»   » టీవీ నటుడు ఆత్మహత్యాయత్నం.. లోకేశ్ కారణం.. ఫేస్‌బుక్‌లో లైవ్..

టీవీ నటుడు ఆత్మహత్యాయత్నం.. లోకేశ్ కారణం.. ఫేస్‌బుక్‌లో లైవ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ టెలివిజన్ రియాల్టీ షో విజేత, టీవీ నటుడు ఎం ప్రథమ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యా ప్రయత్నానికి ముందు మంగళవారం రాత్రి ఫేస్‌బుక్‌ లైవ్‌ నిర్వహించి జీవితంలో మానసిక క్షోభను అనుభవిస్తున్నానని చెప్పడం గమనార్హం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రథమ్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇలాంటి తీవ్ర చర్యకు పాల్పడటానికి కారణం అతని స్నేహితులు వేధించడమేనని బాధితుడు ప్రథమ్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన బెంగళూరులోని బసవేశ్వరనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

నిద్రమాత్రలు మింగాడు..

నిద్రమాత్రలు మింగాడు..

ప్రథమ్ సుమారు 12 నిద్రమాత్రలు మింగినట్టు వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడికి ప్రాణహాని లేదని వారు పేర్కొన్నారు. తన స్నేహితుడు లోకేశ్ కుమార్ వేధింపులను తట్టుకోలేక ప్రాణత్యాగానికి సిద్దపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు చేశామన్నారు.

స్నేహితుడు లోకేశ్ వేధింపులే కారణం

స్నేహితుడు లోకేశ్ వేధింపులే కారణం

కన్నడ బిగ్‌బాస్ కార్యక్రమంలో విజేతగా మారడంతో ప్రథమ్ సెలబ్రీటిగా మారాడు. ఈ కార్యక్రమంలో గెలిస్తే వచ్చే మొత్తం డబ్బును పేదలకు పంచి పెడుతానని ప్రథమ్ హామీ ఇచ్చారు. విన్నర్‌గా మారిన తర్వాత డబ్బు ఎప్పుడు పంచుతావని వేధించినట్టు ప్రథమ్ ఆరోపించడం గమనార్హం.

ఫేస్‌బుక్‌లో లైవ్

ఫేస్‌బుక్‌లో లైవ్

ఫేస్ఋక్‌లో ప్రథమ్ లైవ్ దాదాపు 20 నిమిషాలపాటు సాగింది. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ‘చాలా మందిని మోసం చేశాను అని రూమర్లు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అసలు విషయం తెలుసుకోకుండా ఈ సమాజం కూడా ఓ నిర్ణయానికి రావడం బాధాకరం అని ప్రథమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియో ముగియడానికి కొన్ని క్షణాల ముందు నిద్రమాత్రలు మింగడానికి ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది.

డిస్టర్బ్ అయ్యాను..

డిస్టర్బ్ అయ్యాను..

ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రథమ్ చెప్పినదేమింటంటే.. లోకేశ్ వేధింపులతో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆయన టార్చర్‌ను భరించలేకపోయాను. కన్నడ బిగ్‌బాస్ ప్రొగ్రాంలో గెలిచిన మొత్తం ఇంకా చేతికి అందలేదు. అయితే ఆ మొత్తాన్ని అందరికీ ఎప్పుడు పంచుతావు అని టార్చర్ చేస్తున్నారు. అయితే నాకు లభించిన మొత్తాన్ని నేను పేదలకు పంచాలనుకొన్నాను. ఈ వ్యవహారంలో మీడియా నాపై తప్పుడు వార్తలు ప్రచురించింది అని ప్రథమ్ పేర్కొన్నాడు.

నాపై ప్రథమ్ దాడి చేశాడు..

నాపై ప్రథమ్ దాడి చేశాడు..

ప్రథమ్ ఆత్మహత్యాయత్నం ఘటనపై లోకేశ్ స్పందిస్తూ.. నాకు ప్రథమ్ మూడున్నర ఏళ్లుగా తెలుసు. మూడు రోజుల ముందు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకొంటాను అని బెదిరించాడు. మంగళవారం రాత్రి నాపై దాడికి కూడా ప్రయత్నించాడు అని అన్నారు.

English summary
Pratham, winner of a popular TV reality show, was rushed to a private hospital on Wednesday after he allegedly consumed sleeping pills. He had posted a live video on Facebook late on Tuesday night, saying he is depressed with life and "will not be available to anyone henceforth" as friends and others were torturing him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu