»   » 'జబర్ధస్త్ ' రేష్మి భయపెడుతోంది

'జబర్ధస్త్ ' రేష్మి భయపెడుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'జబర్ధస్త్ ' ఫేమ్ రేష్మి గౌతమ్‌ తెలుగు సినీ పరిశ్రమలో తన కలలను నెరవేర్చుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. టీవి కన్నా ఎక్కువగా ఆమె టాలీవుడ్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటూ చిత్రాలు చేస్తోంది. ఆమె టీవి మీడియా వరకూ పాపులర్ కాబట్టి ఖచ్చితంగా శాటిలైట్ కు ఇబ్బంది ఉండదని నిర్మాతలు భావిస్తారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో చిత్రం ప్రారంభమైంది. ఆ వివరాల్లోకి వెళితే...

హీరోయిన్ గా వి. సినీ స్టూడియో పతాకంపై వి. లీనా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి. దివాకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ నాగలింగం సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు.

Reshmi signs new Horror movie

పూజా కార్యక్రమాలతో ఈ సినిమా నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో సీనియర్‌ డైరెక్టర్‌ బి. గోపాల్‌, సీనియర్‌ కమెడియన్ అలీ పాల్గొన్నారు.

దర్శకుడు దివాకర్‌ మాట్లాడుతూ ''ఇది ఆద్యంతం ఆకట్టుకునే హారర్‌ ఫిల్మ్‌. ప్రధాన పాత్రకు సరైన చాయిస్‌ అనే ఉద్దేశంతో రేష్మిని తీసుకున్నాం. ఈ రోజు నుండే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, జనవరి నెలాఖరుకల్లా చిత్రాన్ని పూర్తి చేస్తాం'' అని చెప్పారు.

Reshmi signs new Horror movie

నిర్మాత మాట్లాడుతూ ‘‘ఉత్కంఠ రేకెత్తించే కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. రేష్మి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తుంది. అందంగా కనిపిస్తూనే భయపెట్టే పాత్ర ఆమెది. జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

ఆనంద్‌బాబు, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, కాశీ విశ్వనాథ్‌, సప్తగిరి తారాగణమైన ఈ చిత్రానికి స్ర్కిప్ట్‌: ప్రసాద్‌ వనపల్లె, మాటలు: కాశీ విశ్వనాథ్‌, ఛాయాగ్రహణం: జె. ప్రభాకరరెడ్డి ('ప్రేమకథాచిత్రమ్‌' ఫేమ్‌).

English summary
New director D Diwakar has launched a movie with Reshmi, anchor of Jabardasth in the prime role. The film is said to be an horror movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu