For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘నేను మీ కళ్యాణ్‌’గా అదరగొట్టిన సాయిధరమ్ తేజ్.. మీరే చూడండి.. (వీడియో)

  By Rajababu
  |
  Nenu Mee Kalyan - A web Series “నేను మీ కళ్యాణ్”వెబ్ సిరీస్

  యూట్యూబ్ పరిధి రోజు రోజుకి విస్తరిస్తోంది. వెబ్ సిరీస్ కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కాలంలో యువత ఒక్కరే కాదు.. ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీక్షకుల సంఖ్య పెరుగుతుండడంతో అత్యంత నాణ్యతతో సినిమాలకు తీసిపోని విధంగా వెబ్ సిరీస్ రూపొందుతున్నాయి. అయితే ఈ కేటగిరీల్లో ఎక్కువగా యువతే ఉంటారు.

  ఇక వెబ్ సిరీస్ పుణ్యమా అని సినిమాల్లో చాన్స్ లు కొట్టేస్తున్నవాళ్ళు లేకపోలేదు. అందుకు బెస్ట్ ఉదాహరణ వైవా హర్ష. అంతేనా నిహారిక కొణిదెల చేసిన ముద్ద పప్పు ఆవకాయి వెబ్ సిరీస్ ఎవరు మర్చిపోలేరు. తాజాగా నటుడు కళ్యాణ్ శంకర్ నేను మీ కల్యాణ్ అనే వెబ్‌ సిరీస్‌తో ముందుకొచ్చాడు..

   కళ్యాణ్ శంకర్‌ డైరెక్షన్‌లో

  కళ్యాణ్ శంకర్‌ డైరెక్షన్‌లో

  అయితే చాలా వెబ్ సిరీస్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ కొన్ని మాత్రం గుర్తుండిపోతాయి. ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లలో అందరినీ ఆకట్టుకుంది "నేను మీ కళ్యాణ్"వెబ్ సిరీస్.
  తొలిసారిగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేసే వెబ్ సిరీస్ ని ఓ ప్రైవేట్ ఛానల్ తీసుకొచ్చింది. అదే "నేను మీ కళ్యాణ్". కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ తొలి ఎపిసోడ్ మంచి అందరి అభినందనలు అందుకుంటోంది.

  దర్శకుడిగా, నటుడిగా

  దర్శకుడిగా, నటుడిగా

  నేను మీ కళ్యాణ్ వెబ్ సిరీస్‌లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం చేపట్టడమే కాకుండా నటుడిగా మరో పాత్రను పోషించి మెప్పించాడు. కేరింత చిత్రం ద్వారా పరిచయమైన కల్యాణ్ శంకర్ పలువురి మన్ననలు అందుకొన్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు.. స్నేహితుల సరదాలు, మధ్యలో ప్రేమ .. అన్ని ఎమోషన్స్ ని మేళవించి ఈ సిరీస్‌ను ఆయన రూపొందించారు.

   నేను మీ కల్యాణ్ కథ ఇదే

  నేను మీ కల్యాణ్ కథ ఇదే

  ఆర్టిస్టుల నటనకు తోడు.. కార్తీక్ కుమార్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ థియేటర్లో సినిమా చూస్తున్న అనుభూతిని ఇస్తుంది. కథ.. సన్నివేశాలు ఇక్కడే చదివేస్తే మజా ఏముంటుంది. అందుకే మిస్ కాకుండా వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి. అయితే నిజమైన ప్రేమ కోసం రేడియో జాకీ కళ్యాణ్ వెతుక్కోవడమే ఈ నేను మీ కళ్యాణ్ ఈ వెబ్ సిరీస్ స్టోరీ.

   సాయిధరమ్‌తో హైప్

  సాయిధరమ్‌తో హైప్

  ఈ వెబ్‌సిరీస్‌లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించారు. ఇంకోవిషయం ఏమిటంటే తేజు చేస్తున్నది తన పాత్రే కావడం విశేషం.. ఇక మెగా హీరో నటిస్తుండటం తో దీనికి ఇంకా హైప్ వచ్చింది.

  రియల్ లైఫ్ పాత్రలో

  రియల్ లైఫ్ పాత్రలో

  ‘నాకు ఇది కొత్త ఎక్స్ పీరియన్స్. అలాగే నా పాత్రనే నేను చేస్తుండడం మరో కొత్త అనుభూతిని ఇస్తోంది. సహజంగా యాక్టింగ్ చేసేటపుడు మన ఒరిజినాలిటీని దాచుకుని నటించాల్సి ఉంటుంది. కానీ నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను ఇందులో చేస్తుండటంతో.. ప్రపంచానికి మనలోని రియాలిటీని ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. మనల్ని మనం మరింతగా ఎక్స్ పోజ్ చేసుకోవడానికి ఇలాంటి పాత్రలు ఉపయోగపడతాయి' అని సాయిధరమ్ తేజ్ అన్నారు. ఇప్పటికే జరిగిన కొన్ని ఎపిసోడ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్న తేజు.. మిగిలిన భాగాలను కూడా ఈ స్థాయిలోనే ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

  మరింకెందుకు ఆలస్యం "నేను మీ కళ్యాణ్"వెబ్ సిరీస్ చూడటం స్టార్ట్ చేసేయండి. మళ్ళి ఇంకో వెబ్ సిరీస్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తాం.

  English summary
  Mega hero Sai Dharam Tej versatile artist. Now he appered as Nenu Mee Kalyan in a web series. This web series was directed and acted by Kalyan Shankar who introduced with Kerintha movie. This Web series is went viral on youtube. Telugu Filmibeat exclusively brings this video for you..
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more