For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భారీ రికార్డు : 'భజరంగీ భాయ్‌ జాన్‌' కి 60 కోట్లు యాడ్స్

  By Srikanya
  |

  ముంబై: సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన చిత్రం 'భజరంగీ భాయ్‌ జాన్‌'. రంజాన్‌ సందర్భంగా విడుదల ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రం టీవి భాక్సాఫీస్ వద్దా కలెక్షన్స్ కురిపిస్తోంది.

  నిన్న (ఆదివారం) స్టార్ గోల్డ్ లో ప్రసారం అయిన ఈ చిత్రానికి అక్షరాలా అరవై కోట్ల రూపాయలు యాడ్ రెవిన్యూ వచ్చేటట్లు ఉందని సమాచారం. మొదటి రెండు సార్లు ప్రీమియర్ షోలకు 50 కోట్లు వసూలు అయితే మిగతా షోలకు మరో పది కోట్లు వసూలు చేస్తుందని చెప్పుతున్నారు.

  దాదాపు ఆరుగురు స్పాన్సర్స్ ఈ టీవి ప్రీమియర్ షోకు సైన్ చేసారు. అమిజాన్ ఇండియా, ఆస్క్ మి డాట్ కాం, కార్ వాలే డాట్ కాం, వొడాఫోన్ వంటివి కూడా ఈ స్పాన్సర్స్ లో ఉన్నారు. ఈ సినిమా ప్రీమియర్ షో తర్వాత బాహుబలి షో ప్లాన్ చేస్తున్నారు. దానికీ ఇదే స్ధాయిలో యాడ్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

  Bajrangi Bhaijaan

  ఇదిలా ఉంటే...మరో ప్రక్క

  ఈ చిత్రం విజయంతో రచయిత విజియేంద్రప్రసాద్ స్టార్ రైటర్ గా బాలీవుడ్ లోనూ పాగా వేసారు. అయితే ఇప్పుడు అనుకోని విధంగా ఈ చిత్రంపై కాపీ రైట్ కేసు పడింది. యాభై కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ముంబై కు చెందిన కోర్టులో కేసు వేసారు ఓ టీవీ ప్రొడ్యూసర్.

  వివరాల్లోకి వెళితే... ముంబై హైకోర్టులో డైరక్టర్ మరియు టీవి ప్రొడ్యూసర్ అయిన మహిమ్ జోషి తనదే ఈ కథ అని, తన కథని చౌర్యం చేయటం వల్ల తన కెరీర్ డ్యామేజ్ అయ్యిందని, తనును తాను ఇండస్ట్రీలో లాంచ్ చేసుకునేందుకు రాసుకున్న స్క్రిప్టు అదని కేసు వేసారు. స్క్రీన్ ప్లే నుంచి లొకేషన్స్ వరకూ అంతా తన స్క్రిప్టునే పోలి ఉందని ఆయన కేసు వేసారు. ఈ మేరకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ ను కోర్టుకు సమర్పించారు. డిటేల్డ్ గా తన స్క్రిప్టులోని సీన్స్ కు, సల్మాన్ సినిమాలోని సీన్స్ కు సీక్వెన్స్ కు ఉన్న పోలిక లు చెపుతూ ఆయన ఈ కేసుని ఫైల్ చేసారు. జూలై 2007 లో ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసానని ఆయన ఆధారాలు చూపెడుతున్నాడు.

  Bajrangi Bhaijaan

  ఇక ఈ చిత్రానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు సైతం ఇచ్చింది. ఇక ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన నాటి నుండీ ఇది చిరంజీవి సూపర్ హిట్ చిత్రం పసివాడి ప్రాణం కథ నుంచి ప్రేరణ పొందింది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రిలీజై అంతటా అదే జోరుగా వినిపిస్తోంది. ఈ విషయమై ఈ చిత్రం కథ రచయిత విజియేంద్రప్రసాద్ సైతం నిజమైనన్నట్లు సమాచారం.

  విజియేంద్రప్రసాద్ మాట్లాడుతూ...చిరంజీవి 1987లో నటించిన పసివాడి ప్రాణం చిత్రం నన్ను అప్పట్లో బాగా కదిలించింది. దాన్ని పూర్తి మార్పులతో కాంటెంపరెరీ టచ్ ఇచ్చి చేయాలనుకున్నట్లు తెలిపారు. ఈ లోగా తాను ఓ పాకిస్దానీ జంట...తమ కుమార్తెకు గుండె ఆపరేషన్ నిమిత్తం ఇండియాకు వచ్చినట్లు..అక్కడ ఖర్చు భరించలేక ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నట్లు మీడియాలో వార్త రావటం గమనించానని..కథని సిద్దం చేసానని అన్నారు. పసివాడి ప్రాణం సినిమాలో మూగ అబ్బాయి చుట్టూ కథ తిరిగితే..ఇక్కడ మూగ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది.

  English summary
  The Salman Khan starrer Bajrangi Bhaijaan is expected to fetch Star Gold over Rs.60 crore in advertising and sponsorship revenue in a year's time.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X