For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రూం, పాలు, పూలు.. ఎప్పుడూ అదే ధ్యాస.. సిగ్గులేని జన్మ అంటూ సుధీర్‌పై రోజా ఫైర్!!

  |

  బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వంటి షోలు ఎంతగా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ వేదిక నుంచి ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారాడు. వెండితెరపై హీరోలు, కమెడియన్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగానూ సత్తా చాటుతున్నారు. ఇక ఈ షోలో వచ్చే కంటెంట్‌పై ఇప్పటికే ఎన్నో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. హద్దులు దాటుతున్నారని, శృతిమించిపోతున్నారని ఓ వర్గం వారు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే వీటికి మాత్రం ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి వారికి క్రేజ్ పెరుగుతూనే ఉంది.

  అలాంటి స్కిట్స్..

  అలాంటి స్కిట్స్..

  జబర్దస్త్‌ లాంటి షోల్లో వచ్చే స్కిట్స్‌పై అభ్యంతరాలు ఎక్కువగానే వ్యక్తమవుతున్నాయి. ఒకానొక సందర్బంలో ఆర్టిస్ట్‌లపై దాడులు కూడా చేశారు. నిత్యం సంసారాలను కూల్చే స్కిట్స్, పెడదారిన పట్టించేట్టు వేసే స్కిట్స్‌పై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. ఈ షోలో ఒక్కొక్కరు ఒక్కో టాపిక్‌పై స్కిట్ చేస్తుంటారు. సుడిగాలి సుధీర్ నిత్యం అమ్మాయిలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటూ రెచ్చిపోతుంటాడు.

  ప్రతీసారి అవే..

  ప్రతీసారి అవే..

  జబర్దస్త్ స్టేజ్ మీద సుడిగాలి సుధీర్ వేసే స్కిట్స్, చెప్పే డైలాగ్స్‌తో అందరికీ ఓ అభిప్రాయం వచ్చేసేలా ఉంది. నిత్యం అమ్మాయిల గొడవ, పబ్‌లు, రూమ్ అంటూ స్కిట్స్ మధ్యలో పంచ్‌లు వేయడం, దానికి రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా తోడవుతుంటారు. అయితే ఇది ఎంటర్టైన్ చేయడానికే అయినా ప్రతీ సారి అవే కాన్సెప్ట్‌లు చేయడంతో వారిపై ఓ ముద్ర పడే అవకాశం ఉంది. తాజాగా వేసిన స్కిట్‌పై రోజా వేసిన సెటైర్ ఫుల్ వైరల్ అవుతోంది.

  పోలీస్ స్టేషన్‌లోనూ..

  పోలీస్ స్టేషన్‌లోనూ..

  వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఓ స్కిట్‌లో బుల్లెట్ భాస్కర్ పోలీసాఫీసర్‌గా నటించనున్నాడు. స్కిట్‌లో భాగంగానే సుధీర్ ఓ అమ్మాయి (సునామీ సుధాకర్)ను లేపుకొని రావడం, సరాసరి పోలీస్ స్టేషన్‌లోకి వస్తూనే రూం ఎక్కడా రూం ఎక్కడా అని అనడం, సెల్‌లో వేస్తే దిండు, దుప్పటి కావాలా అంటూ మనో సెటైర్ వేయడం ఫుల్ వైరల్ అయింది.

  సిగ్గులేని జన్మ..

  సిగ్గులేని జన్మ..

  మళ్లీ సుధీర్ మాట్లాడుతూ.. సర్ పూలు, పాలు, హల్వా లాంటివి అని పూర్తి చేయబోతోండగానే.. సిగ్గులేని జన్మ అంటూ రోజా కౌంటర్ వేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక సుధీర్ చేసిన ఈ స్కిట్ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఇక పోలీస్ సెల్‌లో ఉన్న రెండు నెలల్లోనే ఓ పిల్లాడు (నరేష్) పుట్టడం, అతడ్ని ఎత్తుకుని రావడం, ఇలా స్కిట్ అంతా నవ్వులు పూయించారు. ఇక పూర్తి ఎపిసోడ్ చూడాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.

  English summary
  Roja Satires on Sudigali Sudheer In Extra Jabardasth Show. Extra Jabardasth Latest Promo Goes Viral With Sudheer Performance And Roja Satires.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X