలా పెంచుతారు?? అనే ప్రశ్నలకు మామూలు ప్రేక్షకునికి ఎప్పటికీ సమాధానం తెలియదు. మొదట్లో ఇలాంటి వీడియోలని ప్రోగ్రాం నుంచి ఎడిట్ చేసేవాళ్ళు కానీ ఈ మధ్య కావాలనే అలా ఉంచేయటమే కాకుండా వాటికి భీబత్స, విషాద రసాలు కూడిన మ్యూజిక్ ని జోడించి మరీ చూపిస్తున్నారు. ఇలాంటి వివాదాలు కాని వివాదాలపై ఒక లుక్...

 ఎక్కువగా ఉండేవి కాదు:

ఎక్కువగా ఉండేవి కాదు:

ఒక ప్పుడు మన టీవీలలో రియాలిటీ షోలు ఎక్కువగా ఉండేవి కాదు మొదట్లో ఒక సినీ సెలబ్రిటీని హోస్ట్ గా పెట్టి భార్యా భర్తల మధ్యనో, లేదంటే పిల్లలతో క్విజ్ లాంటి మైల్డ్ గేం షోలే ఉండేవి. కానీ రానూ రానూ పరిస్థితి మారింది. మామూలు ప్రోగ్రాం లకంటే రియాలటీ గేం షోలకి ఆధరణ ఎక్కువగా ఉంటుందన్న వి9షయం అర్థమయ్యింది టీవీ చానెళ్ళకి.

వన్స్ మోర్ ప్లీజ్:

వన్స్ మోర్ ప్లీజ్:

మొదట్లో "వన్స్ మోర్ ప్లీజ్" అంటూ నటుడు వేణూమాధవ్, యాంకర్ ఉదయభాను లతో మొదలయిన ఒక ప్రోగ్రాం లో భాగం గా డాన్స్ టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నం కాస్తా తర్వాత "డాన్స్ బేబీ డాన్స్" అంటూ కేవలం డాన్స్ కోసమే ఒక షోని నిర్వహించే స్థాయికి చేరుకుంది.. కానీ అప్పట్లో జడ్జ్లమధ్యాపార్టిసిపెంట్ ల మధ్యా గొడవలుండేవి కాదు.., ఒక వేళ ఉన్నా కూడా వాటిని షో లో చూపించే వారు కాదు.

యాంకర్ ఓంకార్:

యాంకర్ ఓంకార్:

అయితే రానూ రానూ పరిస్థితి మారి పోయింది... ఆట అంటూ జీ తెలుగు లో యాంకర్ ఓంకార్ వచ్చిన తర్వాత ఈ కాంట్రవర్సీ ఆలోచన మరింత పెరిగి పోయింది. ఫేమస్ షో "బిగ్ బాస్" రేంజ్ లో కేవలం షో లో జరిగే గొడవల ని కూడా ఎలా క్యాష్ చేసుకోవచ్చో చానెళ్ళ కీ, ప్రోగ్రాం ప్రొడ్యూసర్లకీ అర్థమయి పోయింది. అంతే షో లని రక్తి కట్టించటానికి రచ్చ ఉండాల్సిందే అన్న ఫార్ములా పాపులర్ అయ్యింది. అందరూ అదే "ట్రేండ్" ని ఫాలో అయ్యారు. మరీ ముఖ్యంగా ఓంకారన్నయ్య షోలో మరీ మితిమీరి పోయాయి.

వాటినే హైలెట్ చేసి:

వాటినే హైలెట్ చేసి:

అయితే పోనూ పోనూ ఈ తరహా సంఘటనలు మామూలైపోయాయి. దాదాపు ప్రతీ షోలోనూ ఇలా గొడవపడటం మామూలైపోయింది. అక్కడితో ఆగలేదు పార్టిసి పెంట్ల మధ్య నే కాదు జడ్జి లకూ, పార్టిసిపెంట్ళకూ, ఆకరికి జడ్జీల మధ్యనే కూడా ఇలా గొడవలు మామూలయ్యాయి. వాటినే హైలెట్ చేసి అదిరి పోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి మరీ ప్రోమోల్లో చూపించటం తో ప్రేక్షకులూ అసలేం జరిగిందోనన్న ఆసక్తితో టీవీలదగ్గరే ఉండటం మొదలు పెట్టారు.

ఇంకో రకంగా :

ఇంకో రకంగా :

ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ మరీ పరిస్థితి దిగ జారింది... పిల్లల కోసమే మొదలుఇ పెట్టిన కొన్ని షోలలో వారితో ఎదుటి వాళ్ళ మీద చాలెంజ్ లు చేయించటం, సవాళ్ళు విసరమనటం వంటివి చేయటం తో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. పిల్లల్లో పోటీ తత్వానికి బదులు కోపాన్నీ, అసూయనూ పెంచే పద్దతిలో ఈ షోలు సాగుతున్నాయంటూ సామాజిక వేత్తలు విరుచుకు పడటం తో ఇది కాస్త తగ్గినా... ఇంకో రకంగా మొదలయ్యింది.

 నిజంగా కావాలని చేస్తున్నారా అన్నట్టు:

నిజంగా కావాలని చేస్తున్నారా అన్నట్టు:

రోజూ గొడవలకోసం కొత్త కారణాలు వెతుక్కోవాలి కాబట్టి ఇక జడ్జిల మీదా, యాంకర్ల మీదా పడ్డారు ఇదైతే నిజంగా కావాలని చేస్తున్నారా అన్నట్టు కనిపిస్తుంది. ఇద్దరు జడ్జీలు గొడవఒపడతారు కాసేపటికి ఒక జడ్జీ తన మైక్ అక్కడ పెట్టేసి "నేను వెళ్ళిపోతున్నా అంటాడు" అంతే "ధన్" అంటూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదలవుతుంది... ఇక అందరూ ఆయన ని బతిమాలటం, ఆయన బలవంతంగా వెళ్ళిపోవటానికి ట్రై చేయటం ఆఖరికి మళ్ళీ కాంప్రమైజ్ అయినట్టు వచ్చి సీట్లో కూర్చోవటం

ఇంకో కొత్త ఆలోచన :

ఇంకో కొత్త ఆలోచన :

కనీసం 7-10 నిమిషాల వరకూ సాగే ఈ గొడవ అసలు ప్రోగ్రాం కంటే ఎక్కువగానే రక్తి కడుతుంది. టీఆర్పీ పెరుగుతుంది... ఇంకో వీక్ లో ఒక పార్టిసిపెంట్ తో ఒక జడ్జీ సెటైర్ వేస్తాడు దాంతో పార్టిసిపెంట్ జడ్జి పైకి తిరగబడతాడు... ఇక అప్పుడు మొదలవుతుంది పార్టిసిపెంట్ తరపున ఇంకో జడ్జీ రంగం లోకి దిగితాడు ఇక ఆ రోజుకి అదే ప్రోగ్రాం... ఇలా జరిగే గొడవలూ మామూలై పోతున్నాయి అని పించగానే ఇంకో కొత్త ఆలోచన వచ్చింది మన క్రియేటివ్ ప్రోగ్రాం డైరెక్టర్లకి.

మళ్ళీ మొదలు పెట్టారు:

మళ్ళీ మొదలు పెట్టారు:

టీవీ సీరియల్ నటులతోనే రియాలిటీ షోలను ప్లాన్ చేసారు అవీ కొన్నాళ్ళు వివాద రహితంగానే సాగినా అక్కడా సామాన్య జనానికి ఇంట్రస్ట్ తగ్గుతుందీ అనిపించగానే "గొడవల ఫార్ములా" మళ్ళీ మొదలు పెట్టారు. ఈ మధ్యనే ఒక టీవీ చానేల్ వాళ్ళు నిర్వహించే షో లో బుల్లితెర స్టార్ నటుడు ప్రభాకర్.., యాంకర్ రవి గొడవ పడటం చాలా నే పాపులర్ అయ్యింది...

 జబర్దస్త్ లో కూడా :

జబర్దస్త్ లో కూడా :

ఈ తరహా గొడవల క్లిప్పింగ్స్ కేవలం టీఆర్పీ కోసమే కాదు యూట్యూబ్ ద్వార ఆదాయాన్నీ అటు మరికొంత మంది ప్రేక్షకులనీ తీసుకు వస్తున్నాయి. నిజనికి మెగా హీరో నాగబాబు కనిపించే స్టార్ కామెడీ షో" జబర్దస్త్ లో కూడా ఈ ట్రిక్ వాడాలని ట్రై చేసారు. షకలక షంకర్ కీ అప్పారావు కీ మధ్య జరిగిన గొడవ ఒక సారీ.., చలాకీ చంటి ఇక షో లో తాను కనిపించను అని వెళ్ళిపోతున్న సీన్ ఒక సారి చూపించారు కానీ...

బూతులు తిట్టుకుంటూ:

బూతులు తిట్టుకుంటూ:

వీటివల్ల షోకి రెస్పాన్స్ పెరగక పోగా కామెడీ మూడ్ పోయి షో దెబ్బతింటోందనే విషయాన్ని తొందరగానే గ్రహించారు. అయినా కామెడీతోనే కావాల్సినంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు అని కూడా అనిపించి ఉంటుంది. నిజమే మనం చేసే దానిలో సరైన కంటెంట్ ఉండాలి కానీ ఇలా యంకర్లూ, జడ్జీలూ జుట్లూ జుట్లూ పట్టుకోవటం..., బూతులు తిట్టుకుంటూ తొడలు కొట్టటం వంటి వాటిని హైలేట్ చేసు షో కి హైప్ తేవటం అంత దరిద్రం ఇంకోటిలేదు...

ఫైటింగ్ వీడియో:

ఇదిగో ఈ మధ్యనే ఒక చానెల్ వాళ్ళు నిర్వహించే రియాలిటీ షో లో మనోళ్ళ "షో" చూడండి. బుల్లి తెరపై బాగా పాపులర్ అయిన ప్రభాకర్, యాంకర్ రవి ఒక షోలో మాట మాటా పెరిగి నిజంగానే కొట్టుకునే వరకు వెళ్ళింది వ్యవహారం. రేయ్..రవి ఎక్కువ మాట్లాడితే కొట్టేస్తా అని ప్రభాకర్ అనగా, హా..నువ్వు కొడుతుంటే చూస్తూ ఊరుకుంటానా..? అని రవి అన్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఫైటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ పాపులర్ అయ్యింది.

English summary
ETV Prabhakar very well known and called as megastar prabhakar on small screen. He is famous and acted in different serials and shows. He became serious in a show and almost gone for a fight with Anchor Ravi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu