»   » బిగ్ బాస్ 16 లక్షల పెనాల్టీపై స్పందించిన సంపూర్ణేష్ బాబు!

బిగ్ బాస్ 16 లక్షల పెనాల్టీపై స్పందించిన సంపూర్ణేష్ బాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో నుంచి హీరో సంపూర్ణేష్ బాబు తనంతటతానుగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అర్దాంతరంగా బయటకు వచ్చిన సంపూకు బిగ్ బాస్ షో నిర్వాహకులు భారీ పెనాల్టీ వేశారని ప్రచారం జరిగింది.

పేద కుటుంబం నుండి వచ్చి ఇప్పుడిప్పుడే నటుడుగా ఎదుగుతున్న సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ పెనాల్టీ చెల్లించడానికి సంపూ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై సంపూ స్పందించారు.

అవన్నీ పుకార్లే

పెనాల్టీ విధించినట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని సంపూ ట్వీట్ చేశాడు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పాడు. షోలో పాల్గొనడానికి తనకు అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ వారికి,

ఎన్టీఆర్ నా రియల్ హీరో

ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు భుజం తట్టి, ధైర్యం నింపేవాడే నిజమైన హీరో, జూనియర్ ఎన్టీఆరే తనకు నిజమైన బిగ్ బాస్ అని సంపూ చెప్పాడు. షో నుంచి బయటకు వచ్చి ప్రేక్షకదేవుళ్లను నిరాశపరిచానని.... అందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపాడు.

ఉండలేక పోయా

ఉండలేక పోయా

మాది చిన్న పల్లెటూరు. ఒక చిన్న నటుడవ్వాలనుకున్నా. కానీ స్టీవెన్ శంకర్ హృదయ కాలేయం ద్వారా హీరో చేశాడు. బిగ్ బాస్ తొలి సీజన్లో అవకాశం రావడం నా అదృష్టం. కానీ నేను ఆ ఇంట్లో ఉండలేక పోయాను. నాకు తెలియకుండా నాలుగు గోడల మధ్య బంధించినట్లు అనిపించింది. బయట అడుగు పెట్టాక తప్పు చేశానని ఫీలయ్యాను. అరగంట ఏడ్చాను అని సంపూ తెలిపారు.

అరగంట ఏడ్చేశాను

అరగంట ఏడ్చేశాను

నేను బయటకు వెళ్లిన తర్వాత నువ్వు వేస్ట్‌రా అంటూ ఫేస్ బుక్ లో చాలా కామెంట్స్ వచ్చాయి. మనుషులంతా ఒకటే, వారి మానసిక స్థితిగతులు వేరు, నా మానసిక స్థితి వేరు, బయటకు వచ్చాక ఎంత పెద్ద తప్పు చేశానని అరగంట ఏడ్చేశాను అని సంపూ తెలిపారు.

English summary
Sampoornesh Babu clarified that the bigg boss organizers asking him for penalty of upto Rs 20 lakhs is just a RUMOR.. 'the real hero is someone who helps you when you are struggling and needs a shoulder for support. NTR did that for me, he is the Real Hero I have seen and he is the Real Bigg Boss for me.' sampoo said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu