»   » టీవీ సీరియల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

టీవీ సీరియల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇప్పటి వరకు మనకు కేవలం వరల్డ్ ఫేమస్ క్రీడాకారిణిగానే మనకు తెలుసు. తర్వాత పలు యాడ్ ఫిల్మ్స్ లో కూడా నటించింది. అయితే త్వరలో ఆమెను మనం నటిగా కూడా చూడబోతున్నాం. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఆమె ఉన్నట్టుండి ఇదేంటని అనుకుంటున్నారా?...ఈ విషయం చెప్పింది స్వయంగా సైనా నెహ్వాలే.

ఓ హిందీ సీరియల్‌లో సైనా నెహ్వాల్ నటిస్తున్నట్లు సైనానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ''హర్ ఘర్ కుచ్ కథా హై'' అనే సీరియల్‌లో సైనా నటిస్తోంది. సీరియల్‌లో ఆమెతో పాటు బాలీవుడ్ కమెడియన్ వినయ్ పాఠక్ కూడా నటిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను కూడా సైనా ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

Saina Nehwal join in Har ghar kuch kehta hai shooting

 
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ అంటే సైనా నెహ్వాల్‌కు చాలా ఇష్టం. ముంబైకి మకాం మార్చడం ద్వారా ఎలాగైనా షారూఖ్‌ను కలవడంతో పాటు ఆయనతో నటించే ఓ చిన్న ఛాన్సైనా కొట్టేయాలని సైనా ఉవ్విళ్లూరుతోందట. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దు కోవాలన్న చందంగా.... క్రీడాకారిణిగా జనాల్లో గుర్తింపు ఉన్నపుడే ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై ఎంట్రీ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఈ రంగంలోకి బాటలు వేసుకుంటోందని అంటున్నారంతా.
English summary
Saina Nehwal join in Har ghar kuch kehta hai shooting.
Please Wait while comments are loading...