»   » ఈ వారమే మా టీవీలో వేసేస్తున్నారు... ఎంజాయ్

ఈ వారమే మా టీవీలో వేసేస్తున్నారు... ఎంజాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గతంలో మాదిరిగా రిలీజైన చిత్రాలు సంవత్సరాల తరబడి కాకుండా వెంటనే టీవీ ఛానెల్ లో వచ్చేస్తున్నాయి. దాంతో రకరకాల కారణాలతో తమ అబిమాన సినిమాలను థియోటర్ లో చూడని వారు...టీవిలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. క్రేజ్ ఉండగానే టీవీల్లో వేయటం వల్ల టీఆర్పీలు కూడా వచ్చి ఛానెల్ వాళ్లూ హ్యాపీగా ఉంటున్నారు. ఈ వారం మోహన్ బాబు, వర్మ కాంబినేషన్ లో వచ్చిన రౌడి చిత్రం మా టీవీలో వేస్తున్నారు. జూలై 27 సాయింత్రం ఆరు గంటలకు టీవీలో ఈ చిత్రం ప్రసారం కానుంది.

చిత్రం కథ ఏమిటంటే.... అన్న (మోహన్ బాబు) రాయల సీమలో సమాంతర ప్రభుత్వం నడుపుతున్న ఓ లీడర్...పెద్ద దిక్కు. ఆ ప్రాంతంలో తన చెప్పిదే చట్టం..తన మాటే వేదవాక్కు. పొలిటికల్ లీడర్స్, అఫిషియల్స్ ఎందరో ఆయన పనులు చేసి పెడుతూంటారు. అక్కడ జనం చేత దేముడిలా పూజింపబడే ఆయనకు ఇంట్లోనే సమస్య ఎదురౌతుంది. తన ఆశయానికి,ఆకాంక్షలకు ఆయన పెద్ద కొడుకు(భూషణ్) అడ్డం తగులుతూంటాడు. దీన్ని గుర్తించిన అయితే ఆయన శతృవులు(వేదాంతం మూర్తి, జీవా) భూషన్ ని ప్రయోగించి ఆయన్ని దెబ్బ కొట్టాలనుకుంటారు. ఆ సమయంలో చిన్న కొడుకు కృష్ణ (మంచు విష్ణు) పరిస్దితులని చేతులోకి తీసుకుని వారి ప్లాన్ లను ఎలా తిప్పి కొట్టాడు..అన్న సామ్రాజ్యానికి అసలైన వారసుడుగా ఎలా ఎదిగాడు అనేది మిగతా కథ.

Rowdy to be aired on Maa TV

ఏవి పిక్చర్స్ బేనర్లో పార్థ సారథి, గజేంద్ర, విజయ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారు. ఎమోషన్ సీన్లతో పాటు హై ఓల్టేజ్ సన్నివేశాలు ఇందులో ఉంటాయి. సినిమాలో మోహన్ బాబు పెద్ద కుమారుడుగా కన్నడ కిషోర్, రెండవ కుమారుడుగా మంచు విష్ణు నటించారు. వర్మ కు అత్యంత ఇష్టమైన గాడ్ ఫాధర్ పోలికలతోనే ఈ చిత్రం తెరకెక్కింది.

English summary
Rowdy, a faction based drama directed by RGV, is all set to be aired on Maa TV on July 27 at 6 PM.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X