Just In
- 18 min ago
ఓడినప్పుడు నన్ను చూసి నవ్వారు.. ఊపిరాడనివ్వకుండా చేశారు: సింగర్ సునీత
- 1 hr ago
నమ్మిన వాళ్లే మోసం చేశారు.. ఒక్క ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు: రాజేంద్ర ప్రసాద్
- 1 hr ago
RRR కంటే భారీ బడ్జెట్: ప్రభాస్‌తో స్టార్ డైరెక్టర్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు!
- 10 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
Don't Miss!
- News
సింగర్ సిద్ శ్రీరామ్‌కు అవమానం... పబ్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు... నీళ్లు,మద్యం విసిరేసి...
- Sports
ISL 2020-21: గోవా ‘షూట్ ఔట్’.. టైటిల్ ఫైట్‌కు ముంబై సిటీ
- Finance
వచ్చే ఆర్థిక సంవత్సరం బ్యాంకుల పరిస్థితి దిగజారొచ్చు, కారణమిదే
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అటు రోజా.. ఇటు నాగబాబు.. మధ్యలో టీమ్ లీడర్లు.. జబర్దస్త్‌పై పంచ్‌లు
నాగ బాబు జబర్దస్త్‌ను వదిలి వెళ్లిపోతున్నాడని గతంలో వార్తలు వచ్చినా.. వాటిని రూమర్లుగానే కొట్టిపారేశారు. అయితే నాగబాబే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. జబర్దస్త్‌లో తన జర్నీ ఇలా ముగుస్తుందని ఎన్నడూ అనుకోలేదని, అయినా కొన్నింటికి కొన్ని చోట్ల ముగింపు పలకవలసి వస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. జబర్దస్త్‌లో కంటెస్టెంట్లు, టీమ్ లీడర్ల పరిస్థితే కుడిదిలో పడ్డ ఎలుకలా తయారైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరో కొత్త ప్రోగ్రామ్‌తో..
వేరే చానెల్‌లో ప్రారంభం కానున్న మరో కామెడీ షోలో నాగ బాబు ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో పాటు అనసూయ, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వారు ఆ షోలో సందడి చేయనున్నట్లు వారు విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. అందులో జబర్దస్త్‌పై కంటెస్టెంట్లు బాగానే పంచ్‌లు వేశారు. అందరిలో కెల్లా ఆర్పీ, వేణు వండర్స్ పంచ్‌లు బాగానే పేలాయి.

టీమ్ లీడర్ల పంచ్‌లు..
కొత్తింటికి వచ్చాము కదా అన్నీ బాగానే ఉంటాయి.. ఇదే నా జీ..వితం అంటూ పరోక్షంగా చానెల్‌పై తన ప్రేమను ప్రకటించాడు ఆర్పీ. ఇక వేణు సైతం నాగబాబు భవిష్యత్తు గురించి ముందుగానే చెప్పినట్లు, అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి వస్తారు.. మీతో పాటు ముగ్గురిని తీసుకొస్తారని చెప్పానా? అంటూ ఇన్‌డైరెక్ట్‌గా జబర్దస్త్‌ను వీడటం గురించి పంచ్‌లు వేశాడు.

నాగ బాబు స్వీట్ వార్నింగ్..
నాగబాబుతో పాటు కొంతమంది జబర్‌దస్త్ టీమ్ సభ్యులు కూడా బయటకు వెళ్లిపోయే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఛమ్మక్ చంద్ర, ఆర్‌పీ లాంటివాళ్లు జబర్‌దస్త్‌కి గుడ్‌బై చెప్పేశారు. మిగిలిన వాళ్లూ ఆ దారిలోనే వెళ్తారనుకున్నారు. కానీ.. అదేం జరగలేదు. నాగబాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే సుడిగాలి సుధీర్ టీమ్, హైపర్ ఆది కూడా.. జబర్‌దస్త్‌ని వదిలి బయటకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో నాగబాబు జబర్‌దస్త్ టీమ్ సభ్యులందరినీ ఇంటికి పిలిచి చిన్న సైజు మీటింగు పెట్టారని సమాచారం. మల్లెమాలనీ, ఈటీవీనీ వదిలేసి రమ్మని స్వీట్ వార్నింగ్‌లాంటిది ఇచ్చారని తెలుస్తోంది.

రోజా ఎమోషనల్ టచ్..
మరోవైపు రోజా కూడా మరో మీటింగ్ పెట్టిందని టాక్. జీవితం ఇచ్చిందే జబర్‌దస్త్.. దాన్ని వదిలి వెళ్తే విశ్వాసం లేనట్టే అంటూ ఎమోషనల్‌గా టచ్ చేస్తోందని టాక్. మరి నాగబాబు మాట వినాలా? రోజా మాట వినాలా? అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. జబర్దస్త్‌లోని సభ్యులందరికీ ఈ షో వల్లే లైఫ్ వచ్చిందని అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య టీమ్ లీడర్లు సతమతమవుతున్న తెలుస్తోంది. విడవమంటే పాముకు కోపం - పట్టమంటే కప్పకు కోపం అన్నట్లు తయారైందట అక్కడి పరిస్థతి. మరి ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తారో చూడాలి.