For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

  |

  సినిమాల్లోనే కాదు.. బుల్లితెరపై కనిపించే నటీమణులకు కూడా భారీ స్థాయిలో ఫాలోయింగ్ దక్కుతూ ఉంటుంది. తెలుగులో అయితే అది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది బుల్లితెర హీరోయిన్లను మన వాళ్లు అలా ఆదరించిన విషయం తెలిసిందే. అలాంటి వారిలో సమీరా షరీఫ్ ఒకరు. ఎంతో కాలం పాటు వరుసగా సీరియళ్లు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు తల్లి కావడంతో కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సమీరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బిడ్డకు పాలిచ్చే వీడియోను షేర్ చేసింది. ఆమె ఎందుకిలా చేసిందో మీరే చూసేయండి!

  అలా పరిచయం.. బుల్లితెర స్టార్

  అలా పరిచయం.. బుల్లితెర స్టార్

  ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన 'ఆడపిల్ల' అనే సీరియల్‌తో సమీరా షరీఫ్ తెలుగు బుల్లితెరపైకి వచ్చింది. హీరోయిన్‌గా మొదటి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయిన ఆమె.. ఆ తర్వాత 'అభిషేకం', 'భార్యమణి', 'మూడు ముళ్ల బంధం', 'ప్రతిబింబం', 'మంగమ్మ గారి మనవరాలు'తో పాటు పలు తమిళ సీరియళ్లలోనూ నటించింది. తద్వారా స్టార్‌గా ఎదిగింది.

  నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

  అలా రీఎంట్రీ ఇచ్చేసిన సమీరా

  అలా రీఎంట్రీ ఇచ్చేసిన సమీరా

  చాలా కాలం పాటు తెలుగులో వరుస సీరియళ్లతో ఫుల్ బిజీగా గడిపిన సమీరా షరీఫ్.. 'మంగమ్మ గారి మనవరాలు' తర్వాత ఆమె మరో దానిలో నటించలేదు. కానీ, తమిళంలో మాత్రం వరుసగా సీరియల్స్ చేస్తూనే ఉంది. దీంతో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంది. ఇక, ఈ మధ్యనే ప్రముఖ చానెల్‌లో 'అరవింద సమేత' అనే దానితో రీఎంట్రీ ఇచ్చి అలరించింది.

  ‘అదిరింది’ అంటూ యాంకర్‌

  ‘అదిరింది’ అంటూ యాంకర్‌

  సీరియల్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమీరా షరీఫ్.. తెలుగు బుల్లితెరకు సుదీర్ఘ విరామం తీసుకుంది. ఈ క్రమంలోనే కెరీర్‌లో 'అదిరింది' అనే కామెడీ షోతో తొలిసారి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు పది ఎపిసోడ్ల వరకూ అందులో కనిపించిన ఈమె.. ఆ తర్వాత షోకు దూరమైపోయింది. ఆ సమయంలో తనకు చెప్పకుండానే దీని నుంచి తప్పించారని ఆరోపణలు చేసింది.

  ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!

  హీరోతో పెళ్లి.. స్పీడు తగ్గించేసి

  హీరోతో పెళ్లి.. స్పీడు తగ్గించేసి

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే సినీ నటి సన కుమారుడు, సీరియల్ హీరో సయ్యద్ అన్వర్ అహ్మద్‌తో ప్రేమలో పడింది సమీరా. తన సోదరి కోసం అతడితో పరిచయం పెంచుకున్నప్పటికీ.. క్రమంగా అతడి ప్రేమలో మునిగిపోయింది. దీంతో పెద్దలను ఒప్పించి ఈ జంట ఒక్కటైంది. ఇక, వివాహ తర్వాత సమీరా షరీఫ్ స్పీడు తగ్గించేసిందనే చెప్పుకోవాలి.

  ఓ బిడ్డకు తల్లైన సమీరా షరీఫ్

  ఓ బిడ్డకు తల్లైన సమీరా షరీఫ్

  సయ్యద్ అన్వర్ అహ్మద్‌తో వివాహం జరిగిన తర్వాత పర్సనల్ లైఫ్‌ను కూడా సమీరా షరీఫ్ చక్కగా నడుపుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అయింది. అలా కొద్ది రోజుల క్రితమే ఆమె ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి సమీరా షరీఫ్ తన కొడుకుతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. ఇలా తన మాతృత్వాన్ని అనుభవిస్తోంది.

  జాకెట్ లేకుండా యాంకర్ శ్యామల: తొలిసారి ఇలా తెగించి మరీ హాట్ షో

  కొడుకుకు పాలిచ్చే వీడియోతో

  ప్రస్తుతం చేతిలో ఆఫర్లు లేకున్నా సమీరా షరీఫ్ తన పర్సనల్ లైఫ్‌ను చక్కగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ హీరోయిన్ తన కొడుకుకు పాలిచ్చే వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తోంది.

  ఇలా చేస్తారా? ఎందుకో తెలిస్తే

  ఇలా చేస్తారా? ఎందుకో తెలిస్తే

  సమీరా షరీఫ్ తాజాగా తన బిడ్డకు పాలు పడుతోన్న వీడియోను షేర్ చేయడానికి కారణం ఆమె ధరించిన క్లాత్స్‌ను ప్రమోట్ చేయడం కోసమే. అవును.. పాలు పట్టడానికి సౌకర్యవంతంగా ఉండే డ్రెస్‌లు అంటూ ఆ బ్రాండ్‌ను ఆమె ప్రమోట్ చేస్తోంది. మరోవైపు, సమీరా వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే, సెలెబ్రిటీలు పాలు ఇస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

  English summary
  Television Actress and Anchor Sameera Sherief Full Active In Social Media. Now She Shared Milk Feeding Video in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X