For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాపం సంపూ కి 16 లక్షల ఫైన్? ఆ ఫోబియా వల్లనే సంపూర్ణేష్ అక్కడ ఉండలేకపోయాడా??

  |

  బిగ్‌బాస్ షో నుంచి ఒకే ఒక్క స్టార్ గుర్తింపు ఉన్న నటుడు సంపూర్ణేష్ బాబు అర్దాంత‌రంగా వెళ్లిపోవ‌డం బిగ్ బాస్ అభిమానుల‌కు పెద్ద షాక్‌. మొదట్లో బిగ్‌బాస్ అంతా ఓ ఏడుపుగొట్టు షో అయిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. 'బిగ్ బాస్' షో మొదలై పది రోజులు దాటింది. కొందరు ఈ షో గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఇంకొందరు వేస్ట్ అంటున్నారు. రెస్పాన్స్ మిక్స్డ్‌గా ఉన్నప్పటికీ జనాలైతే బాగానే షో చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఎపిసోడ్లు బాలేదంటున్న వాళ్లు కూడా షో చూస్తున్న వాళ్లే అని గుర్తుంచుకోవాలి. అయితే ఇక సంపూ తాను ఇక్క‌డ ఉండ‌లేన‌ని బిగ్ బాస్‌ను వేడుకోవ‌డంతో బిగ్ బాస్ సంపూను బ‌య‌ట‌కు పంపేశాడు.

  కంటతడి పెట్టుకున్నాడు

  కంటతడి పెట్టుకున్నాడు

  కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన మరుసటి రెండు రోజుల్లో సంపూర్ణేష్ పూర్తిగా డీలాపడిపోయాడు. కాస్త ఒత్తిడికి గురవడంతో ఏకంగా కంటతడి పెట్టుకున్నాడు. ఓసారి ఛాతీలో కాస్త నొప్పిగా ఉందని, మెడిసిన్ల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆందోళన పడ్డాడు. దీంతో 'బిగ్ బాస్'గారు నన్ను ఇంటికి పంపించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ విజ్ఞప్తి చేసుకున్నాడు.

  Bigg Boss Telugu: Sampoornesh Babu Cries For Elimination
  ధన్‌రాజ్

  ధన్‌రాజ్

  షోలో మరో సభ్యుడు ధన్‌రాజ్ చొరవ తీసుకుని . టెన్షన్ పడవద్దని, అంతా మంచి జరుగుతుందని నచ్చజెప్పి కూర్చోబెట్టాడు. ఒకవేళ నిజంగానే ఇంటికి వెళ్లాలని ఉంటే మాత్రం మరుసటి వారం అందరితో చెప్పి ఎలిమినేషన్‌లో సంపూ పేరు వచ్చేలా చేస్తామన్నారు.

  ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసి

  ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసి

  తగిన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని సంపూర్ణేష్‌కు 'బిగ్ బాస్' హామీ ఇవ్వడంతో కాస్త కంట్రోల్ అయినట్టే కనిపించినా ఆ రెండో రోజు మాత్రం మామూలుగా కాదు ఒక రేంజిలో రియాక్టయ్యాడు. బిగ్‌బాస్‌ను ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసి బయటకు వచ్చేశాడు.

  పెద్దనష్టమే ఉండబోతోందట

  పెద్దనష్టమే ఉండబోతోందట

  బిగ్ బాస్ షోలో వాతావరణం నచ్చలేదని, తాను ఉండలేకపోతున్నానని ఒక్కసారిగా ఆవేశానికి లోనైన సంపూర్ణేష్ బాబు బిగ్ బాష్ షోకు ఓ నమస్కారం అంటూ.. ఈ షోలో తాను వుండలేనని హౌస్ నుంచి వచ్చేశాడు. అయితే దీనివల్ల సంపూకి పెద్దనష్టమే ఉండబోతోందట.

  కాంట్రాక్ట్ ఉంటుంది

  కాంట్రాక్ట్ ఉంటుంది

  నిజానికి ఈ బిగ్‌బాస్ హౌస్ లో ఉన్నందుకు.. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు గాను రోజుకు ఇంత అంటూ సెలబ్రిటీలకు రెమ్యూనరేషన్ కూడా అందుతోంది. కాకపోతే బయటకు వెళ్ళిపోవాలంటే మాత్రం.. అది కేవలం బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయితే తప్పించి.. ఖచ్చితంగా ఎవరికి వారు మాత్రం వెళ్లకూడదు. అలా వెళ్లకుండా కాంట్రాక్ట్ కూడా ఉంటుంది.

  సూసైడ్ చేసుకుంటా

  సూసైడ్ చేసుకుంటా

  కాకపోతే ఇప్పుడు నన్ను పంపకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ బెదిరించి సంపూర్ణేష్ బాబు బయటకు వెళ్ళిపోయాడు. అందుకు మనోడు కాంట్రాక్ట్ ఉల్లంఘించినట్లే కాబట్టి.. ఫైన్ కట్టాల్సిందేనట. మనోడు ఉన్న రోజులకూ.. ఇప్పుడు వెళిపోయిన దానికి లెక్కగట్టి.. మనోడ్ని ఒక 16 లక్షల ఫైన్ కట్టమనే ఛాన్సుందని టాక్ వినిపిస్తోంది.

  70 రోజులు ఉంటే 70 లక్షలు

  70 రోజులు ఉంటే 70 లక్షలు

  అసలు చివరకు వరకు కనుక సంపూర్ణేష్ కొనసాగి ఉండుంటే.. గెలిచిన ప్రైజ్ మనీ సంగతేమో కాని.. ఏకంగా 60 రోజులు ఉంటే 60 లక్షలు.. 70 రోజులు ఉంటే 70 లక్షలు డబ్బులు వచ్చేవట. మరి అవన్నీ వదిలేసుకుని ఎందుకిలా మనోడు సడన్ గా బిగ్ బాస్ కు బ్రేకప్ చెప్పాశాడో మనోడికే తెలియాలి.

  క్లాస్ట్రోఫోబియా

  క్లాస్ట్రోఫోబియా

  అయితే ఆ హౌస్ లో ఉండటం కూడా అంత ఈజీ పని కాదన్నది విశ్లేషకుల మాట. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళలో క్లాస్ట్రో ఫోబియా లక్షణాలు కనిపిస్తున్నాయన్నది ఆందోళనకు గురి చేసే అంసం. కిటికీలు లేని గదుల్లో, లిఫ్ట్‌లలో, జన సమూహాల్లో ఊపిరాడని భావనను ‘క్లాస్ట్రోఫోబియా' అంటారు.

  English summary
  As Sampoo violated the Bigg Boss rules & agreement he has signed with Bigg Boss show, he had to pay penalty to them. As per the latest buzz, the penalty will be up to Rs.16 lakhs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X