For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనసూయ భర్త క్యారెక్టర్ బయటపెట్టిన రోజా: అలాంటి పనులు.. అందరి ముందే ఆ మాటనేసిన యాంకర్

  |

  అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న ఈ సుందరాంగి.. అద్భుతమైన టాలెంట్‌తో సత్తా చాటుతోంది. అదే సమయంలో వైవాహిక జీవితాన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్‌ క్యారెక్టర్‌పై జబర్ధస్త్ జడ్జ్ రోజా షాకింగ్ చేశారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  చదువుకునే రోజుల్లోనే ‘నాగ' అనే సినిమాలో నటించింది అనసూయ. ఆ తర్వాత గ్లామర్ ఫీల్డుకు దూరమైన ఆమె.. తన చదువును పూర్తి చేసుకుంది. మళ్లీ అవకాశాల కోసం చూస్తున్న సమయంలోనే ప్రముఖ చానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా పని చేసింది. అప్పుడే హోస్టుగా కూడా కొన్ని ఈవెంట్లను చేసింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షో ద్వారా బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది.

   అనసూయ ఫేట్ మార్చేసిన జబర్ధస్త్

  అనసూయ ఫేట్ మార్చేసిన జబర్ధస్త్

  అనసూయ భరద్వాజ్ ఎప్పుడైతే ‘జబర్ధస్త్' షోలోకి ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఆమె జాతకం మారిపోయిందనే చెప్పాలి. అద్భుతమైన హోస్టింగ్‌తో పాటు ఆకట్టుకునే అందంతో అలరించిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును అందుకుంది. ఫలితంగా ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్‌ భారీగా పెరిగిపోవడంతో పాటు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి.

  అక్కడా సత్తా చాటిన క్రేజీ యాంకర్

  అక్కడా సత్తా చాటిన క్రేజీ యాంకర్

  బుల్లితెరపై తనదైన శైలి హోస్టింగ్‌తో మాయ చేసింది అనసూయ. అదే సమయంలో ‘సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో నటిగా మరోసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందామె. అందులో రంగమ్మత్త పాత్ర హైలైట్.

  అన్నింట్లోనూ అనసూయదే హవా

  అన్నింట్లోనూ అనసూయదే హవా

  ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ వెండితెరపై బాగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఆమె ఇటీవలి కాలంలో వరుస సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన ‘థ్యాంక్యూ బ్రదర్' రిలీజై సక్సెస్‌ను అందుకుంది. ఇక, ‘రంగమార్తాండ' విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు ‘వేదాంతం రాఘవయ్య', ‘ఖిలాడీ', ‘హరిహర వీరమల్లు', ‘పుష్ప' సినిమాల్లో కీలక పాత్రలు చేస్తోంది.

   ప్రేమ వివాహం... సక్సెస్‌ఫుల్ లైఫ్

  ప్రేమ వివాహం... సక్సెస్‌ఫుల్ లైఫ్

  వాస్తవానికి ఇండస్ట్రీలోకి రాకముందే అనసూయ.. శశాంక్ భరద్వాజ్‌ను వివాహం చేసుకుంది. అంతకు ముందే చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన వీళ్లిద్దరూ.. ఆ తర్వాత అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే అనసూయ ఇద్దరు బిడ్డల తల్లైంది. ఆ తర్వాతనే ఆమె కెరీర్‌ను ఆరంభించింది. ఏజ్ బారైనా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తూ దూసుకుపోతోందీ బ్యూటీ.

  నా భర్తను అవి చూడనివ్వనంటూ

  వచ్చే గురువారం ప్రసారం కానున్న ‘జబర్ధస్త్' షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో రాకెట్ రాఘవ స్కిట్‌లో భాగంగా ‘పెళ్లైన మగాడు ఆనందంగా ఉన్నాడంటే వాళ్లావిడ ఊరెళ్లింది అని అర్థం. ఈ వారం రోజులు మా ఇంట్లో సెలెబ్రేషన్స్' అంటూ డైలాగ్ చెప్పాడు. అంతలో అనసూయ.. ‘ఈ స్కిట్‌ను మా ఆయన చూడకుండా ఆపాలి' అంటూ కామెంట్ చేసింది.

   సుశాంత్ క్యారెక్టర్‌పై రోజా కామెంట్స్

  సుశాంత్ క్యారెక్టర్‌పై రోజా కామెంట్స్

  అనసూయ చేసిన కామెంట్‌పై వెంటనే స్పందించిన జబర్ధస్త్ జడ్జ్ రోజా.. ‘నువ్వు షూటింగ్‌కు వస్తే.. మీ ఆయన కూడా ఇంట్లో అలాంటి పనులే చేస్తాడు' అంటూ సుశాంక్ భరద్వాజ్ క్యారెక్టర్ గురించి డైలాగ్ విసిరింది. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకోగా.. అనసూయ మాత్రం షాక్‌తో నోరెళ్లబెట్టేసింది. దీంతో ఈ ప్రోమో వీడియో నిన్నటి నుంచి యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయిపోతోంది.

  English summary
  Senior Heroine Roja Shocking Comments on Anasuya Husband Susank Bharadwaj Character in Jabardasth Show. This Promo Video Gone Viral in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X