For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాములు పట్టుకోవడం హాబీ అంటున్న తెలుగు హీరో

  By Srikanya
  |

  Sai Kiran
  హైదరాబాద్: పాములు పట్టుకోవడం (స్నేక్ క్యాచింగ్) నా హాబీ. ఇప్పటివరకూ ఓ మూడు వేల పాముల్ని పట్టుకుని అడవిలో వదిలిపెట్టా. అది తప్ప నాకు వేరే ఏ ఆసక్తులూ లేవు అంటున్నాడు సాయికిరణ్. గాయకుడు రామకృష్ణ కుమారుడుగా కంటే, 'నువ్వే కావాలి' ఫేమ్‌గానే సాయికిరణ్ ఎక్కువమందికి తెలుసు. 'అనగనగా ఆకాశం ఉంది' అంటూ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న అయనను సినిమా పరిశ్రమ నిరుత్సాహపరిచినా, టెలివిజన్ మాత్రం అక్కున చేర్చుకుంది. ఒడిదుడుకుల మధ్య సాగుతోన్న తన కెరీర్ గురించి సాయికిరణ్ మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.సాయికిరణ్ "ప్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ" వైస్ ప్రెసిడింట్ కావటం విశేషం.

  వెండితెర, బుల్లితెర రెండింటింలోనూ చేస్తున్న ఆయన వాటి వ్యత్యాసం గురించి చెప్తూ...సినిమాలకి పని చేయడం హాయిగా ఉంటుంది. ఎందుకంటే రోజుకు ఒకటో రెండో సీన్లు షూట్ చేస్తారు. అదే సీరియల్ అయితే రోజుకు రెండు మూడు ఎపిసోడ్లు తీస్తారు. బాగా అలసిపోతాం. కాకపోతే టీవీ ఆర్టిస్ట్ ఎప్పుడూ ఖాళీగా ఉండక్కర్లేదు. సంవత్సరం పొడవునా చేతినిండా పని ఉంటుంది అన్నారు.

  తను నటుడు అవటానికి కారణం చెప్తూ...పి.సుశీల గారు నాకు నాన్నమ్మవుతారు. ఆవిడ కొడుకు పెళ్లికి కార్డులు పంచడానికి నాన్నతో పాటు నేనూ వెళ్లాను. రజనీ కాంత్ గారికి కార్డు ఇస్తున్నప్పుడు ఆయన నన్ను చూసి, 'నువ్వు సినిమాల్లో నటిస్తు న్నావు కదా' అన్నారు. లేదని చెప్తే. 'ఎక్కడో చూసినట్టు అనిపించింది. నువ్వు నటుడిగా పనికొస్తావు, ట్రై చెయ్యి' అన్నారు. రజనీకాంతే అలా అన్న తర్వాత ఇక ఆగగలనా చెప్పండి అన్నారు.

  సీరియల్స్ అయినా తనలోని నటుడిని తృప్తి పరుస్తున్నాయని చెప్తూ...తమిళంలో రమ్యకృష్ణతో ఒక సీరియల్ చేస్తున్నాను. అందులో ఓ నెలంతా నేను కోమాలో ఉన్నట్లే చూపిం చారు. దాంతో మార్కెట్టుకు వెళ్లినప్పుడు దుకాణాల్లోని ఆడవాళ్లు గబగబా దగ్గరకు వచ్చేసేవారు. ఎలా ఉన్నావ్ బాబూ అంటూ కన్నీళ్లు పెట్టుకునేవారు. అదంతా నటనని చెప్పినా వినకుండా జాగ్రత్తలు చెప్పేవారు. ఆ అభిమానానికి కళ్లు చెమర్చేవి అన్నారు.

  తన కెరెరీ గురించి చెపుతూ...నువ్వే కావాలి, ప్రేమించు లాంటి మంచి సినిమాలు చేసినా సరైన అవకాశాలు రాలేదు. కారణం నాక్కూడా తెలియలేదు.అలాగే సినిమా అనేది ఒక్కరు బాగా చేస్తే అయి పోయేది కాదు. అన్నీ బాగుండాలి. కానీ నేను నావరకే చూసుకునేవాడిని. హీరో యిన్ బాలేక పోయినా, మరేవైనా లోపా లున్నా చెప్పి మార్పించే ప్రయత్నం చేసే వాడిని కాదు. అలా చేసి తప్పు చేశానేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అయినా ఆ అలవాటుని మార్చుకోవాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, నాకు ఎవరితోనూ వాదించడం, గొడవ పడటం ఇష్టం ఉండదు. ఎవరైనా పిలిచి అవకాశమిస్తే చేస్తాను తప్ప మిగిలినవి నాకు అనవసరం. దానివల్ల నష్టపోయినా నాకు పెద్ద బాధ లేదు.

  ఇక నేను అసలు నేను కెరీర్ మొదలుపెట్టిందే 'శివలీలలు' సీరియల్‌తో. ఆ తర్వాతే సినిమాల్లోకి వెళ్లాను. రీసెంట్ గా శిరిడిసాయి సినిమాలో నటించాను. ప్రస్తుతం ఆటోభారతితో పాటు, తమిళంలో ఒక సీరియల్ చేస్తున్నాను అని తెలిపారు. కుటుంబపరంగా పిల్లలు ఇంకా లేరు. నా భార్య వైష్ణవి గురించి బెంగ అక్కర్లేదు. తనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అయినా... నీ లక్ష్యమేంటని పెళ్లి చూపులప్పుడు అడిగితే, 'యాభయ్యేళ్లు వచ్చేవరకూ పనిచేసి, తర్వాత ఏ హిమాల యాలకో వెళ్లిపోతా' అంది. వెంటనే తనని పెళ్లి చేసుకోవాలని డిసైడైపోయా అన్నారు.

  English summary
  Sai Kiran did his debut with a super hit film Nuvve Kavali, later followed a string of hits Preminchu, Manasunte Chaalu, Darling Darling, Satta. Preminchu film won 4 Nandi Awards, where as Satta won the Best Film award. He also did some t.v serials in which he was portrayed as lord kishna, lord vishnu, lord venkateshwara, etc. Saikiran has involved himself in many animal rescue organizations, including the blue cross. He is the vice president of "Friends of Snakes Society", Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X