For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొత్తలో నరకం అనుభవించా.. దానివల్ల పిల్లలు కూడా పుట్టరని భయపడ్డా: రోజా సంచలన వ్యాఖ్యలు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లుగా వెలుగొందారు. ఇలా ఆకట్టుకునే అందం, అభినయంలో రాణిస్తూ చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించారు రోజా. సాదాసీదా అమ్మాయిగా సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె... తక్కువ వ్యవధిలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించి మెప్పించారామె. కొంత కాలం క్రితం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. అందులోనూ తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జబర్ధస్త్ జడ్జ్ ఓ స్పెషల్ ఈవెంట్‌లో తన పర్సనల్ ప్రాబ్లెమ్స్ గురించి మాట్లాడుతూ ఏడ్చేశారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  అలా పరిచయం.. నిన్న మొన్నటి వరకూ

  అలా పరిచయం.. నిన్న మొన్నటి వరకూ

  శ్రీలత రెడ్డి అలియాస్ రోజా 1991లో విడుదలైన ‘సర్పయాగం'తో హీరోయిన్‌గా ప్రవేశించారు. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో మెప్పించిన ఆమెకు నంది అవార్డ్ కూడా దక్కింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు దక్కించుకుని సత్తా చాటారు. అదే సమయంలో దక్షిణాదిలోని మిగతా భాషల్లోనూ సినిమాలు చేసి హవాను చూపించారు. అలా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె.. నిన్న మొన్నటి వరకూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి దుమ్ముదులిపేశారు. మరీ ముఖ్యంగా ‘శంభో శివ శంభో', ‘గోలీమార్' వంటి చిత్రాల్లో తల్లి పాత్రలు చేసి ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారామె.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రోజా

  బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రోజా

  సెకెండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే సీనియర్ హీరోయిన్ రోజా... బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ‘మోడ్రన్ మహాలక్ష్ములు' అనే షోతో ఆరంగేట్రం చేసిన ఆమె.. అందులో తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఫేమస్ కామెడీ షో ‘జబర్ధస్త్'లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అద్భుతమైన జడ్జ్‌‌మెంట్‌తో పాటు ఆకట్టుకునే హావభావాలతో మెప్పించారు. అదే సమయంలో ఈ షోతో క్రేజ్‌ను కూడా దక్కించుకున్నారు. మధ్యలో ఎన్నో షోలను హోస్ట్ చేసిన ఆమె... బుల్లితెరపైనా తన హవా చూపిస్తూ వచ్చారు.

  ‘జబర్ధస్త్' వల్ల రోజాకూ భారీ స్థాయిలో క్రేజ్

  ‘జబర్ధస్త్' వల్ల రోజాకూ భారీ స్థాయిలో క్రేజ్

  ఫేమస్ కామెడీ షో జబర్ధస్త్ షో వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వెలుగులోకి వచ్చారు. అలాగే, ఇందులో జడ్జ్‌లుగా పని చేస్తున్న వాళ్లు కూడా లాభపడ్డారు. అలాగే, యాంకర్లు రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్ భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ షో ద్వారా సీనియర్ హీరోయిన్ రోజాకు ఇది బాగా ప్లస్ అయింది. సినిమాల్లో వచ్చిన గ్యాప్‌ను పూడ్చేందుకు ఈ షో ఉపయోగపడింది. అంతెందుకు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కూడా జబర్ధస్త్ ఎంతోగానో సహకరించిందని అప్పట్లో రోజానే స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  కమెడియన్లకే పంచులు వేస్తూ దూకుడుగా

  కమెడియన్లకే పంచులు వేస్తూ దూకుడుగా

  దాదాపు తొమ్మిదేళ్లుగా జబర్ధస్త్‌ జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సీనియర్ హీరోయిన్ రోజా.. అనారోగ్య కారణాలతో కొన్ని ఎపిసోడ్లకు అందుబాటులో లేరు. తిరిగి షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్కిట్లు జరుగుతోన్న సమయంలో ముందుగానే పంచులను లీక్ చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా స్కిట్లలో దూరి మరీ ఇప్పటి వరకూ వంట పట్టించుకున్న పంచులను వదులుతున్నారు. దీంతో తరచూ హైలైట్ అవుతున్నారు.

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
   స్పెషల్ ఈవెంట్.. పిల్లలతో కలిసి సందడిగా

  స్పెషల్ ఈవెంట్.. పిల్లలతో కలిసి సందడిగా

  ఇటీవలి కాలంలో బుల్లితెరపై మల్లెమాల వాళ్లు నిర్వహించే ఏ కార్యక్రమం అయినా.. స్పెషల్ ఈవెంట్ అయినా రోజా కచ్చితంగా భాగం అవుతున్నారు. ఇప్పటికే ఎన్నో షోలలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఈమె.. ఇప్పుడు వినాయక చవితి స్పెషల్‌గా చేసిన ‘ఊరిలో వినాయకుడు' అనే ఈవెంట్‌లోనూ తన పిల్లలతో కలిసి పాల్గొన్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్‌ ఇంద్రజతో పాటు రెండు టీమ్‌లుగా ఏర్పడి పోటీ పడ్డారు. వీళ్లతో పాటు జబర్ధస్త్ కమెడియన్లు, ఢీ షో డ్యాన్సర్లు, సోషల్ మీడియా సెలెబ్రిటీలు ఇలా ఎంతో మంది భాగం అయ్యారు. దీన్ని సుధీర్, రష్మీ హోస్ట్ చేస్తున్నారు.

  Evaru Meelo Koteeswarulu షోకు షాకింగ్ రేటింగ్: చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. దానితో పోలిస్తే మాత్రం!

  సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇబ్బందులు

  సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇబ్బందులు

  వినాయక చవితి రోజు ప్రసారం కాబోతున్న ‘ఊరిలో వినాయకుడు' స్పెషల్ ఈవెంట్‌లో రోజా తనదైన శైలి పంచులతో అలరించారు. అలాగే, అదిరిపోయే డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. ఇంద్రజ టీమ్‌తో పోటీ పడేందుకు ఎంతగానో కష్టపడ్డారు. ఇలా ఈ ఈవెంట్‌‌లో ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తాజాగా వచ్చిన ప్రోమోలో రోజా తన కష్టాలను చెప్పుకుని ఏడ్చేశారు. ఆమె మాట్లాడుతూ ‘నేను 1991లో సినిమాల్లోకి వచ్చా.. 2002 వరకూ కష్టపడిన డబ్బులు మొత్తాన్ని అప్పులు కట్టి నరకం అనుభవించా' అంటూ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఎమోషనల్ అయిపోయారామె.

  పిల్లలు పుట్టరని అనుకున్నానని కన్నీరు

  పిల్లలు పుట్టరని అనుకున్నానని కన్నీరు

  ఇదే ఈవెంట్‌లో తన పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా రోజా మనసు విప్పి మాట్లాడారు. ‘పెళ్లి చేసుకునే ముందే నాకు చాలా పెద్ద భయం ఉండేది. పెళ్లైన తర్వాత కూడా నాకు పిల్లలు పుట్టరు అని అనుకునేదాన్ని. కానీ, లక్కీగా వివాహం జరిగిన ఏడాదికే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అన్షు పుట్టింది. అందుకే అన్షు అంటే నాకు చాలా చాలా ఇష్టం' అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఇంద్రజ, మరో హీరోయిన్ పూర్ణ పరుగున వచ్చి రోజాను ఓదార్చే ప్రయత్నం చేశారు. దీంతో ఈ ప్రోమోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది వైరల్ అయిపోయింది.

  English summary
  Senior Heroine Roja Did Shocking Comments on Financial Problems Oorilo Vinayakudu Event. This Promo Video Gone Viral in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X